శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
మల్టిపుల్ స్క్లిరోసిస్ వంటి వ్యాధుల అధ్యయనానికి తోడ్పడే ప్రోటీన్‌ను రూపొందించిన శాస్త్రవేత్తలు
Posted On:
21 APR 2023 2:43PM by PIB Hyderabad
మైలిన్ కోశంలో ప్రధాన ప్రోటీన్ భాగమైన స్వచ్ఛ మైలీన్ బేసిక్ ప్రోటీన్ (ఎంబిపి) ఏకపొరలను శాస్త్రవేత్తలు సృష్టించారు. నాడీ కణాల అక్షనాళం చుట్టూ ఆవరించిన సురక్షిత పొరగా ఉండే ఇది, మల్టిపుల్ స్క్లిరోసిస్ (ఎంఎస్) వంటి వ్యాధులను అధ్యయనం చేసేందుకు నమూనా ప్రోటీన్‌గా పని చేస్తుంది. మైలీన్ కోశాన్ని కుదించేందుకు తోడ్పడుతుంది. ఇందుకు తోడుగా, సృష్టించిన అనుకూల ఏకపొరలు పల్చటి బహుళ మైలీన్ కోశ వ్యవస్థ ఏర్పడటంలో, కోశ పరిపూర్ణతన, స్థిరతలను, దృఢతను పరిరక్షించడంలో ఎంబిపి పోషించే పాత్రను లోతైన అవగాహనకు అవకాశాన్ని ఇస్తాయి.
శాస్త్ర, సాంకతిక విభాగం ఆధీనంలోని ఈశాన్య భారతం గువాహతికి చెందిన స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కి చెందిన భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధన బృందం ఈ పరిశోధనను చేపట్టింది. వాయువు- జలం, వాయువు- ఘన వినిమయసీమల వద్ద స్వచ్ఛమైన మైలీన్ బేసిక్ ప్రోటీన్ ఏకపొరలు ఏర్పడేందుకు లాంగ్‌మ్యూర్- బ్లడ్జెట్ (ఎల్‌బి) అన్న పేరుగల పద్ధతిని ఉపయోగించారు.
అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సారథి కుందు, సీనియర్ రీసెర్చ్ ఫెలో రక్తిమ్ జె. సర్మా నేతృత్వంలోని ఈ పరిశోధనా బృందం పిహెచ్ పరిస్థితుల ఉపదశను మేళనం చేయడం ద్వారా ప్రోటీన్ పొరల స్థిరతను, దృఢత్వాన్ని అనుసరిస్తూనే ఎంబిపి ఏర్పడే పద్ధతిని వివరించారు. అణువుల పరావర్త స్వభావం అన్నది పిహెచ్ పరిస్థితులలో పొరల సరళత/ వశ్యతను నిర్ధారిస్తుంది.
వాయువు-జల వినిమయ సీమలో ఏర్పడిన ఏకపొరలలో విభిన్న పిహెచ్ పరిస్థితుల కింద ప్రోటీన్ ప్రవర్తనను భిన్న ప్రాంతాల నుంచి పరిశోధించారు. ఏకపొరల దృఢత్వం అన్నది ఏర్పడిన నిర్దిష్ట పరిధులకు, జల ఉపరితలంపై పరుధులు ఆక్రమించిన ప్రాంతానికి పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుంది.
ఎల్‌బి పద్ధతిలో వాయు-జలం వద్ద , ఘన ఉపరితలాలపై సన్నిహితంగా ఇమిడిన ఎంబిపి పొర సృష్టించడం అన్నది ప్రోటీన్ పర్యావరణ సామీప్యాన్ని 2డిలో భిన్న రసాయన, భౌతిక లక్షణాలను అధ్యయనం చేసేందుకు తోడ్పడుతుంది. ఎంబిపి యొక్క పోగడిన ఎల్‌బి పొరలను ప్రోటీన్ నానో టెంప్లేట్లను గుర్తించిన ప్రోటీన్లను స్పటికీకరించడానికి పరిగణించవచ్చు. ఈ పరిశోధన ఫలితాలను ఇటీవలే ప్రముఖ ఎల్సెవియర్ పబ్లిషర్ల పరిధిలోని కొలాయిడ్స్ అండ్ సర్ఫేసెస్ ఎః ఫిజికోకెమికల్ అండ్ ఇంజనీరింగ్ అస్పెక్ట్స్‌లో ప్రచురితమైంది.
***
(Release ID: 1918673)
Visitor Counter : 206