కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోర్టల్ ప్రయోజనాన్ని మెరుగుపరచడానికి మరియు అసంఘటిత కార్మికులకు రిజిస్ట్రేషన్ సౌలభ్యం కోసం ఈశ్రమ్‌ పోర్టల్‌లో కొత్త ఫీచర్లను ప్రారంభించిన శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 24 APR 2023 1:29PM by PIB Hyderabad

కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా మరియు మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో కేంద్ర కార్మిక & ఉపాధి మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈరోజు ఈశ్రమ్ పోర్టల్‌లో కొత్త ఫీచర్లను ప్రారంభించారు.

 

image.png

( కార్మిక & ఉపాధి మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పులశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ద్వారా ఈశ్రమ్‌ పోర్టల్‌లో కొత్త ఫీచర్ల ప్రారంభం)

ఈశ్రమ్‌ పోర్టల్‌లో జోడించిన కొత్త ఫీచర్లు ఈ పోర్టల్ వినియోగాన్ని మరింత మెరుగుపరుస్తాయి. అలాగే  అసంఘటిత కార్మికులకు రిజిస్ట్రేషన్ సౌలభ్యాన్ని సులభతరం చేస్తాయి. ఈశ్రమ్‌ నమోదిత కార్మికులు ఇప్పుడు ఈశ్రమ్‌ పోర్టల్ ద్వారా ఉపాధి అవకాశాలు, నైపుణ్యం, అప్రెంటీస్‌షిప్, పెన్షన్ స్కీమ్, డిజిటల్ స్కిల్లింగ్ మరియు రాష్ట్రాల పథకాలతో కనెక్ట్ కావచ్చు.

 

image.png

 

వలస కార్మికుల కుటుంబ వివరాలను క్యాప్చర్ చేసే ఫీచర్ ఈశ్రమ్‌ పోర్టల్‌కు జోడించబడింది. కుటుంబంతో సహా వలస వచ్చిన వలస కార్మికులకు బాల విద్య మరియు మహిళా కేంద్ర పథకాలను అందించడంలో ఈ సదుపాయం సహాయపడుతుంది. ఇంకా సంబంధిత బిల్డింగ్ అండ్ అదర్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ (బిఓసిడబ్ల్యూ) వెల్ఫేర్ బోర్డ్‌తో ఇశ్రమ్‌లో నమోదు చేసుకున్న నిర్మాణ కార్మికుల డేటాను పంచుకోవడానికి కొత్త ఫీచర్ జోడించబడింది. ఈశ్రమ్ నిర్మాణ కార్మికులను సంబంధిత బిఓసిడబ్ల్యూ బోర్డుతో నమోదు చేయడానికి మరియు పథకాలకు ప్రాప్యతను నిర్ధారించడానికి ఇది ఉద్దేశించబడింది.

రాష్ట్ర/యుటి ప్రభుత్వాలతో ఈశ్రమ్‌ డేటాను పంచుకోవడానికి కేంద్ర మంత్రి అధికారికంగా డేటా షేరింగ్ పోర్టల్ (డిఎస్‌పి)ని కూడా ప్రారంభించారు. డేటా షేరింగ్ పోర్టల్ ఈశ్రమ్‌లో నమోదైన అసంఘటిత కార్మికుల కోసం సామాజిక భద్రత/సంక్షేమ పథకాల లక్ష్య అమలు కోసం సురక్షిత పద్ధతిలో ఆయా రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలతో ఈశ్రమ్‌ లబ్ధిదారుల డేటాను పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఇటీవల, ఈ స్కీమ్‌ల ప్రయోజనాలను ఇంకా అందుకోని ఈశ్రమ్‌ రిజిస్ట్రన్ట్‌లను గుర్తించడానికి మంత్రిత్వ శాఖ ఈశ్రమ్‌ డేటాతో వివిధ స్కీమ్‌ల డేటాను మ్యాపింగ్ చేయడం ప్రారంభించింది. సాంఘిక సంక్షేమం/భద్రతా పథకాల ప్రయోజనాలను ఇంకా పొందని అసంఘటిత కార్మికులను రాష్ట్రాలు/యూటీలు గుర్తించి, ప్రాధాన్యతపై వారికి పథకాల ప్రయోజనాలను అందించగల ఈ డేటా ఆధారంగా రాష్ట్రాలు/యూటీలతో కూడా భాగస్వామ్యం చేయబడుతోంది.

కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ దేశంలోని కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆధార్‌తో సీడ్ చేయబడిన అసంఘటిత కార్మికుల సమగ్ర జాతీయ డేటాబేస్‌ను రూపొందించడానికి మంత్రిత్వ శాఖ 26 ఆగస్టు 2021న ఈశ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. 21 ఏప్రిల్ 2023 నాటికి 28.87 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఈశ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.


 

*****


(Release ID: 1919185) Visitor Counter : 218