యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మణిపూర్ లోని ఇంఫాల్ లో జరుగుతున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల యువజనవ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రుల 'చింతన్ శిబిర్'ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
ఈశాన్య రాష్ట్రాలు, మణిపూర్ దేశ క్రీడా సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గణనీయంగా దోహదపడ్డాయి: ప్రధాని
ఈశాన్య రాష్ట్రాలు దేశ సాంస్కృతిక వైవిధ్యానికి కొత్త రంగులను జోడించాయి:దేశ క్రీడా వైవిధ్యానికి కొత్త కోణాలను అందించాయి: ప్రధాని
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆయా రాష్ట్రాల్లో క్రీడలను ఎలా ప్రోత్సహించాలనేఅంశంపై బహిరంగ చర్చ జరపాలి - అనురాగ్ సింగ్ ఠాకూర్
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ (ఎన్ ఎస్. యు) నిర్మాణం పూర్తి కావస్తోంది:క్రీడల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎన్ ఎస్. యు కీలక పాత్ర పోషిస్తుంది: శ్రీ బీరేన్సింగ్
Posted On:
24 APR 2023 5:49PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మణిపూర్ లోని ఇంఫాల్ లో
రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రుల రెండు రోజుల 'చింతన్ శిబిరాన్ని' ఉద్దేశించి వీడియో మెసేజ్ ద్వారా ప్రసంగించారు.
ఈ ఏడాది 'చింతన్ శిబిర్' మణిపూర్ లో జరుగుతుండడం సంతోషకరమని, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పలువురు క్రీడాకారులు దేశానికి పతకాలు సాధించి త్రివర్ణ పతాక వైభవాన్ని చాటారని ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. సగోల్ కాంగ్జాయ్, థాంగ్-తా, యుబి లక్పీ, ముక్నా, హియాంగ్ తనాబా వంటి ఈశాన్య ప్రాంత స్వదేశీ క్రీడలను ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అవి తమ స్వంత ముద్రతో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు. ‘‘ఈశాన్య రాష్ట్రాలు, మణిపూర్ లు దేశ క్రీడా సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో గణనీయంగా దోహదం చేశాయని‘‘ మోదీ పేర్కొన్నారు.
దేశవాళీ ఆటలను మరింత వివరిస్తూ, కబడ్డీని పోలిన మణిపూర్ కు చెందిన ఓ-లావాబీ గురించి ప్రస్తావిస్తూ, హియాంగ్ తనాబా కేరళ బోట్ రేస్ ను గుర్తు చేస్తుందని తెలిపారు. పోలోతో మణిపూర్ కు ఉన్న చారిత్రక అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు.ఈశాన్య రాష్ట్రాలు దేశ సాంస్కృతిక వైవిధ్యానికి కొత్త రంగులను జోడిస్తాయని, దేశ క్రీడా వైవిధ్యానికి కొత్త కోణాలను అందిస్తాయని అన్నారు. 'చింతన్ శిబిర్' ముగింపులో దేశవ్యాప్తంగా ఉన్న క్రీడామంత్రులకు ఒక అభ్యాస అనుభవం లభిస్తుందని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
"ఏ చింతన్ శిబిరమైనా ఆలోచనతో ప్రారంభమవుతుంది, ఆలోచనతో కొనసాగుతుంది . అమలుతో ముగుస్తుంది" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు, చింతన్ శిబిరం ప్రాముఖ్యతను చెబుతూ, భవిష్యత్తు లక్ష్యాలను చర్చించాల్సిన అవసరాన్ని ,
గత సమావేశాలను సమీక్షించాల్సిన అవసరాన్ని గురించి స్పష్టం చేశారు. 2022లో కెవాడియాలో జరిగిన మునుపటి సమావేశాన్ని గుర్తు చేసిన ప్రధాన మంత్రి, అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించామని, క్రీడల మెరుగుదల కోసం పర్యావరణ వ్యవస్థ కోసం రోడ్ మ్యాప్ రూపొందించడానికి ఒక ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు.
క్రీడారంగంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచడం లో సాధించిన పురోగతిని ప్రధాని వివరించారు. ఈ సమీక్ష విధానాలు, కార్యక్రమాల స్థాయిలో కాకుండా మౌలిక సదుపాయాల అభివృద్ధి, గత ఏడాది క్రీడా విజయాలపై జరగాలని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, పంజాబ్ గవర్నర్ , చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ శ్రీ బన్వరీ లాల్ పురోహిత్, మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ బీరెన్ సింగ్, కేంద్ర కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ, హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిశిత్ ప్రామాణిక్, యువజన వ్యవహారాల కార్యదర్శి మీటా ఆర్ లోచన్, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ కార్యదర్శి సుజాత చతుర్వేది, మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజేష్ కుమార్ చింతన్ శిబిర ప్రారంభ సమావేశంలో పాల్గొన్నారు.
