సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ విజయాలపై ధరోహర్ భారత్ కీ- పునరుత్థాన్ కి కహానీ డాక్యుమెంటరీ ని ప్రసారం చేయనున్న దూరదర్శన్
నూతన జాతీయ దృశ్యమాన క్షేత్రాలను నిర్మించాలన్న ప్రధానమంత్రి మోడీ దార్శనికతను, దాని అమలును అనుసరించనున్న సిరీస్
మన సాంస్కృతిక ఐక్యత, ఆత్మగౌరవపు స్ఫూర్తిని పునరుత్థానాన్ని వివరించనున్న డాక్యుమెంటరీ
జాతీయ ఐతాహాసిక క్షేత్రాల గురించి వివరిస్తూ ఏప్రిల్ 14, 15వ తేదీల్లో ప్రసారం కానున్న రెండు భాగాల సిరీస్‌కు యాంకరింగ్ చేయనున్న ప్రముఖ డిజిటల్ మీడియా ప్రెజెంటర్ కమియా జానీ
Posted On:
13 APR 2023 2:38PM by PIB Hyderabad
భారతదేశ వర్తమాన శక్తి సుసంపన్నమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, జాతీయ నైతిక జ్ఞానంలో పాతుకుని ఉంది. ఈ పురోగమన విక్షేప కాల బిందువులో దూరదర్శన్ ధరోహర్ భారత్ కి - పునరుత్థాన్ కి కహానీ (భారత వారసత్వ సంపద- దాని పునరుజ్జీవన గాథ) అన్న రెండు భాగాల కథా చిత్రాన్ని ప్రసారం చేస్తోంది. దీని తొలి ఎపిసోడ్‌ను 14 ఏప్రిల్ 2023న సాయంత్రం 8.00 గంటలకు, రెండవ ఎపిసోడ్‌ను 15 ఏప్రిల్ 2023 సాయంత్రం 8.00 గంటలకు దూరదర్శన్ నేషనల్ ఛానెల్‌లో ప్రసారం కానున్నాయి. ఈ డాక్యుమెంటరీకి ప్రముఖ డిజిటల్ మీడియా సమర్పకురాలు కామియా జానీ యాంకరింగ్ చేయనున్నారు.
ఈ కథాచిత్రం కోసం ప్రత్యేకంగా ముచ్చటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన సైనికులు తమ యావజ్జీవితాన్ని అంకితం చేయడమే కాక మన మాతృభూమిలో అణువణువును పరిరక్షించేందుకు తమ యావత్ జీవితాన్ని త్యాగం చేశారు. వారి త్యాగాలను మాటలలో కొలవలేం; భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని ఇచ్చేందుకు ఆ వైభవాన్ని, ప్రాముఖ్యతను సజీవంగా చూపవలసిందేనని అన్నారు.
ఈ దార్శనికతకు అనుగుణంగా, భారతదేశ సాంస్కృతిక ఐక్యతా స్ఫూర్తి, ఆత్మగౌరవ పునరుజ్జీవనంలో గత కొన్ని ఏళ్ళలో భారతదేశం సాధించిన పురోగతిని ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించనుంది. జలియన్‌వాలా బాగ్ వంటి దేశభక్తిని చాటే ప్రదేశాల పవిత్రతను కాపాడటం, రామ జన్మభూమి, కాశీ విశ్వనాథ్ ధామ్, సోమ్‌నాథ్ ధామ్, కేదార్‌నాథ్ థామ్ వంటి మన నాగరికతా కేంద్రాల వైభవాన్ని పునఃచైతన్యపరచడం, అలాగే కర్తార్‌పూర్ సాహెబ్ వంటి ఆధ్మాత్మిక క్షేత్రాలకు తగిన గౌరవాన్ని ఇవ్వడం, సెల్యులార్ జైలు వంటి స్ఫూర్తిదాయక ప్రాంతాలలో మన స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను గుర్తు చేసుకొని, గౌరవించడం, ఇండియా గేట్ తోరణం కింద నేతాజీ విగ్రహంతో నేతాజీ బోస్ చేసిన సేవలను ప్రముఖంగా గుర్తించడం, గత, వర్తమాన దేశభక్తుల ఐతిహాసిక సేవలను వార్ మెమోరియల్ ద్వారా గౌరవించడం వంటివి ఈ డాక్యుమెంటరీలో సమర్పిస్తున్న కొన్ని ఇతివృత్తాలు.
పురాతన్, మహా పరంపరావోంకె ప్రతి ఆకర్షణ్ ( పురాతన, మన గొప్ప పరంపరల పట్ల ఆకర్షణ) లేదా మన ప్రాచీన, ఉదాత్తమైన, అసమాన వారసత్వం పట్ల ఆసక్తి అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్పష్టమైన పిలుపు అన్నది సమాజంలోని అన్ని వర్గాల చారిత్రిక భాగస్వామ్యంతో ఒక జాతీయ దృగ్విషయమైంది. ఈ డాక్యుమెంటరీ అన్న ఈ మూల భావన ప్రతిఫలనం. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా మన సమిష్ఠి ఆత్మగౌరవం మనను పనరుజ్జీవింపచేస్తున్నప్పటికీ, మన స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను పూర్తిగా అవగాహన చేసుకుని, వారి వారసత్వాన్ని స్మరించుకోవడం నేటి యువతకు అత్యవసరం.
వాటితో సమానంగా, సబర్మతీ ఆశ్రమం వంటి పునరుద్ధరించి, సుందరీకరించిన ఆధ్యాత్మిక కేంద్రాల పవిత్రత, ఐక్యతా స్థూపం, పంచతీర్థ వంటి విగ్రహాలు, కొత్త స్మారక చిహ్నాలు నిర్మాణం వెనుక ఉన్న కారణాలను ఈ డాక్యుమెంటరీ ద్వారా పూర్తిగా అర్థం చేసుకోవచ్చు.
ఈ రెండు భాగాల డాక్యుమెంటీ సారంశం ఏమిటంటే, భారతదేశపు విస్తారమైన, శక్తివంతమైన, అందరినీ కలుపుకుపోయే సంస్కృతిని దృశ్యమానం చేసి ఆకట్టుకునేలా ప్రదర్శించడం ద్వారా మన సుసంపన్నమైన, వైవిధ్యభరితమైన వారసత్వాన్ని ఉత్సవం చేసుకోవడం.
ధరోహర్ భారత్ కీ (భారత వారసత్వ సంపద- దాని పునరుజ్జీవన గాథ) అన్నది ప్రతి చోటా ఉన్న భారతీయుల మనసులతో పాటుగా ప్రతి భారతీయ హృదయానికీ ఆనందాన్ని, ఆత్మగౌరవాన్ని చేకూరుస్తుంది. మన మూలాలకు చేసే ప్రయాణపు అనుభవాన్నిఅనుభూతించడం ద్వారా మాత్రమే మన ఉజ్జ్వలమైన భవిష్యత్‌కు మార్గాన్ని అనుసరించగలం.
***
(Release ID: 1916371)
Visitor Counter : 164