ఉక్కు మంత్రిత్వ శాఖ
ముంబైలో ఇండియా స్టీల్ 2023 ఈవెంట్ ని ప్రారంభించనున్న కేంద్ర ఉక్కు మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా
ఉక్కు పరిశ్రమలో తాజా పరిణామాలు, సవాళ్లు మరియు అవకాశాలను చర్చించడం ఈ ఈవెంట్ లక్ష్యం
Posted On:
17 APR 2023 4:00PM by PIB Hyderabad
కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, వాణిజ్య శాఖ, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు పరిశ్రమల ఛాంబర్ ఫిక్కీ సహకారంతో ఇండియా స్టీల్ 2023, ఉక్కు పరిశ్రమపై కాన్ఫరెన్స్ మరియు అంతర్జాతీయ ప్రదర్శనను ఏప్రిల్ 19-21, 2023 వరకు ముంబైలోని గోరేగావ్‌లోని ముంబై ఎగ్జిబిషన్ సెంటర్ నిర్వహిస్తోంది. ఉక్కు పరిశ్రమలో తాజా పరిణామాలు, సవాళ్లు మరియు అవకాశాల గురించి చర్చించడానికి పరిశ్రమ నాయకులు, విధాన రూపకర్తలు మరియు నిపుణులను ఒకచోట చేర్చడం ఈ ఈవెంట్ లక్ష్యం. ఏప్రిల్ 19, 2023న ఇండియా స్టీల్ 2023 ప్రారంభ సెషన్‌ను కేంద్ర పౌర విమానయాన మరియు ఉక్కు మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా, భారత ప్రభుత్వ ఉక్కు, మరియూ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తే, శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా, ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సీనియర్ ప్రభుత్వ అధికారులు మరియు విశిష్ట వక్తలు, శ్రీ సుభ్రకాంత్ పాండా (అధ్యక్షుడు, ఫిక్కీ), మరియు శ్రీమతి సోమ మొండల్ (ఛైర్‌పర్సన్, సెయిల్ మరియు చైర్, ఫిక్కీ స్టీల్ కమిటీ) తదితరులుపాల్గొని ప్రసంగిస్తారు. ఈ ఈవెంట్ సందర్భంగా, ఉక్కు రంగంలో తాజా ఉత్పత్తులు మరియు ఆవిష్కరణలను ప్రదర్శించే ప్రదర్శన కూడా ఏకకాలంలో నిర్వహించబడుతుంది. మూడు రోజుల వ్యవధిలో జరిగే ఈ ఈవెంట్ లో వివిధ అంశాలను కవర్ చేసే ఇన్ఫర్మేటివ్ సెషన్‌లలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇండియా స్టీల్ 2023 సందర్భంగా, "రవాణా మౌలిక సదుపాయాల కల్పన ", "భారత ఉక్కు పరిశ్రమకు డిమాండ్ ", "గ్రీన్ స్టీల్ ద్వారా సుస్థిరత లక్ష్యాలు: సవాళ్లు మరియు భవిష్యత్ మార్గం," "సహకార విధానం అనుకూల విధానం, భారతీయ ఉక్కు కోసం కీలకమైన అంశాలు," మరియు "ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంపొందించడానికి సాంకేతిక పరిష్కారాలు" వంటి అంశాలను కవర్ చేస్తూ, ఇండియా స్టీల్ 2023 లో ముఖ్యమైన సెషన్‌లు నిర్వహించబడతాయి. ప్రతి సెషన్ భారతీయ ఉక్కు రంగంలోని సవాళ్లు మరియు అవకాశాలను పరిష్కరించే లక్ష్యంతో పరిశ్రమ నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు నిపుణుల మధ్య లోతైన చర్చలను సులభతరం చేస్తుంది. సెషన్‌లు లబ్దిదారులకు ఆలోచనలు, అంతర్దృష్టులు మరియు అనుభవాలను మార్పిడి చేసుకోవడానికి వేదికను అందిస్తాయి, పరిశ్రమ యొక్క భవిష్యత్తు వృద్ధికి సహకారం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయి.ఇండియా స్టీల్ 2023 ఉక్కు పరిశ్రమ యొక్క ముఖ్య సమస్యలపై రౌండ్‌టేబుల్ చర్చల శ్రేణిని కూడా నిర్వహిస్తుంది.
ఇండియా స్టీల్ 2023 ఎగ్జిబిషన్ భారతీయ ఉక్కు పరిశ్రమ నుండి అధునాతన సాంకేతికతలు, ఉత్పత్తులు మరియు పరిష్కారాలను ప్రదర్శిస్తుంది. ఈ ద్వైవార్షిక ఈవెంట్ కు హాజరైన వారికి పరిశ్రమల ప్రముఖులతో కలవడానికి, భవిష్యత్ వృద్ధి అవకాశాలపై అంతర్దృష్టులను పొందేందుకు మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ ఉక్కు పరిశ్రమ సహకారం కోసం అవకాశాలను అన్వేషించడానికి ఒక ప్రత్యేక వేదికను అందిస్తుంది. ఇండియా స్టీల్ 2023 గురించి మరింత సమాచారం కోసం మరియు ఈవెంట్ కోసం నమోదు చేసుకోవడానికి, దయచేసి www.indiasteelexpo.inని సందర్శించండి.
***
(Release ID: 1917379)