రక్షణ మంత్రిత్వ శాఖ
ఉగ్రవాద నిర్మూలనకు సమష్టిగా కృషిచేయాలి & దానికి మద్దతిచ్చే వారిని జవాబుదారీ చేయాలి : న్యూఢిల్లీలో షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఓ)రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి
ఐక్య రాజ్య సమితి అధికారపత్రంలో పొందుపరచిన అంశాల ప్రాతిపదికగా శాంతి , భద్రత నెలకొల్పాలని ఇండియా విశ్వసిస్తోందని శ్రీ రాజనాథ్ సింగ్ అన్నారు.
ఘనమైన విజయం కోసం ఉభయతారకంగా ఉండే సహకారానికి సంయుక్త ప్రయత్నం అవసరమని పిలుపు
' సురక్షితమైన , సుస్థిరమైన & సంపన్నమైన ప్రాంతమే ప్రతి దేశంలోని ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించగలదు '
'ప్రధానమంత్రి మోడీ రూపొందించిన ‘SECURE’ అనే దార్శనికత ప్రాంత బహుమితీయ సంక్షేమం దిశగా సాగాలన్న ఇండియా కట్టుబాటును ప్రతిబింబిస్తోంది'
సాముదాయక భద్రతా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎస్ సి ఓ సభ్యదేశాల రక్షణ సామర్ధ్యం పెంపునకు కట్టుబడి ఉన్నాం: రక్షణ మంత్రి
Posted On:
28 APR 2023 1:38PM by PIB Hyderabad
ఉగ్రవాదాన్ని అన్ని రూపాలలో నిర్మూలించడానికి, దానికి నిధులు సమకూరుస్తున్న మద్దతుదారులను జవాబుదారీ చేయడానికి షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఓ) సభ్య దేశాలు సమష్టిగా కృషి చేయాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ పిలుపు ఇచ్చారు. న్యూఢిల్లీలో శుక్రవారం షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఓ)రక్షణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ ఏ రకమైన టెర్రరిస్టు చర్య గాని లేక ఏ రూపంలో టెర్రరిజానికి మద్దతు ఇచ్చినా అది మానవత్వానికి వ్యతిరేకంగా పెద్ద నేరమని మరియు శాంతి & సౌభాగ్యం ఈ కంటకభూతంతో కలసి ఉండలేవని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
" ఏ జాతి అయినా టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చినట్లయితే అది ఇతరులకు కాక సొంతానికి కూడా ముప్పుగా మారగలదు. యువతలో విప్లవ తత్వాన్ని పెంచిపోషించడం వల్ల అది దేశ భద్రత విషయంలో ఆందోళన కలిగించే అంశమని, అంతేకాక సమాజ సాంఘిక - ఆర్ధిక ప్రగతి మార్గంలో పెద్ద అవరోధంగా మారగలదు షాంఘై సహకార సంస్థను బలమైన, విశ్వసనీయ అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దడానికి టెర్రరిజాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం మన ప్రాధాన్యత కావాలి' అని రక్షణ మంత్రి అన్నారు.
ప్రాంతీయ సహకారానికి ఒక పటిష్టమైన చట్రాన్ని రూపొందించాలన్నది ఇండియా యోచన అని, సభ్య దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ వారి న్యాయమైన ప్రయోజనాలను కాపాడటం ఆ యోచనలో భాగమని శ్రీ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల మధ్య నమ్మకాన్ని, సహకారాన్ని మరింత పదిలపర్చడానికి ఇండియా ప్రయత్నిస్తోందని ఎందుకంటే ఐక్య రాజ్య సమితి అధికారపత్రంలో పొందుపరచిన అంశాల ప్రాతిపదికగా శాంతి , భద్రత నెలకొల్పాలని భారత్ విశ్వసిస్తోందని ఆయన ఉద్ఘాటించారు.
సభ్య దేశాల సాముదాయక సౌభాగ్యం ఇండియా దర్శిస్తున్న స్వప్నమని ఇందుకోసం అందరం కలసికట్టుగా ప్రయత్నించాలని రక్షణ మంత్రి అన్నారు. పరిమితి లేని సాధ్యతలను సుసాధ్యం చేసుకొని పరస్పర ఉభయతారకంగా అందరి విజయం కోసం కృషి చేద్దామని ఆయన పిలుపు ఇచ్చారు. ఇండియా ఎల్లవేళలా 'కలసికట్టుగా నడుద్దాం & కలసి ముందుకు సాగుదాం' అనే సూత్రాన్ని ఆచరిస్తోందని అన్నారు. ప్రతితరానికి ఒక యుగ ధర్మం, గొప్ప యోచన ఉంటుంది. ప్రస్తుత తరం యోచన ' ఘనమైన విజయం కోసం ఉభయతారకంగా ఉండే సహకారానికి సంయుక్త ప్రయత్నం ' అని రక్షణ మంత్రి అన్నారు.
అదే సమయంలో శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ చైనా లోని కిండావోలో 2018లో జరిగిన ఎస్ సి ఓ సమావేశంలో భద్రతకు సంబంధించి ప్రారంభించిన ‘SECURE’ భావనను రక్షణ మంత్రి విపులీకరించారు. ఆంగ్ల పదం ‘SECURE’ లోని ప్రతి అక్షరం ప్రాంతంలో బహుమితీయ సంక్షేమానికి ఇండియా కట్టుబాటును ప్రతిబింబిస్తోందని మంత్రి అన్నారు.
***
(Release ID: 1920914)
Visitor Counter : 150