మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

జంతువులకు సోకే అవకాశం ఉన్న మహమ్మారుల నిరోధానికి సన్నద్ధత కార్యక్రమాలను, ప్రపంచ బ్యాంకు నిధులతో నడిచే యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ వన్ హెల్త్ ను ప్రారంభించిన ఎఫ్.ఎ.హెచ్.డి మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా


ఇది వన్ హెల్త్ విధానానికి అనుగుణంగా సంభావ్య జంతు మహమ్మారులకు భారతదేశ సంసిద్ధత , ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది.

యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్ నెస్ ఇనిషియేటివ్, ప్రపంచ బ్యాంకు నిధులతో నడిచే "యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ వన్ హెల్త్" జంతు మహమ్మారులను సమర్థంగా సమగ్రంగా పరిష్కరించడానికి సమగ్ర ప్రయత్నాలు - ఎఫ్.ఎ.హెచ్.డి మంత్రి

Posted On: 14 APR 2023 2:28PM by PIB Hyderabad

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక ,పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా ఈ రోజు వన్ హెల్త్ విధానానికి అనుగుణంగా సంభావ్య జంతు మహమ్మారి పై భారత దేశ సన్నద్ధత చొరవను, ప్రపంచ బ్యాంకు నిధులతో యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ వన్ హెల్త్ ను ప్రారంభించారు. జంతు, మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగించే జూనోటిక్ వ్యాధులపై దృష్టి సారించి, జంతు అంటువ్యాధులకు భారతదేశ సంసిద్ధత, ప్రతిస్పందనను పెంచడం ఈ చొరవ లక్ష్యం. పశువైద్య సేవలు ,మౌలిక సదుపాయాలు, వ్యాధి నిఘా సామర్థ్యాలు, ముందస్తుగా గుర్తించడం , ప్రతిస్పందన, జంతు ఆరోగ్య నిపుణుల సామర్థ్యాన్ని పెంపొందించడం, కమ్యూనిటీ అవుట్ రీచ్ ద్వారా రైతులలో అవగాహన పెంచడానికి ఈ చొరవ సహాయపడుతుంది.

 

భారతదేశంలోని ఐదు  రాష్ట్రాలను కవర్ చేసే వన్ హెల్త్ విధానాన్ని ఉపయోగించి మెరుగైన జంతు ఆరోగ్య నిర్వహణ వ్యవస్థ కోసం పర్యావరణ వ్యవస్థను సృష్టించడానికి ఉద్దేశించిన "యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ వన్ హెల్త్ (ఎహెచ్ఎస్ఎస్ఓహెచ్)" పై ప్రపంచ బ్యాంక్ నిధులతో చేపట్టిన ప్రాజెక్టును కూడా ఈ కార్యక్రమంలో ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల మాట్లాడుతూ,  భారతదేశం వైవిధ్యమైన జంతు జాతులకు నిలయం అని, దేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రతలో పశుసంవర్ధక రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

‘‘ఏదేమైనా, అభివృద్ధి చెందుతున్న జూనోటిక్ వ్యాధుల వల్ల కలిగే ముప్పులకు కూడా మనం గురవుతాము. యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ఇనిషియేటివ్ అనేది మన జంతు వనరులను రక్షించడానికి, మన ప్రజల భద్రత ,ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి ఒక క్రియాశీల చర్య. యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ఇనిషియేటివ్ ,ప్రపంచ బ్యాంక్ నిధులతో నడిచే "యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ వన్ హెల్త్" జంతు అంటువ్యాధులను సమర్థంగాపరిష్కరించడానికి సమగ్ర ప్రయత్నాలు. మన జంతు ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా,  వన్ హెల్త్ విధానాన్ని అమలు చేయడం ద్వారా, మన జంతువుల ఆరోగ్యం, సంక్షేమాన్ని ప్రభావితం చేయడమే కాకుండా గణనీయమైన ఆర్థిక ప్రభావం, మానవ ఆరోగ్య ఆందోళనలను కూడా ప్రభావితం చేసే జూనోటిక్ వ్యాధులను సమర్థంగా నివారించవచ్చు. నియంత్రించవచ్చు‘‘ అని పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా  మత్స్య, పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ మాట్లాడుతూ, "యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ఇనిషియేటివ్ (ఎపిపిఐ) , యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ వన్ హెల్త్ (ఎహెచ్ఎస్ఎస్ఓహెచ్) ప్రాజెక్టును ప్రారంభించడం జంతువులకు సోకే అవకాశం ఉన్న మహమ్మారులను ఎదుర్కోవటానికి ,  భవిష్యత్తులో ఏదైనా తెలియని అంటువ్యాధులను ఎదుర్కోవటానికి సంసిద్ధత దిశగా ఒక ముఖ్యమైన చర్య అని అన్నారు.  వన్ హెల్త్ కార్యక్రమాలను అమలు చేయడానికి కలిసి పనిచేయడం ద్వారా, ప్రజలకు పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చే స్థిరమైన ,ఆరోగ్యకరమైన చేపల పెంపకాన్ని మనం ప్రోత్సహించవచ్చునని

అన్నారు.

