హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్‌ షా చేతులమీదుగా డాక్టర్‌ అప్పాసాహెబ్‌ ధర్మాధికారికి ‘మహారాష్ట్ర భూషణ్‌-2022’ అవార్డు ప్రదానం


“మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీ అప్పాసాహెబ్‌ను సత్కరించడం ద్వారా

కోట్లాది ప్రజలు ఆయనను అనుసరించేలా ప్రేరేపించింది”;

“అప్పాసాహెబ్‌ తరహాలో త్యాగం.. సేవ.. అంకితభావంతోనేప్రజల్లో గౌరవంనిబద్ధతలను ప్రోది చేయడం సాధ్యం”;“జనంలో ఒకరుగాకాకుండా అప్పాసాహెబ్‌లాగాజనమంతా మనను అనుసరించేలా కృషిచేయాలి”;

“ఛత్రపతి శివాజీ మహరాజ్‌ వంటి మహనీయుడికి జన్మనిచ్చిన పవిత్రభూమి రాయ్‌గఢ్‌... దేశం కోసం అంకితభావం.. శౌర్యం.. త్యాగం..సామాజిక స్పృహలసంప్రదాయాన్ని ఈ గడ్డ కొనసాగించింది”;

“ప్రసంగాలతోనేర్పే పాఠాలు స్వల్పకాలికం.. కానీ- కాలక్రమంలో అవిమాసిపోతాయి..అనుభవ పాఠాలు శాశ్వతం కాబట్టి- సమాజం కోసం..ఇతరుల కోసం కృషి చేయాలని అప్పాసాహెబ్‌లక్షలాది ప్రజలకు బోధించారు”;

“సమష్టిగా ముందడుగేద్దాం’ అనే నినాదంతో వివిధ రంగాల్లో ఆచరణ

ద్వారా అప్పాసాహెబ్‌ ఆదర్శంగా నిలిచి సమాజాన్ని నడిపించారు”;

“సర్వే భవన్తుసుఖినః’ అనే మంత్రంతో దేశానికిఅవసరమైనప్పుడల్లా ఇతరుల కోసం జీవించేలా అప్పాసాహెబ్  లక్షలాది మందిని తనతోనడిపించారు.. కాబట్టే- ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వంఆయనను పద్మ పురస్కారంతో గౌరవించింది”

Posted On: 16 APR 2023 5:08PM by PIB Hyderabad

కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఇవాళ మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో డాక్టర్ అప్పాసాహెబ్ ధర్మాధికారికి “మహారాష్ట్ర భూషణ్-2022” పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్‌తోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ అమిత్‌ షా ప్రసంగిస్తూ- ప్రజా జీవితంలో ఎలాంటి కీర్తి కాంక్ష లేకుండా సంఘసేవ చేసిన సామాజిక సేవకుడుగా అప్పాసాహెబ్పై ప్రజల్లో అపార గౌరవాదరాలు ఉన్నాయన్నారు. త్యాగం, అంకితభావంతో అప్పాసాహెబ్ చేసిన సేవే ఆయనకు అటువంటి గౌరవం, ఆదరణను తెచ్చిపెట్టినట్లు ఆయన వ్యాఖ్యానించారు. అప్పాసాహెబ్‌పై ప్రజలకుగల ప్రేమ, విశ్వాసం, గౌరవం తదితరాలు ఆయన కృషితోపాటు నానాసాహెబ్‌ పాటించిన విలువలకు, ప్రబోధాలకు నివాళి వంటివని పేర్కొన్నారు. అలాగే జనంలో ఒకరుగా కాకుండా అప్పాసాహెబ్‌లాగా జనమంతా తమను ఇతరులు అనుసరించేలా కృషి చేయాలని శ్రీ షా ఈ సందర్భంగా సూచించారు.

కుటుంబంలో సామాజిక సేవా సంస్కృతి మూడు తరాలపాటు కొనసాగడం చరిత్రలో చాలా అరుదని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి అన్నారు. మొదట నానాసాహెబ్, అటుపైన అప్పాసాహెబ్, నేడు సచిన్ భావూసహా ఆయన సోదరులు ఈ సామాజిక సేవ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీ అప్పాసాహెబ్‌ను మహారాష్ట్ర భూషణ్ పురస్కారంతో సత్కరించడమే కాకుండా కోట్లాది ప్రజలు ఆయనను అనుసరించేలా స్ఫూర్తి నింపిందని ప్రశంసించారు. రాయ్‌గఢ్‌ను ఛత్రపతి శివాజీ మహరాజ్ వంటి మహనీయుడికి జన్మనిచ్చిన పవిత్ర భూమిగా శ్రీ అమిత్‌ షా అభివర్ణించారు. ఈ గడ్డ దేశంలో మూడు సంప్రదాయాలను కొనసాగించిందని గుర్తుచేశారు. ఈ మేరకు మొదట శౌర్యపరాక్రమాలతోపాటు దేశం కోసం త్యాగాలు చేసిందన్నారు.

