మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండవ జి 20 సాధికారత సమావేశం మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలను గుర్తించింది


ప్రతినిధులు ప్రతిపాదించిన ఫలితాలు భారత ప్రెసిడెన్సీ కింద జి 20 సాధికారత మూడు అంశాలను కలిగి ఉన్నాయి - మహిళా వ్యవస్థాపకత: ఈక్విటీ , ఎకానమీ రెండింటికీ విజయం. విద్య: మహిళా సాధికారతకు ఆటను మార్చే మార్గం. అట్టడుగు స్థాయితో సహా అన్ని స్థాయిలలో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి భాగస్వామ్యాన్ని సృష్టించడం.

మహిళలు అవసరమైన నైపుణ్యాలు, వనరుల అందుబాటు, మౌలిక సదుపాయాల మద్దతు, అనుకూల పరిస్థితులు, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి వైపు పరివర్తనాత్మక మార్పు కోసం మార్గదర్శకత్వం కలిగిన ప్రపంచం సృష్టిని జి 20 ఎంపవర్ ప్రతిపాదనలు వేగవంతం చేస్తాయి.

2023 ఏప్రిల్ 5 - 6 తేదీల్లో కేరళలోని తిరువనంతపురంలో రెండవ జీ20 ఎంపవర్ సమావేశం జరిగింది.

Posted On: 13 APR 2023 1:01PM by PIB Hyderabad

2023 ఏప్రిల్ 5, 6 తేదీల్లో కేరళలోని తిరువనంతపురంలో రెండో జీ20 సాధికార (ఎంపవర్)  సమావేశం జరిగింది. మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి కార్యాచరణ కోసం జి 20 భాగస్వామ్యాన్ని సృష్టించే దిశగా ఈ సమావేశం ఒక కీలక అడుగు.

 

ఇందులో ఎనిమిది  జీ20 దేశాల (మెక్సికో, సౌదీ అరేబియా, అమెరికా, జపాన్, దక్షిణాఫ్రికా, టర్కీ, ఇటలీ, ఫ్రాన్స్) నుంచి 18 మంది, ఆరు ఆహ్వానిత దేశాల (బంగ్లాదేశ్, ఒమన్, స్పెయిన్, యు ఇఎ , నెదర్లాండ్స్, నైజీరియా) నుంచి తొమ్మిది మంది, ఆరు అంతర్జాతీయ సంస్థల (యు ఎన్ వుమెన్ , ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, యునిసెఫ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఐఎల్ఓ) నుంచి తొమ్మిది మంది పాల్గొన్నారు.

 

ప్రతినిధులు ప్రతిపాదించిన ఉద్దేశిత ఫలితాలు భారత ప్రెసిడెన్సీ కింద జి 20 ఎంపవర్ మూడు అంశాలనూ - మహిళా వ్యవస్థాపకత (ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్): ఈక్విటీ అండ్ ఎకానమీ రెండింటికీ గెలుపు (విన్-వినఅవకాశం, విద్య: మహిళా సాధికారతకు ఆటను మార్చే (గేమ్ చేంజింగ్)మార్గం, అట్టడుగు స్థాయితో సహా అన్ని స్థాయిల్లో మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ఒక భాగస్వామ్యాన్ని సృష్టించడం - కలిగి ఉన్నాయి. వీటన్నింటి వెనుక డిజిటల్ టెక్నాలజీ శక్తి ఉంది.

 

ఈ రెండవ జి 20 ఎంపవర్ సమావేశం 2023 ఫిబ్రవరి 11 , 12 తేదీలలో జరిగిన మొదటి సమావేశానికి కొనసాగింపుగా  జరిగింది, అందులో ఆర్థిక సమ్మిళితం- వ్యాపార వేగవంతం, మార్గదర్శకత్వం, , ఎస్ టి ఇ ఎం, కార్పొరేట్ ఉమెన్ ఎంపవర్మెంట్,  డిజిటల్ ఇంక్లూజన్ పై చర్చించడానికి ఐదు వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేశారు.

 

జి 20 ఎంపవర్  ప్రభుత్వం , ప్రైవేట్ రంగం మధ్య భాగస్వామ్యం కావడంతో, వర్కింగ్ గ్రూపులు ప్రైవేట్ రంగ కట్టుబాట్ల కోసం సిఫార్సులను రూపొందించాయి. ప్రభుత్వాలకు చర్యలను సూచించాయి.

మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని నిర్దేశించడానికి జి 20 ఎంపవర్ ఉద్దేశిస్తున్న కీలక కార్యాచరణ చర్యలు ఈ సిఫార్సులలో ఉన్నాయి.

