రైల్వే మంత్రిత్వ శాఖ
ఈ నెల 28న, 'భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్' ద్వారా పూరి-గంగాసాగర్ దివ్య కాశీ యాత్రను ప్రారంభించనున్న రైల్వే శాఖ
“దేఖో అప్నా దేశ్”, “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమాల కింద పూరి-గంగాసాగర్ దివ్య కాశీ యాత్రను పుణె నుంచి ప్రారంభించనున్న రైల్వే శాఖ
పూరి, కోల్‌కతా, గయ, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లోని ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలను చుట్టి వచ్చేలా 9 రాత్రులు/10 పగళ్ల యాత్ర
జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయం, లింగరాజ్ ఆలయం, కాళీ బరి, విష్ణు కుండ్ ఆలయం, కాశీ విశ్వనాథ దేవాలయం వంటి అనేక దివ్య క్షేత్రాలను సందర్శించేందుకు పర్యాటకులకు అవకాశం
భారత్ గౌరవ్ ట్రైన్‌లోని ప్రత్యేకమైన ఎల్‌హెచ్‌హీ రేక్‌లో సౌకర్యవంతమైన రైలు ప్రయాణం, రైలులో ఉన్నప్పుడు & లేనప్పుడు భోజనం, రహదారి ప్రయాణం, ప్రకృతి వీక్షణం, వసతి ఏర్పాట్లతో కూడిన ప్యాకేజీ అందిస్తున్న ఐఆర్‌సీటీసీ
7 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 3 ఏసీ-3 టైర్, 1 ఏసీ-2 టైర్ కోచ్‌లతో 750 మంది ప్రయాణికుల కోసం 3 విభాగాల్లో పర్యటన ప్యాకేజీని అందిస్తున్న ఐఆర్‌సీటీసీ
Posted On:
23 APR 2023 3:37PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'దేఖో అప్నా దేశ్', 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' వంటి పర్యాటక కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 'భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్'లను రైల్వే మంత్రిత్వ శాఖ నడుపుతోంది. భారతదేశాన్ని జాతీయ, అంతర్జాతీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమాల ఉద్దేశం. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు భారతదేశ గొప్ప సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
ఈ నెల 28న, పూరి నుంచి గంగాసాగర్ దివ్య కాశీ యాత్రను ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. సనాతన్ ధర్మ పేరిట నడిచే ఈ ప్రత్యేక రైల్లో అన్ని సీట్లు ఇప్పటికే నిండిపోయాయి. 9 రాత్రులు/10 పగళ్ల పాటు సాగే యాత్రలో పూరి, కోల్‌కతా, గయా, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లోని ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలను పర్యాటకులు సందర్శిస్తారు. పూరిలోని జగన్నాథుడి ఆలయం, కోణార్క్ ఆలయం, పూరిలోని లింగరాజ్ ఆలయం, కోల్‌కతాలోని కాళీ బరి, గయలోని గంగా సాగర్, విష్ణు కుండ్ ఆలయం, బోధ్ గయ, వారణాసిలోని కాశీ విశ్వనాథుడి ఆలయం, గంగా ఘాట్, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వంటి అత్యంత ప్రసిద్ధ దేవాలయాలు మరియు ఇతర తీర్థ స్థలాలను పర్యాటకులు చూడవచ్చు.
భారత్ గౌరవ్ ట్రైన్ ద్వారా ప్రత్యేక ఎల్‌హెచ్‌బీ రేక్‌లో సౌకర్యవంతమైన ప్రయాణం, రైలులో ఉన్నప్పుడు & లేనప్పుడు భోజనం, రహదారి ప్రయాణం & ప్రకృతి వీక్షణం కోసం మంచి బస్సులు, ప్రయాణ ప్రణాళిక ప్రకారం వసతి ఏర్పాటు, భద్రత, ప్రయాణ బీమా, పర్యటన సమయంలో రక్షణ, వసతి సేవలు, రైలు ప్రయాణ సమయంలో వినోద కార్యక్రమాలు వంటి వాటిని ఐఆర్‌సీటీసీ అందిస్తోంది.
7 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 3 ఏసీ-3 టైర్, 1 ఏసీ- 2 టైర్ కోచ్‌లతో ఎకానమీ, కంఫర్ట్, డీలక్స్ విభాగాల్లో ఈ పర్యటనను ఐఆర్‌సీటీసీ అందిస్తోంది. మొత్తం 750 మంది ప్రయాణికులకు బుకింగ్‌లను అందిస్తోంది. ఎకానమీ విభాగానికి ఎక్కువ బుకింగ్‌లు కేటాయించింది.
పర్యటన ధర ఆకర్షణీయంగా, రైలు ఆక్యుపెన్సీని పెంచేలా ఉంటుంది. అందమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఆస్వాదించడానికి, ఈ పవిత్ర యాత్రలో తమను తాము తెలుసుకోవడానికి వచ్చే సనాతన్ ధర్మ ప్రయాణీకులను స్వాగతించడానికి భారతీయ రైల్వే సిద్ధంగా ఉంది.
***
(Release ID: 1919020)
Visitor Counter : 186