గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'సిటీ బ్యూటీ పోటీ'ని ప్రారంభించిన ఎంఒహెచ్‌యూఏ


యాక్సెసిబిలిటీ, సౌకర్యాలు, సౌందర్యం & జీవావరణపై తీర్పు ఇవ్వనున్న వార్డులు/పబ్లిక్ స్పేస్‌లు

వాటర్‌ఫ్రంట్స్, గ్రీన్ స్పేస్‌లు, టూరిస్ట్/హెరిటేజ్ స్పేస్‌లు మరియు మార్కెట్/వాణిజ్య స్థలాల విభాగంలో షార్ట్‌లిస్ట్ చేయబడిన అందమైన పబ్లిక్ స్పేస్‌లు రాష్ట్ర/జాతీయ స్థాయి అవార్డులతో సత్కరించబడతాయి

Posted On: 27 APR 2023 12:47PM by PIB Hyderabad

"సిటీ బ్యూటీ కాంపిటీషన్" పోర్టల్ https://citybeautycompetition.inని  ఏప్రిల్ 26, 2023న మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ స్థానిక సంస్థలు (యూఎల్‌బిలు) ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ఈ పోటీలో పాల్గొనవచ్చు. అందమైన, వినూత్నమైన మరియు సమగ్రమైన బహిరంగ ప్రదేశాలను రూపొందించడానికి దేశవ్యాప్తంగా నగరాలు మరియు వార్డులు చేసిన ప్రయత్నాలను ప్రోత్సహించడం మరియు గుర్తించడం ఈ పోటీ యొక్క లక్ష్యం.

ఈ పోటీ కింద, నగరాల్లోని వార్డులు మరియు బహిరంగ ప్రదేశాలు ఐదు విశాలమైన అంశాల ఆధారంగా నిర్ణయించబడతాయి, అవి (i) అందుబాటు (ii) సౌకర్యాలు (iii) కార్యకలాపాలు (iv) సౌందర్యం మరియు (v) జీవావరణం. ఈ పోటీ నగరాల్లోని అత్యంత అందమైన వార్డులు మరియు బహిరంగ ప్రదేశాలను సత్కరిస్తుంది. నాలుగు కేటగిరీల క్రింద  ఎంపిక చేయబడిన అత్యంత అందమైన బహిరంగ ప్రదేశాలు నగరం మరియు రాష్ట్ర స్థాయిలలో సత్కరించబడతాయి.  వాటర్ ఫ్రంట్‌లు, గ్రీన్ స్పేస్‌లు, టూరిస్ట్/హెరిటేజ్ స్పేస్‌లు మరియు మార్కెట్/వాణిజ్య ప్రదేశాలు ముందుగా రాష్ట్ర స్థాయిలో సత్కరించబడతాయి మరియు షార్ట్‌లిస్ట్ చేసిన ఎంట్రీలు ఆ తర్వాత జాతీయ స్థాయి అవార్డులకు పరిగణించబడతాయి.

'సిటీ బ్యూటీ కాంపిటీషన్'లో పాల్గొనడానికి చివరి తేదీ జూలై 15, 2023. పాల్గొనే యూఎల్‌బిలు https://citybeautycompetition.in  లో ఆన్‌లైన్ సదుపాయం ద్వారా అవసరమైన డేటా/పత్రాలను (ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు, ప్రెజెంటేషన్ మరియు స్వీయ-నివేదిత బేస్‌లైన్ సమాచారంతో సహా) సమర్పించవచ్చు. ఈ కార్యక్రమంలో  అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సిఐ) నాలెడ్జ్ పార్టనర్‌గా  వార్డులు /యూఎల్‌బిలు / రాష్ట్రాలకు హ్యాండ్‌హోల్డింగ్ మద్దతును అందిస్తుంది.

సిటీ బ్యూటీ కాంపిటీషన్ వార్డులు మరియు నగరాలకు అందమైన బహిరంగ ప్రదేశాలను రూపొందించడంలో వారి చొరవను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుంది. ఈ పోటీ..వారసత్వం మరియు సంస్కృతి, స్థిరమైన సంఘాలు మరియు పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తుంది. అలాగే రాష్ట్రాలు మరియు నగరాల మధ్య అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది.


 

*****


(Release ID: 1920585) Visitor Counter : 150