 

కెపిఐ లను ముందుకు తీసుకెళ్లడం గత అధ్యక్ష దేశాల హయాంలో అభివృద్ధి చేసిన ఉత్తమ పద్ధతుల (బెస్ట్ ప్రాక్టీసెస్) ప్లేబుక్ ను జోడించడంపై  ప్రతినిధి వర్గాలు చర్చించాయి.

 

భారత్ అధ్యక్షతన, జి 20 ఎంపవర్ ఒక మెంటర్షిప్ ప్లాట్ఫామ్ గురించి చర్చించింది, ఇది ఇ-ప్లాట్ఫామ్ ద్వారా మార్గదర్శకత్వం ,  సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా అన్ని స్థాయిలలో మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి ప్రతిపాదించబడింది.

భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ మహిళా సాధికారత వేదిక పై దీన్ని నిర్వహించనున్నారు. ఇది మహిళా మార్గదర్శకులు, జి 20 దేశాల మెంటర్ల  మధ్య నిర్మాణాత్మక విజ్ఞాన మార్పిడిని సులభతరం చేసే గ్లోబల్ మెంటరింగ్ , కెపాసిటీ-బిల్డింగ్ పోర్టల్ గా పనిచేస్తుంది.

స్టెమ్, బిజినెస్ లీడర్షిప్, ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే ఉన్న సబ్జెక్ట్-స్పెసిఫిక్ మెంటార్షిప్ పోర్టల్ లకు ఇది అగ్రిగేటర్ గా కూడా పనిచేస్తుంది. ఈ వేదిక ద్వారా అందించే మెంటర్ షిప్, నెట్ వర్కింగ్, నాలెడ్జ్ షేరింగ్, కెపాసిటీ బిల్డింగ్, బెస్ట్ ప్రాక్టీసెస్ ద్వారా చిన్న, మధ్యతరహా, పెద్ద సంస్థల్లోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు కింది స్థాయి పారిశ్రామిక నాయకులు కూడా వేగవంతమైన విజయాలను సాధిస్తారు.

 

డిజిటల్ నైపుణ్యాలలో లింగ విభజన, అలాగే విద్య , నైపుణ్యం మరింత విస్తృతంగా మహిళల సామర్థ్యాన్ని ప్రభావితం చేశాయి, స్టెమ్ విషయంలో ఈ అంతరం ముఖ్యంగా ఎక్కువగా ఉంది - ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ,  అత్యధిక వేతనంతో కూడిన ఉద్యోగాలు ,  వ్యవస్థాపక అవకాశాలను కలిగి ఉన్న రంగం. జి 20 ఎంపవర్ ప్రతిపాదనలు ఈ విద్య ,  నైపుణ్య అంతరాలను పూడ్చడానికి ప్రయత్నిస్తాయి.  తరువాత కౌమార బాలికలు , యువతులు విద్య నుండి పనికి విజయవంతంగా మారడానికి అవసరమైన నైపుణ్యాలతో సాధికారతను అందిస్తాయి.

 

ఈ దిశగా డిజిటల్ ఇన్ క్లూజన్ ప్లాట్ ఫామ్ ను ఎడ్యుకేషన్ అండ్ అప్ స్కిల్ పోర్టల్ గా అభివృద్ధి చేశారు, ఇది వివిధ భౌగోళిక ప్రాంతాల లోని మహిళలు భవిష్యత్తులో ఉద్యోగాలు , వ్యవస్థాపకతకు కీలకమైన డిజిటల్, సాంకేతిక , ఆర్థిక పరిజ్ఞానాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. ఇది 120+ అంతర్జాతీయ ,  భారతీయ భాషలలో అందుబాటులో ఉంటుంది.  పైన పేర్కొన్న అంశాలలో గ్లోబల్ కంటెంట్ ,  కోర్సుల అగ్రిగేటర్ గా పనిచేస్తుంది. ఇది మహిళలకు మార్గనిర్దేశం చేయడానికి, కంటెంట్ అందించడానికి , ఇంటర్నషిప్ లు, ఉద్యోగాలతో సరిపోలడానికి సహాయపడుతుంది. ఈ ప్లాట్ ఫారం ఫ్రేమ్ వర్క్ ను సమర్పించి చర్చల సందర్భంగా ప్రస్తావించారు.

