వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్-ఫ్రాన్స్ వాణిజ్య సదస్సు, సీఈవో ల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన శ్రీ పీయూష్ గోయల్

Posted On: 12 APR 2023 9:26AM by PIB Hyderabad

ఫ్రాన్స్ లోని పారిస్ లో నిన్న జరిగిన భారత్-ఫ్రాన్స్ వాణిజ్య సదస్సు, సీఈవో ల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర వాణిజ్యం,పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ,జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ పాల్గొన్నారు. సమావేశంలో ప్రసంగించిన శ్రీ గోయల్ అభివృద్ధి సాధించడానికి భారతదేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. ఉత్పత్తులు, సేవల ఎగుమతులు 50% పైగా వృద్ధి నమోదు చేస్తున్నాయని తెలిపిన శ్రీ గోయల్ వృద్ధి రేటును కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. 2030 నాటికి భారతదేశం నుంచి వస్తువులు, సేవల ఎగుమతులు మూడు రెట్లు పెరిగి $ 765 నుంచి $2 ట్రిలియన్లకు చేరుకుంటాయని ఆశిస్తున్నామని శ్రీ గోయల్ వివరించారు.

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), మూవ్మెంట్ ఆఫ్ ది ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఫ్రాన్స్, ఇండో ఫ్రెంచ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సహకారంతో ఫ్రాన్స్ లో భారత రాయబార కార్యాలయం సమావేశాలను నిర్వహించింది. 

భారతదేశం-ఫ్రాన్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం మరింత అభివృద్ధి సాదిస్తాయన్న ధీమాను ఫ్రాన్స్ విదేశీ వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాలు, విదేశాల్లో నివసిస్తున్న ఫ్రెంచ్ పౌరుల  సంక్షేమ శాఖ మంత్రి ఒలివర్ బెచ్ట్  వ్యక్తం చేశారు.' ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు భారతదేశంలో నివసిస్తున్నారు. భారతదేశంలో ఉత్పత్తి రంగం అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికే అనేక ఫ్రెంచ్ సంస్థలు పనిచేస్తున్నాయి. రెండు దేశాల మధ్య అవగాహన కుదిరితే మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి' అని  ఒలివర్ బెచ్ట్ అన్నారు.

ఫ్రాన్స్ దేశంతో సంబంధాలకు భారతదేశం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని సీఐఐ ఉపాధ్యక్షుడు, ఐటీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రో సంజీవ్ పూరి అన్నారు. సీఐఐ కి చెందిన పెద్ద బృందం ఫ్రాన్స్ సమావేశాలకు హాజరవడం రెండు దేశాల మధ్య ఉన్న పటిష్ట  సంబంధాలకు నిదర్శనం అన్నారు.

ఆవిష్కరణలు, సమగ్ర ఆర్థిక అభివృద్ధి, పర్యావరణం, సామాజిక, పరిపాలన రంగాలు, ఆఫ్రికా పట్ల ప్రపంచ సహకారం సాధన కోసం భారతదేశం, ఫ్రాన్స్ కలిసి పనిచేస్తున్నాయని సీఐఐ డీజీ శ్రీ చంద్రజిత్ బెనర్జీ అన్నారు.   

' హరిత భవిష్యత్తు నిర్మాణం' ,' క్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి' ,'రక్షణ సహకారం', 'ఆత్మ నిర్భర్ సాధన ద్వారా పరస్పర అభివృద్ధి సాధించడం' ' భారత్-ఫ్రాన్స్ కలయిక ద్వారా యూరప్, ఇండో పసిఫిక్ ప్రాంతం అభివృద్ధి' అనే అంశాలపై సదస్సులు నిర్వహించారు.

హరిత భవిష్యత్తు నిర్మాణం: 

హరిత అభివృద్ధి సాధించే అంశానికి భారతదేశం, ఫ్రాన్స్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. పర్యావరణ లక్ష్య సాధన కోసం రెండు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. హరిత భవిష్యత్తు సాధన కోసం జరుగుతున్న ప్రయత్నాలు అపారమైన మార్కెట్ అవకాశాలను అందిస్తాయి. లక్ష్యాలను సాధించడానికి భారీ పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటాయి. ఇటీవల కాలంలో పెట్టుబడులు, పరస్పర సహకారం, సంయుక్త సంస్థల ఏర్పాటు లాంటి అంశాలలో భారతదేశం, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. గ్రీన్ టెక్నాలజీ రంగంలో భారతదేశానికి ఫ్రాన్స్ సహకారం అందించింది. పునరుత్పాదక ఇంధన రంగం, హరిత భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన,నిర్మాణం, ఇంధన సామర్థ్యం, పారిశ్రామిక రంగం, వ్యవసాయం లాంటి రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేయడానికి గల అవకాశాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. తూర్పు యూరప్,  మధ్యప్రాచ్యం మరియు ఆసియా దేశాల ఏఎఫ్ డి అధిపతి సిరిల్ బెల్లియర్. సదస్సు అనుసంధానకర్తగా వ్యవహరించారు. 

 క్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి: 
అధునాతన కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, నెట్‌వర్కింగ్ టెక్నాలజీ, అధునాతన మెటీరియల్స్, ఇంజన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, సిస్టమ్స్, సెన్సార్లు,పునరుత్పాదక ఇంధన రంగం, సెమీ కండక్టర్లు  మైక్రోఎలక్ట్రానిక్స్, డెరైక్ట్ ఎనర్జీ, హైపర్‌సోనిక్స్ మొదలైన  క్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిలో పరస్పర  సహకారం, పోటీ పెరుగుతున్నాయి. 

సార్వభౌమాధికారం, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అంశాలకు భారతదేశం, ఫ్రాన్స్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.  క్లిష్ట సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అనే అంశంపై జరిగిన సదస్సులో ఈ రంగంలో రెండు దేశాలు కలిసి పనిచేయడానికి గల అవకాశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. సాంకేతిక రంగంలో భారతదేశం,ఫ్రాన్స్ దేశాల మధ్య సహకారం చర్చకు వచ్చింది.  డిజిటల్ వ్యవహారాల రాయబారి, యూరప్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి  హెన్రీ వెర్డియర్ సదస్సు అనుసంధానకర్తగా వ్యవహరించారు. 

రక్షణ సహకారం: ఆత్మనిర్భర్ భారత్ ద్వారా భాగస్వామ్య భవిష్యత్తును :
ఇండో పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సవాళ్లతో సహా అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయాలు , అంతరిక్ష రంగం సైబర్‌స్పేస్ వంటి కొత్త రంగాలలో ఎదురవుతున్న  పోటీ, సవాళ్లు నేపథ్యంలో రెండు దేశాల మధ్య పరస్పర సహకారం ప్రాధాన్యతను గుర్తు చేశాయి.రక్షణ ప్లాట్‌ఫారమ్‌లు, పరికరాలు, సాంకేతికత రంగాల్లో  భారతదేశానికి  ఫ్రాన్స్ దీర్ఘకాలంగా సహకారం అందిస్తోంది. కేవలం సరఫరాకు మాత్రమే రెండు దేశాల మధ్య సహకారాన్ని పరిమితం చేయకుండా  రక్షణ సాంకేతికతలను అభివృద్ధి,  రూపకల్పన రంగాల్లో సహకారం సాధించడానికి గల అవకాశాలు సదస్సులో చర్చకు వచ్చాయి. సీఐఐ   డీజీ శ్రీ  చంద్రజిత్ బెనర్జీ సదస్సు అనుసంధానకర్తగా వ్యవహరించారు. 

 భారత్-ఫ్రాన్స్ కలయిక ద్వారా యూరప్, ఇండో పసిఫిక్ ప్రాంతం అభివృద్ధి' 
ఈయూ లో గత మూడు సంవత్సరాలుగా ఫ్రాన్స్  అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా గుర్తింపు పొందింది. ఫ్రాన్స్ దేశంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి.  ఫ్రాన్స్‌లో పెట్టుబడులు పెడుతున్న ఆసియా దేశాలలో  భారతదేశం అగ్రగామిగా  ఉంది. భారతదేశం  పెట్టుబడుల విలువ తక్కువగా, కొన్ని రంగాల్లో మాత్రమే పరిమితం అయ్యింది.  . బ్రెగ్జిట్ అనంతర EU నేపథ్యంలో భారతీయ కంపెనీలు తమ యూరోపియన్ వ్యూహాన్ని సమీక్షిస్తున్నాయి. భారతదేశ పెట్టుబడులకు ఫ్రాన్స్ తదుపరి పెద్ద గమ్యస్థానంగా మారే అవకాశం ఉంది.  భారతీయ కంపెనీలు ఫ్రాన్స్‌లో ఎలా ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చనే అంశంపై సదస్సులో చర్చించారు. సదస్సుకు  ఎఫ్‌ఐఈఓ అధ్యక్షుడు ఎ శక్తివేల్ అధ్యక్షత వహించారు.
సీఈఓ లతో  రౌండ్ టేబుల్ సమావేశం:
భారతదేశం, ఫ్రాన్స్ దేశాలకు చెందిన దాదాపు సంస్థల సీఈఓ లు పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో   కేంద్ర వాణిజ్యం  పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం , ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్  ప్రసంగించారు.  ఫ్రాన్స్ విదేశీ వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాలు, విదేశాల్లో నివసిస్తున్న ఫ్రెంచ్ పౌరుల  సంక్షేమ శాఖ మంత్రి ఒలివర్ బెచ్ట్   ప్రవాస భారతీయులు,వ్యవసాయం, పర్యాటకం, రక్షణ, తయారీ, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఏరోస్పేస్ వంటి రంగం సీఈఓ లు  రౌండ్‌టేబుల్‌లో పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లోని భారత రాయబారి శ్రీ జావేద్ అష్రఫ్,  సీఐఐ ఉపాధ్యక్షుడు, ఐటీసీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రో సంజీవ్ పూరి, సీఐఐ డీజీ  శ్రీ చంద్రజిత్ బెనర్జీ, అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమావేశంలో ప్రసంగించారు. 

***


(Release ID: 1915956) Visitor Counter : 157