సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మన్ కీ బాత్@100 సందర్భంగా నిర్వహించిన జాతీయ సదస్సులో ప్యానెలిస్ట్‌లకు ప్రత్యేక దేశీయ ఉత్పత్తులు


బహుమతుల్లో కావి, పట్టచిత్ర పెయింటింగ్స్‌ మొదలుకుని ఏటికొప్పాక చెక్క బొమ్మల వరకు ఉన్నాయి

Posted On: 27 APR 2023 5:03PM by PIB Hyderabad

నేషనల్ కాన్‌క్లేవ్ మన్ కీ బాత్@100 సందర్భంగా ప్రముఖులు మరియు ప్యానెలిస్ట్‌లకు దేశవ్యాప్తంగా కళాకారులు తయారు చేసిన ప్రత్యేకమైన ఉత్పత్తులను అందించారు. ఈ కళాకారులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన వివిధ మన్ కీ బాత్ ప్రసంగాలలో సంప్రదాయ కళారూపాలను పునరుద్ధరించినందుకు ప్రశంసించారు.

గోవాకు చెందిన కళాకారుడు శ్రీ సాగర్ ములే రూపొందించిన ప్రత్యేకమైన కావి పెయింటింగ్‌ను ఉపరాష్ట్రపతికి బహుమతిగా అందజేశారు. శ్రీ సాగర్ మూలే కొంకణ్ ప్రాంతంలోని కావి చిత్రాలను ఆధునిక టచ్‌తో తిరిగి ఆవిష్కరిస్తున్నారు. గోవాలోని లేటరైట్ మట్టిలో కనిపించే ప్రకాశవంతమైన ఎరుపు రంగు, సాంప్రదాయ దేవాలయాల నమూనాలు మరియు పండుగల నుండి గ్రామంలోని జీవితం వరకు విభిన్న ఇతివృత్తాలకు జీవం పోసే దిశగా మిక్స్‌డ్ మీడియా నైపుణ్యంతో ఇవి ఉంటాయి. సాగర్ ప్రయత్నాలు శతాబ్దాల నాటి కళారూపాన్ని పునరుద్ధరించాయి. దాని పరిరక్షణపై విస్తృత ఆసక్తిని మరియు దృష్టిని తీసుకువచ్చాయి. డిసెంబర్ 2016లో మన్ కీ బాత్ ద్వారా సాగర్ చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

 

image.png

 

ఇతర ప్రముఖులు మరియు ప్యానెలిస్ట్‌లకు ఒడిశాకు చెందిన భాగ్యశ్రీ సాహు రాతిపై రూపొందించిన పట్టాచిత్ర పెయింటింగ్‌లు మరియు ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన సి వి రాజు తయారు చేసిన ఏటికొప్పాక చెక్క బొమ్మలను బహుమతిగా అందజేశారు.

భాగ్యశ్రీ సాహు తన అద్భుతమైన బ్రష్ స్ట్రోక్‌ల ద్వారా భగవాన్ జగన్నాథునికి నమస్కరించారు. తద్వారా తూర్పు భారతదేశం నుండి ఉద్భవించిన పురాతన కళారూపమైన పట్టచిత్రాన్ని సజీవంగా ఉంచారు.

సాంప్రదాయ పట్టాచిత్రం సహజ వస్త్ర స్క్రోల్స్‌పై చేయగా భాగ్యశ్రీ తన మ్యూజ్‌గా వివిధ పరిమాణాలు మరియు ఆకారాల రాళ్లను ఎంచుకుంది.

 

image.png

 

ఏటికొప్పాక చెక్క బొమ్మలు జీఐ ట్యాగ్ చేయబడిన ఆంధ్రప్రదేశ్ హస్తకళలు. ఇది విజయనగరం రాజుల కాలం నాటి హస్తకళ. చెక్కతో తయారు చేయబడి సహజ రంగులు అద్దుకునే ఈ బొమ్మలు చివరగా లక్కతో పూత పూయబడతాయి. ఇది అనేక కీటకాల యొక్క రంగులేని రెసిన్ స్రావాన్ని కలిగి ఉంటుంది. సివి రాజు ఏటికొప్పాక చెక్క బొమ్మల క్రాఫ్ట్  పురాతన సంప్రదాయాన్ని విజయవంతంగా పునరుద్ధరించారు మరియు తన ప్రయత్నాల ద్వారా క్రాఫ్ట్ కమ్యూనిటీ నాణ్యతను స్పృహలోకి తెచ్చేలా చేయగలిగారు.

 

image.png

 

మన్ కీ బాత్ @100పై నేషనల్ కాన్క్లేవ్‌ను సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నిన్న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించింది. ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంకర్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, శ్రీ అనురాగ్ ఠాకూర్ మరియు శ్రీ అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.

***


(Release ID: 1920578) Visitor Counter : 175