ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముఖ్యమైన మైలురాయిని దాటిన నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా: అక్టోబర్ 2022లో ప్రారంభమైన టెలి మనస్ హెల్ప్‌లైన్‌కు 100,000 పైగా కాల్స్‌


దేశవ్యాప్తంగా అందరికీ నాణ్యమైన మానసిక ఆరోగ్య సంరక్షణ అందించడానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం

27 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 38కి పైగా ఫంక్షనల్ టెలి మనస్ సెల్‌లు..20కి పైగా భాషల్లో మానసిక ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. వీటిలో 1600 మందికి పైగా శిక్షణ పొందిన కౌన్సెలర్‌లు ఫస్ట్ లైన్ సేవలను నడుపుతున్నారు

Posted On: 24 APR 2023 5:03PM by PIB Hyderabad

 

దేశవ్యాప్తంగా అందరికీ నాణ్యమైన మానసిక ఆరోగ్య సంరక్షణ అందించాలన్న ప్రభుత్వ సంకల్పం నెరవేరుతోంది. కేంద్ర ఆరోగ్య మరియు  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన  టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్‌వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ (టెలి మనస్) హెల్ప్‌లైన్ ప్రారంభించిన అక్టోబర్ 2022 నాటినుండి 100,000 కాల్స్‌ను అందుకోవడం ద్వారా మైలురాయిని చేరుకుంది.

కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా చేసిన ట్వీట్‌లో ఈ ఘనత సాధించిన దేశవాసులను అభినందించారు.

 

image.png

 

నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా 10 అక్టోబర్ 2022న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడింది. ప్రస్తుత మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలకు ప్రోత్సాహాన్ని అందించిన డిజిటల్ మెంటల్ హెల్త్ ఎకోసిస్టమ్‌ను రూపొందించడం ఈ సేవ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని మారుమూల ప్రాంతంలో కూడా మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను 24X7 అందించాలని ధ్యేయంగా పెట్టుకుంది. కొవిడ్ నేపధ్యంలో డిజిటల్ మెంటల్ హెల్త్ నెట్‌వర్క్‌ అత్యవసరమయింది. ఈ సేవలు టోల్-ఫ్రీ నంబర్ 14416 / 1800-89-14416 ద్వారా వ్యక్తులందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటాయి.

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ దేశవ్యాప్త సేవ విజయవంతంగా మొదటి 6 నెలల పనితీరును పూర్తి చేసింది. ప్రస్తుతం 27 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 38కి పైగా ఫంక్షనల్ టెలి మనస్ సెల్‌లు విస్తరించి మానసిక ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి. 20 భాషలు మరియు 1600 మంది శిక్షణ పొందిన కౌన్సెలర్లు మొదటి లైన్ సేవలను అందిస్తున్నారు. టెలిమనస్‌కు ఇప్పటివరకు వచ్చిన చాలా కాల్‌లు మానసిక స్థితి, ఒత్తిడి, పరీక్షకు సంబంధించిన ఆందోళన, గృహపరమైన ఆటంకాలు మరియు నిద్ర భంగం వంటి ఇబ్బందులపై వచ్చాయి.

దేశంలో మానసిక ఆరోగ్య సంక్షోభ  నివారణకు కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన టెలి మనస్ కార్యక్రమం ప్రజలు తమ మానసిక ఆరోగ్య సమస్యలకు మద్దతునిచ్చేలా చేయడంలో ఒక వినూత్న కార్యక్రమం.

నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా సామర్థ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా దేశంలోని మానసిక ఆరోగ్య శ్రామికశక్తిని నిర్మించడంపై దృష్టి సారిస్తోంది, అదే సమయంలో మానసిక ఆరోగ్య సేవలు ప్రతి ఇంటికి మరియు ప్రతి వ్యక్తికి ఉచితంగా అందేలా చూస్తుంది, సమాజంలోని అత్యంత దుర్బలమైన మరియు చేరుకోని వర్గాలను లక్ష్యంగా చేసుకుంది.టెలి మనస్ 6 నెలల్లో 1 లక్ష మార్కును చేరుకోవడంతో భారతదేశం అంతటా పటిష్టమైన డిజిటల్ మెంటల్ హెల్త్ నెట్‌వర్క్‌ను నిర్మించాలనే దాని అంతిమ లక్ష్యాన్ని సాధించడంలో ఇది కొత్త మార్గాన్ని సంతరించుకుంది.

 

***


(Release ID: 1919368) Visitor Counter : 169