ప్రధాన మంత్రి కార్యాలయం
వివిధ వేడుకలలో ప్రధానమంత్రి పాల్గొన్న దృశ్యాలను పంచుకున్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి శ్రీ జాన్ బర్లా
प्रविष्टि तिथि:
14 APR 2023 9:31AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వివిధ వేడుకలలో పాల్గొన్న దృశ్యాలను కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ జాన్ బార్లా ప్రజలతో పంచుకున్నారు. ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ నివాసంలో తమిళ నూతన సంవత్సరాది కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. అలాగే ఢిల్లీలోని సేక్రేడ్ హార్ట్ కేథడ్రల్‌లో ఈస్టర్ వేడుకలకు ఆయన హాజరవడం, కేంద్ర మంత్రి నివాసంలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొనడం, శ్రీ పీయూష్ గోయల్, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ నివాసంలో బిహు వేడుకలకు హాజరడం వంటి సందర్భాల దృశ్యాలను జాన్ బార్లా పంచుకున్నారు.
ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వరుస ట్వీట్ల ద్వారా పంచుకున్న సందేశాలపై స్పందిస్తూ పంపిన సందేశంలో:
“భారతదేశపు సాంస్కృతిక వైభవం-వైవిధ్యం మనల్ని మరింత బలోపేతం చేస్తాయి. ప్రజలతో మమేకం కావడం, తమ విశిష్ట వారసత్వం ఆధారిత సంబరాలు చేసుకోవడం ఎంతో ఆనందం కలిగించే అంశాలు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1916600)
आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam