శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామర్ధ్యం కలిగిన యువ స్టార్టప్ లను అనుసంధానించడానికి, గుర్తించడానికి ఈ రోజు ప్రారంభించిన "యువ పోర్టల్" సహాయపడుతుంది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


న్యూఢిల్లీలో ఎన్ పి ఎల్ 'వన్ వీక్ - వన్ ల్యాబ్' కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ జితేంద్ర సింగ్

‘‘వాటాదారుల భాగస్వామ్యం విస్తృత ఆధారితంగా లేకపోతే, ముఖ్యంగా పరిశ్రమ, స్టార్ట్ అప్ లు తగిన పరిశ్రమ మ్యాపింగ్ , తగిన సమర్థత కొరవడి సుస్థిరంగా ఉండకపోవచ్చు‘‘

హర్యానాలోని కర్నాల్ లో ఖగోళ శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడం అభినందనీయం; ఇది అందరికీ సమానమైన ఆట మైదానాన్ని
అందిస్తుంది; దివ్యాంగులు కూడా వివిధ రకాల నైపుణ్యాలు, కళలు ,హస్తకళలలో రాణించగలరు; వివిధ భాషలలో వివరించే సదుపాయం వల్ల వినికిడి లోపం ఉన్న విద్యార్థులు సూర్యుడు, చంద్రుడు , నక్షత్రాల గురించి సాధారణ, సంక్లిష్టమైన అంతరిక్ష అంశాలను గురించి తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది

Posted On: 17 APR 2023 5:19PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ; పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు "యువ పోర్టల్"ను ప్రారంభించారు. సామర్ధ్యం కలిగిన యువ స్టార్టప్ లను కనెక్ట్ చేయడానికి , గుర్తించడానికి "యువ పోర్టల్" సహాయపడుతుంది.

 

న్యూఢిల్లీలో ఎన్ పి ఎల్ "వన్ వీక్ -వన్ ల్యాబ్" కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా, డాక్టర్ జితేంద్ర సింగ్ ‘వాటాదారుల భాగస్వామ్యం విస్తృత ఆధారితంగా లేకపోతే సరైన పరిశ్రమ మ్యాపింగ్ ,సరైన యోగ్యత లేకపోవడం వల్ల స్టార్టప్ లు స్థిరంగా ఉండకపోవచ్చని‘ హెచ్చరించారు.

 

కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 2023 జనవరి 6 న "వన్ వీక్- వన్ ల్యాబ్" ప్రచారాన్ని ప్రారంభించిన విషయంతెలిసిందే. .

 

 

టెక్నాలజీ, ఇన్నోవేషన్ , స్టార్టప్ లలో భారతదేశ అంతర్జాతీయ ప్రతిభను ప్రముఖంగా వివరించిన డాక్టర్ జితేంద్ర సింగ్, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 37 సి ఎస్ ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) ల్యాబ్ లలో ప్రతి ఒక్కటి విభిన్న ప్రత్యేకమైన పరిశోధనా అంశానికి అంకితమయ్యాయని, " వన్  వీక్, వన్ ల్యాబ్" క్యాంపెయిన్ ప్రతి ల్యాబ్ కు అవి నిర్వహిస్తున్న పరిశోధనా కార్యకలాపాలను ప్రదర్శించడానికి అవకాశాన్ని అందిస్తుందనితెలిపారు. , తద్వారా ఇతరులు , భాగస్వాములు దాని గురించి తెలుసుకోవచ్చునని అన్నారు.

 

"నేటి భారతదేశం పురోగమిస్తున్న శాస్త్రీయ విధానం ఫలితాలను కూడా మనం చూస్తున్నాము. సైన్స్ రంగంలో భారత్ వేగంగా ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటిగా మారుతోంది‘ అని నాగ్ పూర్ లో ఇటీవల జరిగిన 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో ప్రధాన మంత్రి చేసిన ప్రసంగాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు.

 

హర్యానాలోని కర్నాల్ లో ఖగోళ శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించడం అభినందనీయమని, ఇది అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందని, దివ్యాంగులు కూడా వివిధ రకాల నైపుణ్యాలు, కళలు, హస్తకళల్లో రాణించగలరని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. వినికిడి లోపం ఉన్న విద్యార్థులు అంతరిక్షానికి సంబంధించిన సరళమైన, సంక్లిష్టమైన అంశాలతో పాటు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల గురించి వివిధ భాషల్లో  తెలుసుకునే సదుపాయం ఇక్కడ అందుబాటులో ఉండడం అభినందనీయదని ఆయన అన్నారు.

 

ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఆస్ట్రోల్యాబ్ లో పెద్ద టెలిస్కోప్, ఇంటరాక్టివ్ మోడల్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ , ఫన్ ఫ్యాక్ట్ పోస్టర్స్ తో సహా 65 పరికరాలు ఉన్నాయి. బయోపిక్ లు, హ్యాండ్ ఆన్ ప్రదర్శనలు, సరదా వాస్తవాలు , భారతీయ సంకేత భాషలో అంతరిక్షం ,సైన్స్ కు సంబంధించి సరళమైన , సంక్లిష్టమైన అంశాల గురించి వివరణాత్మక వీడియోలతో సహా 90 కి పైగా వీడియోలను ప్రసారం చేయడానికి 24×7 వర్చువల్ యాక్సెస్ కలిగి ఉంది.

