ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్-19 తాజా సమాచారం


దేశవ్యాప్తంగా ముగిసిన రెండు రోజుల కోవిడ్-19 మాక్ డ్రిల్

- 724 జిల్లాల్లోని 33,685 ఆరోగ్య సదుపాయాలలో మాక్ డ్రిల్

Posted On: 11 APR 2023 6:55PM by PIB Hyderabad

కోవిడ్-19కి వ్యతిరేకంగా భారత దేశం చేస్తున్న పోరాటంలో భాగంగా కేంద్రం ముందస్తు సన్నద్ధత కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా 724 జిల్లాలలో రెండు రోజుల కోవిడ్-19 మాక్ డ్రిల్ ను విజయవంతంగా నిర్వహించింది.  అనేక రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 28 మార్చి, 2023న రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక లేఖను జారీ చేసింది. దీని ప్రకారం 2023 ఏప్రిల్ 10 మరియు 11 తేదీల్లో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్‌కు అంకితమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని లేఖ రాసింది. పరికరాలు, విధానం మానవశక్తి పరంగా వారి సంసిద్ధత స్థాయిని అంచనా వేయండి లక్షంగా దీనిని నిర్వహించింది. దీనికి కొనసాగింపుగా 7 ఏప్రిల్ 2023న కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రాష్ట్ర ఆరోగ్య మంత్రులతో సమావేశమయ్యారు. అన్ని ఆరోగ్య సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటూ మాక్ డ్రిల్‌లను నిర్వహించాలని కోరారు. జిల్లా పరిపాలన మరియు ప్రజారోగ్య అధికారులతో సంసిద్ధతను సమీక్షించాలని అభ్యర్థించారు. 28,050 ప్రభుత్వ వైద్య సంస్థలు 5,635 ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాలతో సహా మొత్తం 33,685 ఆరోగ్య కేంద్రాల్లో 2023 ఏప్రిల్ 10 మరియు 11 తేదీల్లో మాక్ డ్రిల్‌ను నిర్వహించారు.  ప్రభుత్వ సౌకర్యాలలో ప్రభుత్వం చేవైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా/సి విల్ ఆసుపత్రులు, సీహెచ్ఎస్ లు అలాగే హెచ్డబ్ల్యుసీలు మరియు పీహెచ్సీలు, ప్రైవేట్ ఆరోగ్య సౌకర్యాలలో ప్రైవేట్ వైద్య కళాశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులు మరియు ఇతర ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆక్సిజన్ పడకలు, ఐసోలేషన్ పడకలు, వెంటిలేటర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, ఎల్ఎంఓ, ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లు, ఆక్సిజన్ సిలిండర్‌లతో పాటు మందులు మరియు పీపీఈ కిట్‌లతో సహా కీలకమైన వైద్య మౌలిక సదుపాయాలు మరియు వనరులు అంచనా వేయబడ్డాయి. ఈ మాక్ డ్రిల్ సమయంలో వైద్య సిబ్బంది కోవిడ్-19 నిర్వహణపై దృష్టి సారించారు. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ తయారీలో రాష్ట్ర మరియు జిల్లా నిఘా విభాగాలతో ఆన్‌లైన్ శిక్షణ కూడా 2023 ఏప్రిల్ 4, 5 మరియు 6 తేదీల్లో నిర్వహించబడింది. ఈ శిక్షణలు రాష్ట్ర మరియు జిల్లా నిఘా విభాగాలు పోషించాల్సిన పాత్ర, అప్‌డేట్ చేయాల్సిన డేటా ఫీల్డ్‌లు, కవర్ చేయాల్సిన సౌకర్యాల రకాలు మరియు కోవిడ్-19 ఇండియా పోర్టల్‌లో డేటాను అందించడంలో ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటున్న రాష్ట్రాలు/UTల కోసం హెల్ప్‌లైన్ వివరాలపై దృష్టి సారించాయి. సన్నాహక శిక్షణలో మొత్తం 1544 మంది పాల్గొన్నారు.

***


(Release ID: 1915845) Visitor Counter : 170


Read this release in: English , Urdu , Marathi , Hindi