ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సిమ్లాలో శానిటరీ నాప్‌కిన్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై ప్రధానమంత్రి ప్రశంస

प्रविष्टि तिथि: 22 APR 2023 9:11AM by PIB Hyderabad

   సిమ్లాలో ఏర్పాటు చేసిన శానిటరీ న్యాప్‌కిన్ ప్లాంట్ మహిళల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు వారి సాధికారతకు దోహదం చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

దీనిపై ఎంపీ శ్రీ సురేష్‌ కశ్యప్‌ ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:

“సిమ్లాలోని ఈ శానిటరీ న్యాప్‌కిన్ ప్లాంట్ మహిళా సాధికారత దిశగా చేపట్టిన ప్రశంసనీయ కృషికి నిదర్శనం. ఇది వారి ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా ఉపాధి మార్గం కూడా కావడం ఎంతో సంతోషించాల్సిన అంశం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS


(रिलीज़ आईडी: 1918777) आगंतुक पटल : 155
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam