వ్యవసాయ మంత్రిత్వ శాఖ
భారతదేశం జి-20 అధ్యక్షతలో100వ జి-20 సమావేశం, వారణాసిలో విజయవంతంగా ముగిసిన వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం (ఎంఏసిఎస్)
Posted On:
19 APR 2023 4:17PM by PIB Hyderabad
“సుస్థిర వ్యవసాయం; ఆరోగ్యవంతమైన ప్రజలు, భూమండలానికి అవసరమైన ఆహార వ్యవస్థ” అనే అంశంపై జి-20 దేశాల వ్యవసాయ శాఖ ముఖ్య శాస్త్రవేత్తల (ఎంఏసిఎస్) సమావేశం వారణాసిలో నేటితో వారణాసిలో ముగిసింది.
కేంద్ర పౌర విమానయాన శాఖ; రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె.సింగ్ (రిటైర్డ్) ఈ సమావేశాన్ని 2023 ఏప్రిల్ 17న ప్రారంభించారు.
జి-20 సభ్యదేశాలు, ఆహూతులైన ఆతిథ్య దేశాలు, అంతర్జాతీయ సంఘాలకు చెందిన 80 మంది వరకు ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.
మూడు రోజులు జరిగిన (2023 ఏప్రిల్ 17-19) ఈ సమావేశానికి కార్యదర్శి డాక్టర్ హిమాంశు పాఠక్ (డేర్), డైరెక్టర్ జనరల్ (ఐసిఏఆర్) డాక్టర్ హిమాంశు పాఠక్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
వ్యవసాయ ఆహార వ్యవస్థల పరివర్తనలో ఇన్నోవేషన్లు, టెక్నలాజికల్ చొరవలు; ఆహార భద్రత, పోషకాహార సాధన కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ హద్దులు; పోషక విలువలు పెంచడంలో ఆహార పంటల బయో ఫోర్టిఫికేషన్; పోషకాహారం, సాగర వృద్ధికి ఉష్ణమండల సీవీడ్ వ్యవసాయం; చిరుధాన్యాలు, ఇతర ప్రాచీన ఆహార ధాన్యాల అంతర్జాతీయ పరిశోధన కార్యక్రమం (మహరిషి); సమగ్ర, ఏకీకృత వైఖరిగా వన్ హెల్త్ : సమన్వయపూర్వక కార్యాచరణ కోసం భాగస్వామ్యాలు, వ్యూహాలు; సీమాంతర కీటకాలు, వ్యాధులు; ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల వ్యవసాయ-ఆహార వ్యవస్థకు ఆర్ అండ్ డి ప్రాధాన్యతలు; సుస్థిర వ్యవసాయ-ఆహారం కోసం వాతావరణ పరిస్థితులను తట్టుకోగల టెక్నాలజీలు, ఇన్నోవేషన్లు; ప్రకృతి సానుకూల వ్యవసాయం; ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకోగల వ్యవసాయ-ఆహార వ్యవస్థ నిర్మాణానికి సైన్స్ అండ్ ఇన్నోవేషన్; బయోలాజిల్ నైట్రిఫికేషన్ ఇన్ హిబిషన్ (బిఎన్ఐ) : జిహెచ్ఎస్ వ్యర్థాల తగ్గింపు, పంట దిగుబడుల పెంపు; డిజిటల్ వ్యవసాయం, ట్రేసబులిటీ; ఆహార నష్టం, వృధా తగ్గించడానికి డిజిటల్ టెక్నాలజీ సొల్యూషన్లు; అగ్రి-టెక్ స్టార్టప్ వ్యవస్థ; బహుళ వ్యవసాయ విస్తరణ, సలహా సేవలు (ఇఎఎస్); లేబరేటరీ నుంచి భూమికి చేరడాన్ని మెరుగుపరిచే భాగస్వామ్యాలు; చిన్న కమతాలు, కుటుంబ వ్యవసాయం : వ్యవసాయ-ఆర్ అండ్ డి కోసం జి-20 గ్లోబల్ సౌత్ సహకారం; వ్యవసాయ ఆర్ అండ్ డిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు : ఏర్పాటులో అనుభవాలు, ఇన్నోవేషన్లు వేగవంతం అనే అంశాలపై చర్చలు కేంద్రీకృతం అయ్యాయి.
పోషకాహారం, ఆహార భద్రత కోసం వ్యవసాయ పరిశోధన, అభివృద్ధిలో సహకారం; డిజిటల్ వ్యవసాయం; ప్రతికూలతలను తట్టుకునే వ్యవసాయ ఆహార వ్యవస్థలు; వ్యవసాయ ఆర్ అండ్ డిలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యాలు అనే అంశాలపై అధ్యక్షుని సందేశం, ఫలితాల పత్రాన్ని సమావేశం ఆమోదించింది. మహరిషి ప్రారంభానికి కూడా ఎంఏసిఎస్ 2023 మద్దతు ఇచ్చింది.
· పరిశోధనాంశాలను పంపిణి చేయడంతో పాటు పరిశోధనలో వ్యత్యాసాలు, అవసరాలు గుర్తించడం కోసం ప్రత్యేకంగా గుర్తించిన ఆహార ధాన్యాల పంటలపై కృషి చేస్తున్న పరిశోధకులు, సంస్థల అనుసంధానానికి అవసరమైన యంత్రాంగం ఏర్పాటు
· పరిశోధకులను అనుసంధానం చేయడానికి, డేటా మార్పిడికి, పరిశోధన, సమాచార భాగస్వామ్యంతో పాటు కమ్యూనికేషన్ ఉత్పత్తులు పంచుకునేందుకు వెబ్ వేదికల ఏర్పాటు
· సామర్థ్యాల నిర్మాణ కార్యకలాపాలు; అంతర్జాతీయ వర్క్ షాప్ లు, సమావేశాల నిర్వహణ
· పనితీరు గుర్తింపు, శాస్త్రవేత్తల గుర్తింపు
భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్), హైదరాబాద్ లో ఇక్రిశాట్, సిజిఐఏఆర్ కేంద్రాలు, అంతర్జాతీయ సంఘాల సాంకేతిక మద్దతుతో మహరిషి సచివాలయం ఏర్పాటు చేస్తారు.
జి-20 ఎంఏసిఎస్ సందర్భంగా వ్యవసాయ పరిశోధనలో భవిష్యత్ సహకారం అనే అంశంపై ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్, అర్జెంటీనా, జర్మనీతో ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి
***
(Release ID: 1918180)
Visitor Counter : 264