వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప‌రిశ్ర‌మ‌లు, అంత‌ర్గ‌త వాణిజ్య ప్రోత్సాహ విభాగం కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన శ్రీ రాజేష్ కుమార్ సింగ్‌

Posted On: 24 APR 2023 2:14PM by PIB Hyderabad

వాణిజ్య, ప‌రిశ్ర‌మ‌ల‌ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ప‌రిశ్ర‌మ‌లు & అంత‌ర్గ‌త వాణిజ్య ప్రోత్సాహం విభాగం  ప్ర‌స్తుత కార్య‌ద‌ర్శిగా ఉన్న శ్రీ అనురాగ్ జైన్‌, ఐఎఎస్ (ఎంపిః 89) ను రోడ్డు ర‌వాణా హైవేల మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శిగా నియ‌మించిన త‌ర్వాత ఆయ‌న స్థానంలో  శ్రీ రాజేష్ కుమార్ సింగ్ ఐఎఎస్ (కెఎల్ః 89) బాధ్య‌త‌లు స్వీక‌రించారు. దీనికి ముందు ఆయ‌న మ‌త్స్య‌, ప‌శు సంవ‌ర్ధ‌క & పాడి ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని ప‌శు సంవ‌ర్ధ‌క & పాడి ప‌రిశ్ర‌మ‌ల కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. 
భార‌తీయ అడ్మినిస్ట్రేటివ్ స‌ర్వీస్ అధికారి అయిన శ్రీ రాజేష్‌కుమార్ సింగ్ కేర‌ళ కేడ‌ర్‌కు చెందిన 1989వ బ్యాచ్ అధికారి. కేంద్ర ప్ర‌భుత్వంలో ఆయ‌న డిడిఎ క‌మిష‌న‌ర్‌గా, పెట్రోలియం & స‌హ‌జ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శిగా, వ్య‌వ‌సాయం, స‌హ‌కార & రైతాంగ సంక్షేమ‌ విభాగం సంయుక్త కార్య‌ద‌ర్శిగా, ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా చీఫ్ విజిలెన్స్ అధికారిగా వంటి అనేక ముఖ్య‌మైన బాధ్య‌త‌ల‌ను పోషించారు. అంతేకాకుండా, ఆయ‌న కేర‌ళ ప్ర‌భుత్వంలో రాష్ట్ర కార్య‌ద‌ర్శిగా, న‌గ‌రాభివృద్ధి & ఆర్ధిక కార్య‌ద‌ర్శిగా ప‌ని చేశారు. 

 

***
 



(Release ID: 1919234) Visitor Counter : 122