మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
భువనేశ్వర్ లో ప్రారంభమైన 3వ విద్యా వర్కింగ్ గ్రూప్ సమావేశం.
జి`20 భారతదేశ అధ్యక్షతన , జి 20 విద్యావర్కింగ్ గ్రూప్ విద్యా విస్తృతి, నాణ్యత, ఫలితాలపెంపుపై ఉమ్మడి కృషి చేస్తోంది: కేంద్ర సహాయ మంత్రి శ్రీ సుభాష్ సర్కార్.
నూతన పనిపరిస్థితులకు అనుగుణంగా యువతకు నైపుణ్యాలు అందించాలి.:శ్రీ సుభాష్ సర్కార్
సామాజిక ప్రయోజనాల కోసం సుస్థిర పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు పరస్పర సహకారానికి మంత్రి పిలుపు.
Posted On:
27 APR 2023 5:42PM by PIB Hyderabad
భారత జి 20 అధ్యక్షతన 3 వ విద్యావర్కింగ్ గ్రూప్ సమావేశం భువనేశ్వర్ లో ఈరోజు ప్రారంభమైంది. తొలి రోజు సమావేశంలో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి శ్రీ సుభాష్ సర్కార్ ప్రారంభోపన్యాసం చేశారు.
కేంద్ర విద్యా శాఖ కార్యదర్శి శ్రీ కె.సంజయ్ మూర్తి, పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ మంత్రి శ్రీ సంజయ్ కుమార్, నైపుణ్యాబివృద్ధి,ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ విభాగం కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారి, వివిధ మంత్రిత్వశాఖల ఉన్నతాధికారులు, ఈ సమావేశంలో పాల్గొన్నారు. 27 కు పైగా దేశాలకు చెందిన 60 మందికి పైగా ప్రతినిధులు, జి 20 దేశాల ప్రతినిధులు , ఈ సమావేశానికి ఆహ్వానితులైన అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాలలో పాల్గొన్నారు. .
అంతర్జాతీయ సంస్థలలో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ , కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో), యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యునిసెఫ్), ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ అండ్ డవలప్‌మెంట్ (ఒఇసిడి) ల ప్రతినిధులు పాల్గొన్నారు.కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి శ్రీ సుభాష్ సర్కార్ ,మాట్లాడుతూ జి 20కి భారత్ అధ్యక్షత లో విద్యా వర్కింగ్ గ్రూప్ సమష్టిగా పనిచేస్తున్నదని, ఉమ్మడి లక్ష్యాలను నెరవేర్చేందుకు సమష్టి కార్యాచరణతో కృషి చేస్తున్నదని, నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు విద్యకు సంబంధించచి మెరుగైన ఫలితాలను సాధించేందుకు కృషి జరుగుతున్నట్టు చెప్పారు.
ప్రస్తుతం కృత్రిమ మేథ,ఇండస్ట్రీ 4.0, వెబ్ 3.0 వంటివి నడుస్తున్న రోజులని, ఇవి పనిప్రదేశాన్ని గణనీయంగా మార్పుచేస్తాయని ఆయన అన్నారు. ఈ పని పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడానికి మన యువతను సన్నద్ధం చేయూలని అందుకు అనుగుణంగా వారికి నైపుణ్యాలు వైఖరులు అలవడేట్లు చేయాలని అన్నారు.
వివిధ రకాల సమస్యలకు ఉమ్మడి పరిష్కారాలను కనుగొనాలని శ్రీ సుభాష్ సర్కార్ పిలుపునిచ్చారు. సమాజానికి ప్రయోజనం కలిగించేలా ఉమ్మడి పరిశోధనలు, ఆవిష్కరణలు సాగాలని అలాగే పెద్ద ఎత్తున పరిశోధనలు సాగాలని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం , సామర్ధ్యాల నిర్మాణం, భవిష్యత్ పనిప్రదేశాల నేపథ్యంలో జీవిత కాలం పొడవునా అధ్యయన ప్రక్రియకు ప్రోత్సాహం అనే అంశంపై సదస్సు జరిగింది.
ఈ సదస్సును నైపుణ్య అభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్ మంత్రిత్వశాఖ సహకారంతో ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెటీరియల్, మినరల్ టెక్నాలజీ (సిఎస్‌ఐఆర్`ఐఎంఎంటి) లో దీనిని నిర్వహించారు.
.ఈ సదస్సు సందర్భంగా వారం రోజుల ఎగ్జిబిషన్ ను కూడా ఏర్పాటుచేశారు. ఈ ఎగ్జిబిషన్ ను కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యుయర్ శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ ప్రారంభించారు.
జి 20 విద్యా కార్యాచరణ సదస్సుకు ముందస్తుగా పలు కార్యక్రమాలను నిర్వహించారు.ఇందులో సెమినార్లు, చర్చాకార్యక్రమాలు, లైఫ్‌లాంగ్ లెర్నింగ్ కు సంబంధించిన పలు అంశాలపై కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో విద్యారంగానికి చెందినవారు,శ్రీన పరిశ్రమ వర్గాల వారు.ప్రభుత్వ ప్రతినిధులు,సింగపూర్ హైకమిషన్ కు చెందిన వారు పాల్గొన్నారు. వీటిలో భవిష్యత్ పని పరిస్థితులలో తోతైన సాంకేతిక తదితర అంశాలను చర్చించారు.
అలాగే సింగపూర్ నమూనా నుంచి నైపుణ్యాల నిర్మాణం, సుపరపాలన నమూనాలను , మౌలిక సదుపాయాల పరివర్తన, తీరప్రాంత ఆర్ధిక వ్యవస్థలపై దృష్టి వంటి అంశాలను కూడా చర్చించారు.
ఈ సదస్సులు, చర్చలలో యువతను భాగస్వాములను చేసేందుకు, 2023 ఏప్రిల్ 1నుంచి ఒరిస్సాదివస్ (ఉత్కళ్ దివస్ )నుంచి నెల రోజుల పాటు జనభాగీదారీ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భువనేశ్వర్ లో జరుగుతున్న 3వ విద్యా జి20 కార్యాచరణ సదస్సుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి యువతను భాగస్వాములను చేస్తూ వివిధ పోటీలు,అవగాహనా ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, యోగా సెషన్‌లు , క్విజ్, వక్లృత్వపోటీలు, జి20 నమూనా సమావేశాల నిర్వహణ వంటి వాటిని ఒరిస్సాలోని 30 జిల్లాలలో ఏర్పాటు చేశారు. ఈ ప్రచార కార్యక్రమాలలో 35 సంస్థలనుంచి సుమారు లక్షమంది వరకు పాల్గొన్నారు.
***
(Release ID: 1920587)