ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు & విభాగాలు కాకుండా సంస్థలు ఆధార్ ధ్రువీకరణ చేసేందుకు తోడ్పడే నియమ నిబంధనలను ప్రతిపాదించిన ఎంఇఐటివై
పౌరుల జీవన సౌలభ్యం, మెరుగైన సేవలు అందుకునేలా ప్రోత్సహించడం లక్ష్యం
సాధారణ ప్రజలు, భాగస్వాముల నుంచి సవరణలపై అభిప్రాయాలకు ఆహ్వానం
Posted On:
20 APR 2023 11:34AM by PIB Hyderabad
ఆధార్‌ను ప్రజలకు అనుకూలంగా , పౌరుల జీవన సౌలభ్యతకు, సేవలను మెరుగ్గా అందుకునేలా మార్చడానికి ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఇఐటివై) ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు కాకుండాఇతర సంస్థల ద్వారా ఆధార్ ధృవీకరణను సాధ్యం చేసేందుకు నియమ, నిబంధనలను ప్రతిపాదించింది.
ఆధార్ ( లక్ష్యిత ఆర్థిక, ఇతర రాయితీలు, ప్రయోజనాలు, సేవల) చట్టం, 2016కు 2019లో చేసిన సవరణ ద్వారా, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడిఎఐ) కనుక సంస్థలు గోప్యతకు, నిబంధనలను నిర్దేశించిన భద్రతకు సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్టు సంతృప్తి చెందినా, లేక ధ్రువీకరణ సేవలు అందించేందుకు చట్టం అనుమతించినా లేక ఒక నిర్ధిష్ట ప్రయోజనం కోసం ధ్రువీకరణను కోరుతున్నా దానిని నిర్వహించేందుకు ఆ సంస్థలను అనుమతిస్తారు.
ప్రస్తుతం, , ప్రభుత్వ నిధుల నష్టాలను నిరోధించడం, ఆవిష్కరణకు తోడ్పడడం, జ్ఞాన వ్యాప్తి కోసం వంటి సుపరిపాలన ప్రయోజనాల కోసం ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలను (సాంఘిక సంక్షేమం, ఆవిష్కరణ, జ్క్షానం) నిబంధనలు, 2020 కింద ఆధార్ ధ్రువీకరణ చేపట్టేందుకు అనుమతిస్తున్నారు.
ఇప్పుడు, ప్రభుత్వ మంత్రిత్వ శాఖ లేదా విభాగం కాని సంస్థ ఏదైనా ఈవన సౌలభ్యాన్ని ప్రోత్సహించేందుకు, సేవలను మెరుగ్గా అందుకునేందుకు లేదా సుపరిపాలకు హామీ ఇచ్చేందుకు డిజిటల్ ప్లాట్‌ఫాంలను ఉపయోగించేందుకు లేదా సామాజిక సంక్షేమ ప్రయోజనాల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు లేదా ఆవిష్కరణకు, జ్ఞాన వ్యాప్తికి తోడ్పడేందుకు ఆధార్ ధ్రువీకరణను ఉపయోగించాలని కోరినప్పుడు, ఆ సంస్థ పైన పేర్కొన్న ప్రయోజనాలలో ఒక దాని కోసం కోరడాన్ని, అది ప్రభుత్వానికి ఏ రకంగా ప్రయోజనకరమో సమర్ధించుకుంటూ ప్రతిపాదనను రూపొందించి దానిని సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా విభాగానికి అందించాలి. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమైతే కేంద్ర మంత్రిత్వ శాఖ లేదా విభాగానికి, రాష్ట్రానికి చెందినది అయితే రాష్ట్ర శాఖకు, విభాగానికి సమర్పించాలి. సమర్పించిన ప్రతిపాదన పేర్కొన్న ప్రయోజనాన్ని నెరవేరుస్తుందని, అది ప్రభుత్వ ప్రయోజనాలకు అనుకూలంగా ఉందని మంత్రిత్వ శాఖ/ విభాగం భావిస్తే, ఆ ప్రతిపాదనకు తన అభిప్రాయాలను జతపరచి ఎంఇఐటివైకి పంపుతుంది.
ప్రతిపాదిత సవరణను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో ఉంచడం జరిగింది, సాధారణ ప్రజలు, భాగస్వాముల నుంచి వ్యాఖ్యలను కోరడం జరుగుతోంది. నిబంధనలలో ప్రతిపాదిత సవరణలకు సంబంధించిన లింక్ -
https://www.meity.gov.in/content/draft-amendments-aadhaar-authentication-good-governance-rules-2020-enable-performance.
ప్రజలు తమ అభిప్రాయాలను మైగవ్ (MyGov ) ప్లాట్‌ఫాంలో 5 మే 2023నాటికి సమర్పించాలి.
***
(Release ID: 1918421)
Visitor Counter : 221