WhatsApp Image 2023-04-24 at 4.18.59 PM.jpeg
శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్
కీలకోపన్యాసం చేస్తూ, కేవలం 36 లక్షల తక్కువ జనాభా ఉన్నప్పటికీ, ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే మణిపూర్ క్రీడా రంగం అభివృద్ధికి ఎంతో దోహదపడిందని అన్నారు. ఈ కృషిని గుర్తించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మణిపూర్ రాష్ట్రానికి మొట్టమొదటి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేశారని, విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి సుమారు రూ.900 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలిపారు. మణిపూర్ లో స్వదేశీ ఆటలకు ఉన్న ఆదరణ గురించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కూడా ఖేలో ఇండియాలో అనేక స్వదేశీ క్రీడలను చేర్చిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఆయా రాష్ట్రాల్లో క్రీడలను ఎలా ప్రోత్సహించాలనే అంశంపై బహిరంగ చర్చ జరపాలన్నారు.
DSC_2317.JPG
రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు సాధించిన విజయాలను కూడా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మణిపురి క్రీడాకారుల క్రీడాస్ఫూర్తిని ప్రస్తావించారు.
దేశం గర్వించేలా చేసిన క్రీడాకారులను ఆయన అభినందించారు.గర్వించదగిన మరింత మంది క్రీడాకారులను తీసుకురావడానికి ఇతర రాష్ట్రాలు అదనపు కృషి చేయగవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీ అనురాగ్ ఠాకూర్ తన ప్రసంగాన్ని మగిస్తూ, సమావేశం లో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల క్రీడా మంత్రులు తమ అనుభవాలను పంచుకోవాలని , తమ రాష్ట్రాల్లో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి వారు చేపట్టిన కార్యక్రమాలను ప్రదర్శించాలని సూచించారు. ఒకరి అనుభవాల నుంచి మరొకరు పాఠాలు నేర్చుకోవాలని, భారత్ ను స్పోర్ట్స్ సూపర్ పవర్ గా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా పని చేయాలని అన్నారు.
మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ బీరెన్ సింగ్, మాట్లాడుతూ, భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ రాష్ట్రంలోని 16 జిల్లాలలో 32 ఖేలో ఇండియా కేంద్రాలను ప్రారంభించడానికి ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్చరీ, హాకీ, వెయిట్ లిఫ్టింగ్ మూడు క్రీడాంశాల్లోనూ ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీ (ఎన్ ఎస్ యు ) నిర్మాణం కూడా జరుగుతోందని, భారతదేశంలో క్రీడల భవిష్యత్తును రూపొందించడంలో విశ్వవిద్యాలయం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు.
పిపిపి మోడల్ ద్వారా , ఎక్స్ టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులుగా ఖుమన్ లాంపాక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అప్ గ్రేడ్ చేయడం కూడా జరుగుతోందని శ్రీ ఎన్ బీరెన్ తెలియజేశారు. ప్రైవేట్ భాగస్వాముల సహకారంతో యువ వర్ధమాన అథ్లెట్ల శిక్షణలో స్పోర్ట్స్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, వీడియో విశ్లేషణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దోహదపడతాయి.
సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ నిశిత్ ప్రామాణిక్ మాట్లాడుతూ దేశంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కొత్త పథకాలను రూపొందిస్తోందన్నారు. సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు మణిపూర్ అనువైన ప్రాంతమని, రాష్ట్రాలు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి, క్రీడల ప్రోత్సాహానికి కలిసి పనిచేయడానికి స్ఫూర్తిదాయకమైన ప్రదేశం అని ఆయన అన్నారు.
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఇంఫాల్ లోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు,, హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్ తో కలసి ప్రారంభించారు. ఇంఫాల్ లోని సిటీ కన్వెన్షన్ సెంటర్ లో చింతన్ శిబిర్ లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మిషన్ లైఫ్, నైన్ సాల్ సేవ, సుశాసన్, గరీబ్ కల్యాణ్ లపై ఫోటో ఎగ్జిబిషన్ నిర్వహించారు.
DSC_2208.JPG
యువ పోర్టల్, జాతీయ యువజన ఉత్సవ పునర్నిర్మాణం, ఖేలో ఇండియా ఇంకా భారత ప్రభుత్వ ఇతర పథకాల అవలోకనం, క్రీడా రంగంలో సృజనాత్మకత అనే అంశాలపై చింతన్ శిబిర సాంకేతిక సెషన్లలో ప్రజెంటేషన్ ఇంటరాక్టివ్ సెషన్లు జరిగాయి.
****
(Release ID: 1919365)
Visitor Counter : 180