 

మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న రుణ లభ్యత , మార్కెట్ ప్రాప్యత వంటి అత్యంత గణనీయమైన అవరోధాలు చుట్టూ ఉన్నందున, జి 20 ఎంపవర్  ఈ రంగాలలో ప్రభావవంతమైన సిఫార్సులను ప్రతిపాదించింది. పూల్డ్ క్రెడిట్ ఫండ్స్, క్రెడిట్ గ్యారంటీలు, 'మహిళలు సగర్వంగా సొంతం చేసుకున్న' ముద్ర ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో జెండర్ రెస్పాన్సిబిలిటీ ప్రొక్యూర్మెంట్ ను ప్రోత్సహించడం వంటి సుస్థిర లింగ సమ్మిళిత ఆర్థిక నమూనాలకు ఇవి ప్రాధాన్యమిస్తాయి. ఇది మహిళా పారిశ్రామికవేత్తల మరింత శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడమే కాకుండా, మహిళా పారిశ్రామికవేత్తలు మహిళా కార్మికులను నియమించుకునే అవకాశం ఎక్కువగా ఉన్నందున, ఇది మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యానికి కూడా దారితీస్తుంది.

 

అంతేకాక, జి 20 ఎంపవర్ సిఫార్సులు సంరక్షణ భారం మహిళల ఆర్థిక భాగస్వామ్యానికి ఆటంకం కలిగించని ప్రపంచాన్ని సూచిస్తాయి. సబ్సిడీతో కూడిన శిశు సంరక్షణ లభ్యత, శిశుగృహాలను పాఠశాల వ్యవస్థల్లో విలీనం చేయడం,  పని ప్రదేశాలలో నర్సింగ్ గదులు / శిశుగృహ సౌకర్యాలను అందించడం వంటి వాటితో సహా సంరక్షణ పర్యావరణ వ్యవస్థ పై చర్చలు బలమైన దృష్టి పెట్టాయి.

 

స్కాలర్ షిప్ లు, స్టెమ్ లో కార్పొరేట్ ఫెలోషిప్ లు, సంప్రదాయేతర వృత్తిపరమైన రంగాలతో సహా కౌమార బాలికలు , యువతులకు అప్రెంటిస్ షిప్ లు, అలాగే ఆర్ అండ్ డి రంగంలో స్టెమ్ గ్రాడ్యుయేట్ లకు అప్రెంటిస్ షిప్ ల ద్వారా కౌమార బాలికలకు పాఠశాల నుండి పని ,  వృత్తి-అభివృద్ధి అవకాశాలను ప్రోత్సహించడానికి ప్రైవేట్ రంగం కట్టుబడి ఉండాలని జి 20 ఎంపవర్ సిఫార్సు చేసింది.

 

ముఖ్యంగా, పాలనలో మహిళల విభిన్న అవసరాలు ,  సమస్యల ప్రాధాన్యతకు ,  సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్ డి జి ) స్థానికీకరించడానికి అన్ని స్థాయిలలో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలలో మహిళల భాగస్వామ్యం,  ప్రాతినిధ్యం కీలకమని జి 20 ఎంపవర్ గుర్తించింది.

ఆన్ లైన్ వేదికలు, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, ముఖ్యంగా శాస్త్రీయ, సంప్రదాయేతర రంగాల్లో మహిళలు, బాలికలకు జీవితకాల అభ్యాసం, డిజిటల్ నైపుణ్యం కోసం చొరవల ద్వారా క్షేత్రస్థాయితో సహా అన్ని స్థాయిల్లో మహిళలకు నైపుణ్యం, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ లను పెంపొందించడంలో అంతరాలను భర్తీ చేస్తుంది.

 

జీ20 ఎంపవర్ ప్లెడ్జ్ (ప్రతిజ్ఞ) పై కూడా చర్చించారు. నాయకత్వ స్థానాలకు మహిళలను మరింతగా ప్రోత్సహించడానికి వీలుగా ప్లెడ్జ్ కు భారతదేశం కొన్ని అదనపు నిబంధనలను ప్రతిపాదించింది. భారత్ అధ్యక్షత కింద జీ20 ఎంపవర్ అడ్వకేట్స్ నెట్ వర్క్ ను విస్తరించే ప్రయత్నం కొనసాగుతుంది.

 

ఇవి, ఇంకా అనేక ఇతర నిబద్ధతలు, చొరవల ద్వారా, జి 20 ఎంపవర్ ప్రతిపాదనలు మహిళలకు అవసరమైన నైపుణ్యాలు, వనరుల లభ్యత, మౌలిక సదుపాయాల మద్దతు, అనుకూల వాతావరణం, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి వైపు పరివర్తనాత్మక మార్పు కోసం మార్గదర్శకత్వం ఉన్న వ్యవస్థ  సృష్టిని వేగవంతం చేస్తాయి.

 

***


(Release ID: 1916372) Visitor Counter : 184