 

పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్ ప్రసంగిస్తూ, "అత్యవసర పరిస్థితి వంటి ఏదైనా మహమ్మారిని ఎదుర్కోవటానికి వ్యవస్థను సిద్ధం చేసే దిశగా ముందుకు సాగడానికి, వ్యాధిపై నిఘాను బలోపేతం చేయడం, వ్యాధి ముందస్తు హెచ్చరికకు నమూనాలను రూపొందించడం, ఆర్ అండ్ డి పర్యావరణ వ్యవస్థ ,రోగనిర్ధారణ సామర్థ్యాలను మెరుగుపరచడం, నియంత్రణ పర్యావరణ వ్యవస్థను క్రమబద్ధీకరించడం, ఈ రంగంలో మెరుగైన ప్రతిస్పందనలను అందించడం వనరులను సమీకరించడం వంటి వివిధ చర్యలను సమన్వయం చేయాలి‘‘ అన్నారు. దేశంలో పశుసంవర్థక వ్యవస్థలు, కార్యక్రమాలను మెరుగుపరచడానికి డి.ఎ.హెచ్.డి ముఖ్యమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.

యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్ నెస్ ఇనిషియేటివ్ లేదా ఎపిపిఐ అనేది వ్యాధి నివారణ, నియంత్రణ ,మహమ్మారి సన్నద్ధత ల అన్ని అంశాలను సమగ్రంగా కవర్ చేయడానికి ఒక చొరవ. కీలక అంశాలలో ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ అండ్ మానిటరింగ్, ఎర్లీ వార్నింగ్ అండ్ రెస్పాన్స్, వ్యాక్సిన్/ డయాగ్నస్టిక్స్, ఆర్ అండ్ డీ అండ్ ప్రొడక్షన్, ఫండింగ్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ,ఎకోసిస్టమ్ కోఆర్డినేషన్ వంటివి ఉన్నాయి.

 

ఈ కార్యక్రమంలో వన్ హెల్త్ సపోర్ట్ యూనిట్ పై బులెటిన్/ప్రచురణ ను విడుదల చేశారు. ఎ పి ఐ, ఎ హెచ్ ఎస్ ఎస్ ఒ హెచ్  వీడియోలు ప్రారంభించారు.

 

భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ , ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ప్రొఫెసర్ (డా) అతుల్ గోయెల్, ప్రపంచ బ్యాంకు అగ్రికల్చర్ అండ్ ఫుడ్ గ్లోబల్ ప్రాక్టీస్ హెడ్ ఒలివర్ బ్రెడ్ట్, పశుసంవర్ధక శాఖ కమిషనర్ డాక్టర్ అభిజిత్ మిత్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సంస్థలు (డబ్ల్యూహెచ్ఓ, డబ్ల్యుబి, ఎఫ్ఎఓ, డబ్ల్యుఓహెచ్, యుఎన్ఇపి), సంబంధిత మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, ఐసిఎఆర్, ఐసిఎంఆర్ పరిశోధన సంస్థలకు చెందిన జంతు ఆరోగ్య నిపుణులు ,ఇతర ప్రభుత్వ భాగస్వాములతో సహా వివిధ రంగాలకు చెందిన దాదాపు 200 మంది ముఖ్య భాగస్వాములు పాల్గొన్నారు.

 

యానిమల్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ ఇనిషియేటివ్ ,ప్రపంచ బ్యాంకు నిధులతో నడిచే యానిమల్ హెల్త్ సిస్టమ్ సపోర్ట్ ఫర్ వన్ హెల్త్ ను విజయవంతంగా అమలు చేయడానికి భారత ప్రభుత్వ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ(డి.ఎ.హెచ్.డి) కట్టుబడి ఉంది ఈ ముఖ్యమైన లక్ష్యం కోసం అన్ని భాగస్వాములతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తోంది.

 

****

 

 (Release ID: 1916825) Visitor Counter : 106