రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత్-యుకే సంయుక్త సైనిక విన్యాసం “అజేయ వారియర్ – 2023” ప్రారంభం


- యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సాలిస్‌బరీ ప్లేన్స్‌లో ప్రారంభం

Posted On: 27 APR 2023 5:01PM by PIB Hyderabad

భారత దేశం మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌ల (యుకే) మధ్య 7వ ఎడిషన్ ఉమ్మడి సైనిక విన్యాసం “అజేయా వారియర్-2023” యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సాలిస్‌బరీ ప్లెయిన్స్‌లో 27 ఏప్రిల్ నుండి 11 మే 2023 వరకు నిర్వహించబడుతోంది. అజేయా వారియర్ సంయుక్త సైనిక విన్యాసం యునైటెడ్ కింగ్‌డమ్‌తో భారత్ నిర్వహించే ద్వైవార్షిక శిక్షణా కార్యక్రమం. ఈ సైనిక విన్యాసాలు ఒకసారి భారతదేశంలో మరోసారి యుకేలో నిర్వహించబడతాయి. గత చివరి ఎడిషన్ ఉత్తరాఖండ్‌లోని చౌబాటియాలో అక్టోబర్ 2021లో జరిగింది. యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 2 రాయల్ గూర్ఖా రైఫిల్స్ సైనికులు, బీహార్ రెజిమెంట్‌కు చెందిన ఇండియన్ ఆర్మీ సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. ఇండియన్ ఆర్మీ బృందం 26 ఏప్రిల్ 2023న స్వదేశీ ఆయుధాలు మరియు ఇతర పరికరాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ C-17 విమానంలో బ్రైజ్ నార్టన్‌కు చేరుకుంది. ఐక్యరాజ్య సమితి ఆదేశం ప్రకారం పట్టణ మరియు ఉప పట్టణ పరిసరాలలో సంస్థ-స్థాయి ఉప-సాంప్రదాయ కార్యకలాపాలను చేపట్టేటప్పుడు, పరస్పర అభివృద్ధితో పాటు, సానుకూల సైనిక సంబంధాలను నిర్మించడం, ఒకరికొకరు ఉత్తమ పద్ధతులను గ్రహించడం మరియు కలిసి పనిచేసే సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ఈ విన్యాసం యొక్క లక్ష్యం.  రెండు సేనల మధ్య కార్యసాధకత, బోనోమీ, స్నేహాన్ని ఇది విస్తరిస్తుంది.  ఈ విన్యాసం యొక్క పరిధిలో బెటాలియన్ స్థాయిలో కమాండ్ పోస్ట్ వ్యాయామం (సీపీఎక్స్) మరియు కంపెనీ స్థాయి ఫీల్డ్ ట్రైనింగ్ వ్యాయామం (ఎప్టీఎక్స్) ఉంటుంది. ఈ విన్యాసాల  సమయంలో, పాల్గొనేవారు వివిధ అనుకరణ పరిస్థితులలో వారి కార్యాచరణ చతురతను పరీక్షించే వివిధ మిషన్లలో పాల్గొంటారు; వారి వ్యూహాత్మక కసరత్తులను ప్రదర్శించడం మరియు మెరుగుపరచడం మరియు ఒకరికొకరు కార్యాచరణ అనుభవం నుండి నేర్చుకోవడం జరుగుతుంది. భారత సైన్యం మరియు బ్రిటిష్ సైన్యం మధ్య రక్షణ సహకారంలో "ఎక్సర్‌సైజ్ అజెయా వారియర్" అనేది మరో ముఖ్యమైన మైలురాయి, ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందిస్తుంది.

***



(Release ID: 1920580) Visitor Counter : 425