సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ 30న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నిర్వహించనున్న 100వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో వినేలా చూసేందుకు చర్యలు తీసుకోవాలి.పిఆర్ఐ ప్రతినిధులకు సూచించిన కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింగ్


తన లోక్‌సభ నియోజకవర్గం పిఆర్ఐ ప్రతినిధులతో ఆన్‌లైన్‌లో మాట్లాడిన మంత్రి

Posted On: 23 APR 2023 4:59PM by PIB Hyderabad

తన లోక్‌సభ నియోజకవర్గం  పనిచేస్తున్న పిఆర్ఐ ప్రతినిధులతో కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్, అణుశాస్త్రం, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ ( స్వతంత్ర బాధ్యత) ఈ రోజు  ఆన్‌లైన్ లో మాట్లాడి వివిధ అంశాలపై  వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. 

పంచాయతీ రాజ్ సంస్థలకు చెందిన  డీడీసీ, బీడీసీ, సర్పంచులు,మున్సిపల్ కౌన్సిలర్‌లతో సహా పలువురు మంత్రితో మాట్లాడారు. నియోజకవర్గంలో మారుమూల, సుదూర ప్రాంతాలకు చెందిన  పిఆర్ఐ ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కథువా జిల్లా, ఇతర పహాడీ ప్రాంతాల్లో ఉన్న బని, బసోహ్లి, బిల్లవార్ ప్రాంతాలకు చెందిన  .పిఆర్ఐ ప్రతినిధులు మంత్రితో ఆన్‌లైన్ లో మాట్లాడారు. కతువాతో ఇతర జిల్లాకు చెందిన సర్పంచ్‌లు, పంచ్‌ల ప్రతినిధులు కూడా మంత్రితో మాట్లాడారు. 

 

దాదాపు మూడు గంటల సేపు కార్యక్రమం జరిగింది. పిఆర్ఐ ప్రతినిధులు, పార్టీ సభ్యులను రెండు బృందాలుగా విభజించి కార్యక్రమాన్ని నిర్వహించారు. విడివిడిగా జరిగిన సమావేశాల్లో మంత్రి సమావేశానికి హాజరైన వారందరితో వ్యక్తిగతంగా మాట్లాడారు. పార్లమెంట్ సభ్యునిగా మంత్రి వారానికి ఒకసారి నియోజకవర్గంలో ఒక జిల్లాలో పర్యటించడం ప్రారంభించారు. పర్యటన సమయంలో స్వయంగా కలవలేక పోయిన ప్రాంతాలకు చెందిన వారితో మంత్రి  ఆన్‌లైన్‌లో మాట్లాడుతున్నారు. 

నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని తాజా సమాచారం, ఇటీవల ఆమోదించిన  కొత్త అభివృద్ధి పనుల వివరాలను  కేంద్ర మంత్రి వివరించారు. 

ఏప్రిల్ 30న ప్రసారం కానున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినాలని పిఆర్ఐ ప్రతినిధులకు మంత్రి సూచించారు. పేద సంఖ్యలో ఒకచోట ప్రజలు కూర్చోవడానికి ఏర్పాట్లు చేసి అందరూ కలిసి కార్యక్రమం వినేలా చూడాలని ఆయన అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశాధినేత నిర్వహిస్తున్న 100వ మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వేడుకలా జరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశం వివిధ ప్రాంతాల్లో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ కార్యక్రమాల వివరాలు ప్రజలకు వివరించడానికి ప్రారంభించిన కార్యక్రమం అంతరాయం లేకుండా కొనసాగడం ఒక రికార్డు అని ఆయన తెలిపారు.

నియోజకవర్గంలో అమలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రతినిధులకు మంత్రి వివరించారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భారత్‌మాల పథకం కింద కీలకమైన చటర్‌గల్లా సొరంగం  నిర్మాణానికి ఆమోదం లభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  సొరంగం  నిర్మాణానికి తుది అనుమతులు రావాల్సి ఉందన్నారు. సొరంగంనిర్మాణం పూర్తైన  తర్వాత పంజాబ్ సరిహద్దులోని లఖన్‌పూర్ నుంచి  బసోలి-బాని మీదుగా జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా వరకు అన్ని వాతావరణ కొత్త జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందన్నారు.  పర్యాటకులను ఆకర్షించడం తో పాటు ఆదాయం, ఉపాధి సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రాజెక్టు ప్రాంతం రూపురేఖలు మారుస్తుందన్నారు.  

 రాబోయే సంవత్సరంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పధకం కింద చేపట్టనున్న రహదారుల వివరాలను మంత్రి ప్రతినిధులకు వివరించారు. పీఎంజీఎస్‌వై పథకం కింద ఏ రహదారిని నిర్మించాలనే దానిపై ఎంపీల జోక్యం లేకుండా పంచ్‌లు, సర్పంచ్‌లు, డీడీసీ సభ్యులు, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సూచనలకు  ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.దీనిని దృష్టిలో ఉంచుకుని తమకు అవసరమైన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి సంబంధించిన వివరాలు  వీలైనంత త్వరగా సంబంధిత అధికారులకు అందించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రతినిధులకు సూచించారు. 
కథువాలో జుథానా గ్రామం పనుల్లో జాప్యం అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్రపాలిత అధికారులతో చర్చలు జరిపామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించి, పూర్తి చేయడానికి పెండింగ్‌లో ఉన్న కొన్ని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ముఖ్య కార్యదర్శి  శైలేంద్ర కుమార్ సింగ్ వ్యక్తిగతంగా ఈ అంశంపై దృష్టి సారించి పని చేస్తున్నారని మంత్రి తెలిపారు. 

 


బిల్లావర్‌లో ప్రతిపాదిత కేంద్రీయ విద్యాలయం నిర్మాణ అంశాన్ని చర్చించేందుకు  కథువా డిప్యూటీ కమిషనర్ తో రేపు ప్రజా ప్రతినిధుల సమావేశాన్నిఏర్పాటు చేస్తూ మంత్రి ఆదేశాలు జారీచేశారు. 
రేషన్‌కార్డులు తదితర సమస్యలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో రేపు సమావేశం నిర్వహించి తాజా సమాచారం  ఇవ్వాలని డివిజనల్‌ కమిషనర్‌ జమ్ము రమేష్‌కుమార్‌కు మంత్రి సూచించారు.

 

***



(Release ID: 1919019) Visitor Counter : 156