సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బాబా సాహెబ్ డా.బి.ఆర్.అంబేడ్కర్ 133వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన భరత జాతి

प्रविष्टि तिथि: 14 APR 2023 1:40PM by PIB Hyderabad

భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా, రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము నివాళులు అర్పించారు. ఈ ఉదయం పార్లమెంట్‌ హౌస్‌ కాంప్లెక్స్‌లోని సంసద్‌ భవన్‌లోని బాబా సాహెబ్‌ విగ్రహానికి రాష్ట్రపతి పూలమాల వేసి అంజలి ఘటించారు.

 

ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా కూడా భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ అంబేడ్కర్ చిత్రపటం వద్ద పూమాలలు ఉంచి నివాళులు అర్పించారు.

 

కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత శాఖ మంత్రి డా. వీరేందర్ కుమార్, ఇతర కేంద్ర మంత్రులు, నాయకులు ప్రముఖులు కూడా నివాళులర్పించారు.

 

 

కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

***


(रिलीज़ आईडी: 1916819) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil