శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
విజ్ఞాన్ ప్రగతి & సైన్స్ రిపోర్టర్ పత్రికల ఆరోగ్య ప్రత్యేక సంచికలను విడుదల చేసిన డిజి, ఐసిఎంఆర్, డైరెక్టర్ సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్
Posted On:
12 APR 2023 11:56AM by PIB Hyderabad
తమ ఆరోగ్యం గురించి అనేకమంది ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, ఇటీవల సంభవించిన కోవిడ్ మహమ్మారి సామాన్య ప్రజలు ఆరోగ్యం, శాస్త్రీయ పరిశోధనకు సంబంధించిన సూక్ష్మాలను తెలుసుకునేందుకు ప్రేరణనిచ్చింది. శాస్త్రీయ సమాచారం అన్నది ప్రవర్తనలో మార్పులు తీసుకువస్తుంది, ఈ దిశలో ప్రముఖ శాస్త్రీయ పత్రికలైన విజ్ఞాన్ ప్రగతి, సైన్స్ రిపోర్టర్ ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్నాయి. సిఎస్ఐఆర్ ప్రముఖ సైన్స్ పత్రికలైన విజ్ఞాన్ ప్రగతి & సైన్స్ రిపోర్టర్ ప్రత్యేక ఆరోగ్య సంచికలను 10 ఏప్రిల్ 2023న ఐసిఎంఆర్ కేంద్ర కార్యాలయంలో విడుదల చేస్తున్న సందర్భంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ (డిహెచ్ఆర్) కార్యదర్శి డాక్టర్. రాజీవ్ బాల్ పేర్కొన్నారు.
విజ్ఞాన్ ప్రగతి పత్రిక ప్రత్యేక ఆరోగ్య సంచిక విడుదల
సిఎస్ఐఆర్ కు చెందిన ఈ రెండు పత్రికలు ఏడు దశాబ్దాల వారసత్వాన్ని కలిగి ఉండటమే కాక, ప్రామాణికమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా సమాజంలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే గొప్ప బాధ్యతను నిర్వహిస్తున్నాయని సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజనా అగర్వాల్ అన్నారు.
ఈ ప్రత్యేక సంచికలు మానసిక ఆరోగ్యం, సాంక్రమిక వ్యాధులు, జీవన శైలి వ్యాధులు, ప్రసూతి & నోటి ఆరోగ్యం, బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య దుష్పరిణామాలకు సంబంధించిన అనేక ఆరోగ్య సంబంధిత వ్యాసాలు కలిగి ఉన్నాయి. ఈ సంచికలలో వ్యాసకర్తలు ఐసిఎంఆర్ లాబ్స్ లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలవడమే కాక, వారంతా కూడా 16 నవంబర్ 2022న సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ లో జరిగిన వర్క్‌షాప్‌లో కలిసిన ఫలితంగా సాకారమైన పరిణామం.
సైన్స్ రిపోర్టర్ పత్రిక ఆరోగ్య సంచిక విడుదల
సైన్స్ రిపోర్టర్ ఎడిటర్ శ్రీ హసన జావేద్ ఖాన్, విజ్ఞాన పత్రిక ఎడిటర్ డాక్టర్ మనీష్ మోహన్ గోరె కూడా ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డిహెచ్ఆర్ సీనియర్ ఆర్థిక సలహాదారు డాక్టర్ రాజీవ్, గోరఖ్‌పూర్ ఆర్ఎంఆర్‌సి డైరెక్టర్ డాక్టర్ రజనీ కాంత్, ఐఎసిఎంఆర్ విభాగాల అధిపతులు; ఐసిఎంఆర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్నా డోగ్రా , సిఎస్ఐఆర్- ఎన్ఐఎస్‌సిపిఆర్ సీనియర్ శాస్త్రవేత్త సొనాలీ నగర్ & విజ్ఞాన ప్రగతి అసిస్టెంట్ సుభద కపిల్; సైన్స్ జర్నలిస్టు శ్రీ పల్లవ్ బాగ్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1915953)
Visitor Counter : 176