త్రపతి శివాజీ మహరాజ్‌తో ప్రారంభమైన ఈ తొలి సంప్రదాయం దేశవ్యాప్తంగా కొనసాగిందన్నారు. మహారాష్ట్ర నేలపై జన్మించిన వీరసావర్కర్‌, వాసుదేవ్‌ బల్వంత్‌ ఫడ్కే ఛపేకర్‌ సోదరులు, లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ వంటి స్వాతంత్ర్య సమర యోధులు స్వరాజ్యం, ఆత్మగౌరవం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారన్నారు. ఇక రెండోదైన భక్తి సంప్రదాయంలో సమర్థ రామదాసు, భక్త తుకారాం, స్వామి నామ్‌దేవ్‌ వంటివారు దేశానికి మార్గనిర్దేశం చేశారని తెలిపారు. ఇక మూడోదైన సామాజిక స్పృహ మహారాష్ట్రలోనే ఆవిర్భవించిందని శ్రీ అమిత్‌ షా అన్నారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రి బాయి ఫూలే, బాబాసాహెబ్‌ డాక్టర్‌ భీమ్‌రావ్‌ అంబేడ్కర్‌ తదితరులు అనేక సామాజిక ఉద్యమాలను నడిపించారని కొనియాడారు. వీరంతా దేశానికి మహారాష్ట్ర అందించిన ఆణిముత్యాలని పేర్కొన్నారు. ఈ సంప్రదాయాలకు అనుగుణంగా నానాసాహెబ్‌, అప్పాసాహెబ్‌ సామాజిక స్పృహను రగల్చడంతోపాటు దాన్ని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.

న ఉపనిషత్తుల్లో పేర్కొన్న “సర్వే భవన్తు సుఖినః, సర్వే సంతు నిరామయా” స్ఫూర్తిని ఆచరణలో పెట్టడం చాలా కష్టమని కేంద్ర హోం-సహకార శాఖల మంత్రి అన్నారు. దీని ప్రకారం ఒక వ్యక్తి తన సామాజిక జీవనంలో అధికశాతాన్ని స్వార్థం కోసం కాకుండా పరమార్థం కోసం.. అంటే- సమాజం కోసం, ఇతరుల కోసం అంకితం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రసంగాలతో నేర్పే పాఠాలు స్వల్పకాలికమని, కాలక్రమంలో అవి చెరిగిపోతాయని పేర్కొన్నారు. అయితే, అనుభవం నేర్పే పాఠాలు శాశ్వతమని స్పష్టం చేశారు. కాబట్టి- తమకోసం మాత్రమే కాకుండా సమాజం కోసం.. ఇతరుల కోసం కూడా కృషిచేసేలా అప్పాసాహెబ్ లక్షలాది ప్రజల కర్తవ్య నిర్దేశం చేశారని శ్రీ షా అన్నారు. దేశానికి అవసరమైనప్పుడు అప్పాసాహెబ్‌ ‘సర్వే భవన్తు సుఖినః’ నినాదంతో ఇతరుల కోసం జీవించేలా లక్షలాది ప్రజలను కూడగట్టి తనతో నడిపించారని పేర్కొన్నారు. వివిధ రంగాల్లో ఆయన కృషి నేపథ్యంలోనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అప్పాసాహెబ్‌ను పద్మ అవార్డుతో సత్కరించిందని గుర్తుచేశారు.

హారాష్ట్ర భూషణ్ పురస్కారాన్ని 1995లో ఏర్పాటు చేశారని శ్రీ అమిత్ షా చెప్పారు. అప్పటినుంచీ మహారాష్ట్రతోపాటు దేశం కోసం సామాజిక జీవనంలోని వివిధ రంగాల్లో కృషిచేసిన అనేకమంది ప్రముఖులు ఈ అవార్డుతో సత్కరించబడ్డారని పేర్కొన్నారు. ఈ మేరకు పురుషోత్తం లక్ష్మణ్‌ దేశ్‌పాండే, గానకోకిల లతా మంగేష్కర్‌, ఆశా భోంస్లే, శాస్త్రవేత్త విజయ్‌ భట్కర్‌, రఘునాథ్‌ మషేల్కర్‌, జయంత్‌ నార్లికర్‌, అనిల్‌ కకోద్కర్‌, శివషాహిర్‌ బాబాసాహెబ్‌ పురందరే, మహారాష్ట్రలోని సులోచన భూషణ్‌సహా సుప్రసిద్ధ కళాకారులు నానాసాహెబ్‌ ఈ పురస్కారంతో గౌరవించబడ్డారని వివరించారు. ఇప్పుడు నానాసాహెబ్ కుటుంబానికి చెందిన అప్పాసాహెబ్‌కు ఈ పురస్కారం లభించిందని పేర్కొన్నారు.

కే కుటుంబం రెండోసారి మహారాష్ట్ర భూషణ్‌ పురస్కారం అందుకోవడం ఇదే ప్రథమమని ఆయన గుర్తుచేశారు. అప్పాసాహబ్‌ వివిధ రంగాల్లో తన ఆచరణాత్మక కృషిద్వారా ‘సమష్టిగా ముందడుగేద్దాం’ అనే నినాదంతో ప్రజలకు ఆదర్శంగా నిలిచి సమాజాన్ని ముందుకు నడిపించారని శ్రీ షా అన్నారు. బాలల అభివృద్ధికోసం కృషి చేసిన అప్పాసాహెబ్‌- ఉచిత విద్యా సామగ్రి పంపిణీ, మొక్కల పెంపకం, పరిశుభ్రత, రక్తదానం, పండుగల వేళ చెత్త శుభ్రం చేయడం, బావుల శుభ్రత, మహిళా సాధికారత, గిరిజన సంక్షేమం, మాదకద్రవ్య రహిత సమాజం కోసం కృషి, మూఢనమ్మకాలు-నిరక్షరాస్యత నిర్మూలనకు ఆదర్శప్రాయ రీతిలో విశేషంగా శ్రమించారు. అప్పాసాహెబ్ దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నట్లు శ్రీ అమిత్‌ షా పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిదాయక నాయకత్వంలో లక్షలాది అనుయాయులు సుదీర్ఘకాలం సమాజ సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. అన్నివిధాలా అర్హులైన అప్పాసాహెబ్ వంటి సంఘసేవా తత్పరుడికి మహారాష్ట్ర భూషణ్‌ పురస్కార ప్రదానం చేయడంపై ముఖ్యమంత్రి శ్రీ ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

*****


(Release ID: 1917236) Visitor Counter : 206