యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మ‌ణిపూర్‌లో రాష్ట్రాలు, యుటిల యువ‌జ‌న వ్య‌వ‌హారాలు & క్రీడ‌ల మంత్రులతో జ‌రుగ‌నున్న‌ చింత‌న శిబిరానికి అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి

Posted On: 23 APR 2023 6:18PM by PIB Hyderabad

రాష్ట్ర/  కేంద్ర పాలిత ప్రాంతాల యువ‌జ‌న వ్య‌వ‌హారాలు & క్రీడ‌ల మంత్రుల‌తో  24-25 ఏప్రిల్‌న  రెండు రోజుల పాటు మ‌ణిపూర్‌లోని ఇంఫాల్లో జ‌రుగ‌నున్న చింతన్ శిబిరానికి కేంద్ర యువ‌జ‌న వ్య‌వ‌హారాలు & క్రీడ‌ల (ఎంవైఎఎస్‌) శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ అధ్య‌క్ష‌త వ‌హించ‌నున్నారు. 
ప్ర‌త్యేక‌మైన రెండు రోజుల చింత‌న శిబిరానికి వివిధ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు చెందిన 100మందికి పైగా అతిధులు హాజ‌రై, భార‌త‌దేశాన్ని ప్ర‌పంచంలో అతి పెద్ద క్రీడా శ‌క్తుల‌లో ఒక‌టిగా మార్చ‌డంపై త‌మ అభిప్రాయాల‌ను, ఆలోచ‌న‌ల‌ను స‌మావేశం ముందుంచ‌నున్నారు.  వ్య‌క్తిత్వ నిర్మాణం, దేశ నిర్మాణం అన్న రెండు ల‌క్ష్యాలు, అంటే యువ‌త‌ను వివిధ దేశ నిర్మాణ సంబంధిత కార్య‌క‌లాపాల‌లో నిమ‌గ్నం చేయ‌డం ద్వారా  వారి వ్య‌క్తిత్వాన్ని నిర్మించడందిశ‌గా ప‌ని చేసేందుకై చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. 
గ‌త ఏడాది, జూన్ 2022న గుజ‌రాత్‌లోని కేవ‌డియాలో రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల యువ‌జ‌న వ్య‌వ‌హారాలు & క్రీడ‌ల మంత్రుల‌తో జ‌రిగిన రెండు రోజుల జాతీయ స‌ద‌స్సుకు కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్  అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ సెష‌న్ లో, రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు క్రీడ‌ల‌ను ముందుకు తీసుకువెళ్ళేందుకు మార్గాల‌ను, ప్ర‌ణాళిక‌ల‌ను చ‌ర్చించారు. 

***


(Release ID: 1919018) Visitor Counter : 170