 

నేటి కార్యక్రమంతో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ప్రయోగశాలలు అన్ని తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడమే కాకుండా, యువ ఆవిష్కర్తలు, విద్యార్థులు, స్టార్టప్. లు, విద్యావేత్తలు , పారిశ్రామిక వేత్తల విజ్ఞానం పెంపొందించడానికి ,డీప్ టెక్ వెంచర్ల ద్వారా అవకాశాలను అన్వేషించడానికి ప్రజలకు చేరువవుతాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. "వన్ వీక్, వన్ ల్యాబ్" ప్రచారంలో, వరుస వారాల్లో, ప్రతి సిఎస్ఐఆర్ ప్రయోగశాలలు తమ ప్రత్యేకమైన ఆవిష్కరణలు , సాంకేతిక పురోగతిని భారతదేశ ప్రజలకు ప్రదర్శిస్తున్నాయి. సిఎస్ఐఆర్ ప్రయోగశాలలు ప్రత్యేకమైనవి. జీనోమ్ నుండి భూగర్భశాస్త్రం వరకు, ఆహారం నుండి ఇంధనం వరకు, ఖనిజాల నుండి పదార్థాల వరకు విస్తరించిన నిర్దిష్ట రంగాలలో ప్రత్యేకత కలిగి ఉన్నాయి.

 

సెసియం పరమాణు గడియారాలు, హైడ్రోజన్ మాసర్లతో కూడిన పరమాణు కాల స్కేలును ఉపయోగించి తయారు చేసిన ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్ టి ) సంరక్షణ కర్తగా సీఎస్ఐఆర్-

ఎన్ పి ఎల్ ఉందని జితేంద్ర సింగ్ తెలిపారు. అంతే కాదు, అల్ట్రా- ఖచ్చిత ఉపగ్రహ లింకులను ఉపయోగించి అంతర్జాతీయ రిఫరెన్స్ టైమ్ యుటిసి (కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్) కు కొన్ని నానో సెకన్లలో ఐ ఎస్ టి ని గుర్తించవచ్చు. సీఎస్ఐఆర్- ఎన్ పి ఎల్ దేశం సమయాన్ని ఎలా ఉంచుతుందో చూసి రండి!

 

వాతావరణ కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి సిఎస్ఐఆర్- ఎన్ పి ఎల్ వాయువు, వాయు కణాల కొలతలను ప్రామాణికం చేసిందని మీకు తెలుసా?

 

సీఎస్ఐఆర్-నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ( ఎన్ పి ఎల్) నేటి  నుంచి ఏప్రిల్ 21 వరకు వన్ వీక్ వన్ ల్యాబ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని సీఎస్ఐఆర్- ఎన్ పి ఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ ఆచంట తెలిపారు. సంభావ్య భాగస్వాముల మధ్య ఎన్ పి ఎల్ లో అందుబాటులో ఉన్న సాంకేతికతలు , సేవల గురించి అవగాహన కల్పించడం, సామాజిక సమస్యలకు పరిష్కారాలను అందించడం, ఖచ్చితమైన కొలతల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ,ప్రజలలో ముఖ్యంగా దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులలో శాస్త్రీయ జిజ్ఞాసను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

 

ఢిల్లీ - ఎన్ సి ఆర్ లోని 180 పాఠశాలలు వివిధ కార్యకలాపాల కోసం ఎన్ పి ఎల్ కు, ప్రయోగశాలలకు అనుసంధానం అయ్యాయని, భవిష్యత్తులో ఇలాంటి బహిరంగ పరస్పర చర్యల కోసం మరిన్ని పాఠశాలలు తెరవబడతాయని డాక్టర్ ఆచంట చెప్పారు.

 

ఇది భారతీయ ప్రామాణిక సమయం (ఐ ఎస్ టి ) వ్యాప్తితో సహా పొడవు, ద్రవ్యరాశి, ఉష్ణోగ్రత మొదలైన కొలత ప్రమాణాలను సంరక్షిస్తుంది.  నిర్వహిస్తుంది. భారతదేశం అంతర్జాతీయ కొలతల ప్రయోగశాలలతో సమానంగా ఉండేలా భవిష్యత్ క్వాంటమ్ ప్రమాణాలు, రాబోయే సాంకేతికతలను స్థాపించే లక్ష్యంతో ఎన్ పి ఎల్ మల్టీడిసిప్లినరీ ఆర్ అండ్ డి ని నిర్వహిస్తోంది. అభివృద్ధి చెందుతున్న భారతదేశ పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం కింద అధునాతన విశ్లేషణాత్మక పరికరాలను ( దిగుమతి ప్రత్యామ్నాయాలు) అభివృద్ధి చేస్తోంది.ఇంకా "స్కిల్ ఇండియా" కార్యక్రమం కింద కొలతల రంగంలో యువ శాస్త్రవేత్తలు,పారిశ్రామిక సిబ్బందికి శిక్షణ ఇస్తోంది.

