మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) యువ రచయితల సదస్సు ప్రారంభం
- సదస్సును ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక & విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
Posted On:
12 APR 2023 4:53PM by PIB Hyderabad
కేంద్ర సాంస్కృతిక & విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి ఈరోజు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) యువ రచయితల సదస్సును ప్రారంభించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా చైర్మన్ ప్రొఫెసర్ గోవింద్ ప్రసాద్ శర్మ, విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి సౌమ్య గుప్తా, నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా డైరెక్టర్ శ్రీ యువరాజ్ మాలిక్ల సమక్షంలో మంత్రి ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సును విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. న్యూ ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియాను ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా 12-13 ఏప్రిల్ 2023న ఈ సదస్సును ఏర్పాటు చేసింది. సదస్సును ప్రారంభిస్తూ శ్రీమతి. మీనాక్షి లేఖి మాట్లాడుతూ మన సంస్కృతుల్లో అనేక సారూప్యతలు ఉన్నాయని, ఈ బంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి వారసత్వం యొక్క అనుసంధానాలను కనుగొనడం మరియు యువతలోని నాగరికత, సామాజిక విలువ వ్యవస్థల అనుభవాల నుండి నేర్చుకోవడం కొనసాగించడం వంటి ఆలోచనలు కూడా అత్యవసరమని మంత్రి జోడించారు. ప్రొఫెసర్ గోవింద్ ప్రసాద్ శర్మ ప్రతినిధులను స్వాగతించారు మరియు పరస్పర అభివృద్ధికి సంభాషణలు మరియు సహకారాలు అవసరమని హైలైట్ చేశారు. మన భాగస్వామ్య సంస్కృతిని మరింత మెరుగ్గా మరియు లోతుగా అర్థం చేసుకునేందుకు యువత ఒకరి సమాజంలోని విభిన్న సంస్కృతి, సంప్రదాయాలు మరియు దృక్పథాలను అర్థం చేసుకోవడానికి కృషి చేయాలని ఆయన అన్నారు. శ్రీమతి సౌమ్య గుప్తా మాట్లాడుతూ నాగరికత సంభాషణలు మానవ పురోగతికి సారాంశమని మరియు ఈ ఆలోచనల మార్పిడి యువత ఉనికి ప్రధానమని అన్నారు. సీఎస్ఓ డిప్యూటీ సెక్రటరీ జనరల్ శ్రీ జనేష్ కైన్, వీడియో సందేశం ద్వారా సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, షాంఘై సహకార సంస్థ ప్రారంభం నుండి ప్రపంచ నాగరికతల మధ్య సహకారాన్ని పెంపొందించిందని అన్నారు. కొనసాగుతున్న యువ రచయితల సదస్సు సాహిత్యం, సంస్కృతి మరియు కళల రంగంలో మన దేశాల మధ్య సహకార సంప్రదాయాన్ని నెలకొల్పుతుంది. శ్రీ యువరాజ్ మాలిక్ తన ప్రసంగంలో, తరువాతి తరం నాయకులుగా యువత కొత్త దృక్కోణాలను తీసుకురావడానికి, ఆవిష్కరణలను నడిపించడానికి, వ్యవస్థాపకతను పెంపొందించడానికి మరియు పరస్పర సాంస్కృతిక అవగాహనను ప్రోత్సహించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని అన్నారు. ఎస్సీఓ యువ రచయితల సదస్సు యువ రచయితలు మరియు పండితులకు అర్ధవంతమైన సంభాషణలో పాల్గొనడానికి వేదికను అందించడం ద్వారా యువకులను శక్తివంతం చేయడానికి సంస్థ యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. కాన్ఫరెన్స్ యొక్క ఇతివృత్తం ‘ఎస్సీఓ సభ్య దేశాల మధ్య నాగరికత సంభాషణ - యువ పండితుల దృక్కోణాలు ‘ ఇందులో చరిత్ర & తత్వశాస్త్రం, ఆర్థికం, మతం, సంస్కృతి, సాహిత్యం మరియు సైన్స్ & మెడిసిన్లు ఉప- ఇతివృత్తాలుగా ఉన్నాయి. రెండు రోజుల ఎస్సీఓ యువ రచయితల సదస్సు ఆధునిక విద్య, శిక్షణ మరియు యువతకు అధునాతన శిక్షణ, వ్యవస్థాపక కార్యకలాపాలలో విస్తృత ప్రమేయం మరియు వినూత్న ప్రాజెక్టుల మార్గాలను అన్వేషించడానికి డైనమిక్ వేదికను అందిస్తుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) అనేది షాంఘైలో 15 జూన్ 2001న స్థాపించబడిన.. ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ ఎస్సీఓ ప్రస్తుతం ఎనిమిది సభ్య దేశాలను (చైనా, ఇండియా, కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, రష్యా, పాకిస్తాన్, తజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్) కలిగి ఉంది.
***
(Release ID: 1916064)
Visitor Counter : 161