జల శక్తి మంత్రిత్వ శాఖ
సమర్థవంతంగా జలశక్తి అభియాన్ అమలుకు సన్నాహాలపై సమీక్ష: వర్షపు నీటిని ఒడిసి పట్టడం (క్యాచ్ ది రెయిన్) పై పట్టణ ప్రాంతాల్లో ప్రచారం
సంయుక్తంగా ప్రగతి సమీక్షా సమావేశం నిర్వహించిన జలవనరుల శాఖ, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శులు
నీటి ఎద్దడి ఉన్న 150 జిల్లాల్లో వనరుల సుస్థిరతపై దృష్టి సారించనున్న జె ఎస్ ఎ క్యాంపెయిన్
Posted On:
21 APR 2023 5:48PM by PIB Hyderabad
జలశక్తి అభియాన్ ను సమర్థవంతంగా అమలు చేయడానికి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో సన్నాహక పనుల పురోగతిని సమీక్షించడానికి జల వనరులు, ఆర్ డి, జిఆర్, జల్ శక్తి మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ -పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శులు సంయుక్తంగా ఒక సమావేశాన్ని నిర్వహించారు:
క్యాచ్ ది రెయిన్ (జెఎస్ఎ: సీటీఆర్) క్యాంపెయిన్ -2023: ఈ సమావేశంలో వివిధ మునిసిపల్ కమిషనర్లు, లాభాపేక్షలేని సంస్థలు, వ్యక్తులు చేపట్టిన ఆదర్శవంతమైన కార్యక్రమాలను వివరించే పట్టణ ప్రాంతాల ప్రగతి నివేదికపై చర్చించారు. విలువైన వనరులను పరిరక్షించేందుకు భూగర్భ జలాల రీచార్జితో పాటు పట్టణ ప్రాంతాల్లోని నీటి వనరుల పునరుద్ధరణకు పలు స్థాయిల్లో చేపట్టిన వివిధ కార్యక్రమాలను సమావేశంలో వివరించారు.
ఈ ఏడాది జె ఎస్ఎ: జల్ జీవన్ మిషన్ గుర్తించిన 150 నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లో వనరుల సుస్థిరతపై సీటీఆర్ క్యాంపెయిన్ దృష్టి సారించింది.
జలవనరుల శాఖ కార్యదర్శి, ఆర్ డి, జి ఆర్ శ్రీ పంకజ్ కుమార్, గత ప్రచారాలలో పట్టణ స్థానిక సంస్థలు చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు. ప్రస్తుత సంవత్సరంలో కూడా పట్టణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు ఇలాంటి ప్రయత్నాలను చేపట్టాలని కోరారు. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. జెఎస్ఎ ప్రాముఖ్యతను వివరించారు. వరద నివారణ , పట్టణ ప్రాంతాల్లో నీటి లభ్యతను పెంచడం అనే ద్వంద్వ లక్ష్యాన్ని సిటిఆర్ సాధిస్తుందని చెప్పారు.
మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్.హెచ్ జి ) భాగస్వామ్యం, యాజమాన్యం ద్వారా నీటి వనరుల మ్యాపింగ్ తో సహా పట్టణ ప్రాంతాలలోని నీటి వనరులను పునరుద్ధరించడానికి ప్రారంభించిన ఆమా పోఖారీ ప్రచారం గురించి ఒడిశా పట్టణ ప్రత్యేక కార్యదర్శి వివరించారు. కేరళలోని గురువాయూర్ మునిసిపాలిటీ పట్టణ వరదలను నివారించడంలో సహాయపడిన సమర్థవంతమైన వర్షపు నీటి పారుదల వ్యవస్థ గురించి వివరించింది. అమృత్ కింద మునిసిపల్ పరిధిలోని సుమారు 6.52 ఎకరాల్లో జలవనరుల పునరుద్ధరణతో పాటు గ్రీన్ స్పేసెస్ అండ్ పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. లాతూర్, వడోదర మునిసిపల్ కమిషనర్లు జిల్లాల లోని నీటి వనరుల పునరుద్ధరణ, నగరాలలో స్మార్ట్ వర్షపు నీటి సంరక్షణకు అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులను వివరించారు.
అమృత్ 2.0 కింద జలవనరుల పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ తీసుకుని సుమారు 600 ప్రాజెక్టుల పనులు ప్రారంభించారు. అలాగే రీచార్జి పథకం, గుర్తింపు పొందిన ల్యాబ్ ల ద్వారా నీటి నాణ్యత పరీక్షలు, వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం, సంరక్షించడం.
తదితర కార్యక్రమాల గురించి వివరించారు.
జెఎస్ఎ అమలులో గృహనిర్మాణ,పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రయత్నాలను జల్ శక్తి మంత్రిత్వ శాఖ డబ్ల్యూఆర్, ఆర్ డి అండ్ జి ఆర్ కార్యదర్శి ప్రశంసించారు. సిటిఆర్ 2023, భాగస్వాములు అందరి నిరంతర మద్దతు ఈ ఏడాది జల్ శక్తి అభియాన్ ను గొప్ప విజయవంతం చేస్తాయని ఆకాంక్షించారు.
******
(Release ID: 1918677)
Visitor Counter : 165