 

ఏప్రిల్ 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు స్టార్టప్/ ఎంఎస్ఎంఈ/ ఇండస్ట్రీ మీట్ ఉంటుంది. పరిశ్రమలకు ఎన్ పి ఎల్ అందించే వివిధ సేవలను ప్రదర్శించడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ ఈవెంట్ లో, ఎన్ పి ఎల్  సాయపడిన/కనెక్ట్ చేయబడిన/సాంకేతిక మద్దతు/కన్సల్టెన్సీ/సేవలను అందించిన భాగస్వాములందరినీ ఆహ్వానించారు.

ప్రతిరోజూ ఈ కార్యక్రమంలో, 20 కంటే ఎక్కువ పరిశ్రమలు చేరతాయి, అక్కడ వారు తమ సాంకేతికతలు / సేవలను ప్రదర్శించడమే కాకుండా (ఎన్ పి ఎల్ సహకారం అందించిన ) ప్రదర్శించడమే కాకుండా ఎన్ పి ఎల్ శాస్త్రీయ , సాంకేతిక సహాయం గురించి కూడా మాట్లాడతారు.

ఇన్నోవేషన్ ఫ్రేమ్ వర్క్, ఎకోసిస్టమ్ కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, అభివృద్ధి కోసం నాలుగు కొత్త పారిశ్రామిక భాగస్వాములతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.

 

ఏప్రిల్ 19న మెట్రాలజీ కాన్ క్లేవ్ నిర్వహించి సీఎస్ ఐఆర్-ఎన్ పీఎల్ లో అడ్వాన్స్ ఆన్ అడ్వాన్సెస్ ఇన్ మెట్రాలజీ హ్యాండ్ బుక్ ను విడుదల చేయనున్నారు.

మెట్రాలజీ రంగంలో సీఎస్ఐఆర్- ఎన్ పి ఎల్ పాత్ర, ప్రయత్నాలు, భవిష్యత్తు కోసం సీఎస్ఐఆర్- ఎన్ పి ఎల్ రోడ్ మ్యాప్, జాతీయ, అంతర్జాతీయ సహకారం అభివృద్ధి, ప్యానెల్ డిస్కషన్ తదితర అంశాలు మెట్రాలజీ సదస్సులో ఉన్నాయి.

 

ఏప్రిల్ 20న, ఆర్ అండ్ డి  కాన్ క్లేవ్ అండ్ ఉమెన్ ఇన్ స్టెమ్ నిర్వహిస్తారు. దీనిలో ఎన్ పి ఎల్  కుటుంబానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు,  పూర్వ విద్యార్థులు తమ దార్శనికతను పంచుకుంటారు.  సైన్స్ - టెక్నాలజీ లో ఇటీవలి పురోగతిలో సి ఎస్ ఐ ఆర్- ఎన్ పి ఎల్ పాత్రను ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతపై దృష్టి కేంద్రీకరిస్తారు. పరిశోధన -  అభివృద్ధిలో ఇటీవలి ధోరణి, సవాళ్లు ,స్టెమ్ కెరీర్ లలో మహిళలకు అవకాశాల గురించి చర్చించడానికి మహిళా శాస్త్రవేత్తలచే అనేక కార్యకలాపాలు నిర్వహిస్తారు. అలాగే, భారతదేశంలోని ప్రఖ్యాత మహిళా శాస్త్రవేత్తలను చూపించడానికి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా ఉంటుంది.

 

ఏప్రిల్ 21న ఒకరోజు స్కిల్ కాన్ క్లేవ్ నిర్వహిస్తారు. సీఎస్ఐఆర్- ఎన్ పి ఎల్ స్కిల్ ప్రోగ్రామ్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం/ విద్యావంతులను చేయడం, మన జీవితంలోని అన్ని అంశాలకు సంబంధించిన రంగాల్లో నిపుణుల ఉపన్యాసాలు, నైపుణ్య ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా స్థానికులను ప్రేరేపించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.

దేశంలో వివిధ పరిశ్రమలు, విద్యారంగం, సమాజం ద్వారా అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులకు శిక్షణ ఇచ్చేందుకు సీఎస్ఐఆర్ - ఎన్ పి ఎల్ ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

సిఎస్ఐఆర్ - ఎన్ పి ఎల్ , దాని "వన్ వీక్ - వన్ ల్యాబ్" కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కోసం, ఎన్ పి ఎల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు:

 

https://www.nplindia.org/. ఇందులో పాల్గొనడానికి, ఆసక్తి ఉన్నవారు ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకోవచ్చు.

 

*****


(Release ID: 1917639) Visitor Counter : 213