విద్యుత్తు మంత్రిత్వ శాఖ

2021-22 రాష్ట్రాల ఇంధన సామర్ధ్య సూచికలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, రాజస్థాన్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ముందంజ


జాతీయ వాతావరణ అవసరాలను తీర్చడానికి నియమితకాల ఆవర్తన క్రమంలో రాష్ట్రాల ఇంధన సామర్ధ్య ప్రగతి ఫలితాల

మదింపు అవసరం: కేంద్ర విద్యుత్ & కొత్త అక్షయ ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్. కె. సింగ్

Posted On: 10 APR 2023 5:43PM by PIB Hyderabad

       2021-22 సంవత్సరానికి రాష్ట్రాల ఇంధన సామర్ధ్య సూచిక నివేదిక (ఎస్ ఈ ఈ ఐ)ను కేంద్ర విద్యుత్ & కొత్త అక్షయ ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్. కె. సింగ్ సోమవారం విడుదల చేశారు. న్యూఢిల్లీలో  జరిగిన రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సమీక్ష, ప్రణాళిక మరియు పర్యవేక్షణ సమావేశంలో నివేదికను విడుదల చేశారు.  ఈ సూచికను ఇంధన సామర్ధ్య ఆర్ధిక వ్యవస్థ కోసం ఏర్పడిన కూటమి (ఏఇఇఇ) సహకారంతో విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధమైన సంస్థ  ఇంధన సామర్ధ్య బ్యూరో (బిఇఇ) అభివృద్ధి చేసింది.  రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఇంధన సామర్ధ్యం అమలులో 2020-21 మరియు 2021-22 ఆర్ధిక సంవత్సరాలలో  సాధించిన వార్షిక ప్రగతిని వీరు అంచనా వేస్తారు.  జాతీయ ప్రాధాన్యతల ప్రాతిపదికగా ఎస్ ఈ ఈ ఐ  50 సూచికల ఆధారముగా  తాజా చట్రాన్ని రూపొందించింది.   రాష్ట్ర స్థాయిలో ఇంధన సామర్ధ్య యత్నాల ప్రభావం, వాటి ఫలితాల మదింపు కోసం ఆయా కార్యక్రమాలకు సంబంధించి నిశ్చిత సూచికలను ఈ  ఏడాది చేర్చడం జరిగింది.  

 



       2021-22 సంవత్సరానికి ఎస్ ఈ ఈ ఐ చేసిన అంచనాలో ఐదు రాష్ట్రాలు  ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, రాజస్థాన్ మరియు తెలంగాణ ముందంజ వేసి అగ్రభాగాన  (60కన్నా ఎక్కువ పాయింట్లు),  నాలుగు రాష్ట్రాలు అస్సాం, హర్యానా, మహారాష్ట్ర మరియు పంజాబ్ (50-60 పాయింట్లతో) సాధించిన రాష్ట్రాలలో చేరాయి.   అంతేకాక కర్నాటక,  ఆంధ్రప్రదేశ్, అస్సాం మరియు చండీగఢ్ రాష్ట్రాలు ఆయా రాష్ట్ర బృందాలలో అగ్రశ్రేణి రాష్ట్రాలుగా నిలిచాయి.   గత సూచికతో పోల్చినప్పుడు ఈ సూచికలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చాల ఎక్కువ అభివృద్ధి సాధించాయి.  

       సూచికను విడుదల చేసిన మంత్రి శ్రీ ఆర్. కె. సింగ్ మాట్లాడుతూ " మనం తక్కు కర్బనం ఉన్న ఆర్ధిక వ్యవస్థ వైపు పరివర్తన చెందే క్రమంలో అందరినీ కలుపుకొనిపోయే ఇంధన పరివర్తన చేపట్టేందుకు నిర్వహణీయ అభివృద్ధి జరిగేలా నిశ్చయపఱౘుకోవాలి. జాతీయ  వాతావరణ అవసరాలను తీర్చడానికి నియమితకాల ఆవర్తన క్రమంలో రాష్ట్రాల ఇంధన సామర్ధ్య ప్రగతి ఫలితాల మదింపు చేయడం  అవసరం" అని  అన్నారు.  

 

 



      ఉద్గారాలను తగ్గించే లక్ష్యాల సాధనకు ఇండియా కట్టుబడి ఉందని బిఇఇ  డైరెక్టర్ జనరల్ తెలిపారు.  2070 నాటికి నెట్ జీరో ఆర్ధిక వ్యవస్థ ఏర్పాటు దిశగా పరివర్తన చెందేందుకు కేంద్రం , రాష్ట్రాల మధ్య తోడ్పాటు అవసరమని,  ఇందుకోసం రాష్ట్రం ,  స్థానిక స్థాయిలలో  ఇంధన సామర్ధ్య విధానాలు, కార్యక్రమాలను ఉత్సుకతతో ముందుకు తీసుకెళ్లాలని, వాటి జాడను  ఎస్ ఈ ఈ ఐ గమనిస్తూ ఉంటుందని అన్నారు.  
      ఎస్ ఈ ఈ ఐ   డేటా సేకరణతో పాటు ఇంధన సామర్ధ్యాన్ని పెంచే యోచనలను అభివృద్ధి చేస్తుంది.  రాష్ట్రాల మధ్య సహకారాన్ని సుసాధ్యం చేస్తుంది.  కర్బనాన్ని తగ్గించే ప్రయత్నాలకు ,  పాలనీయ భవిష్యత్ సాధనకు ప్రేరణ కలుగజేస్తుంది.

      రాష్ట్రాలు తమ లక్ష్యాల సాధనలో  ఏ మేరకు ప్రగతి సాధించాయో కనిపెట్టి చూసేందుకు సూచికను రూపొందించారు.   సహనీయ అభివృద్ధి లక్ష్యాల సాధనకు ,   ఉద్గారాలను తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు వీలుగా ఇంధన సామర్ధ్యం పెంపునకు రాష్ట్రాలకు తోడ్పడేందుకు ఈ దిగువ సిఫార్సులు చేశారు.  

       కేంద్రీకృత రంగాలలో ఇంధన సామర్ధ్యం పెంపునకు ఆర్ధిక సహాయం అందించడం.   రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఇంధన సామర్ధ్యం అమలు చేయడం కోసం అవసరాలు  మరియు సవాళ్లకు అనుగుణంగా సంస్థాగత సామర్ధ్యం అభివృద్ధి చేయడం.  రాష్ట్రాలలో భారీ ఎత్తున ఇంధన సామర్ధ్యం అమలు చేయడం కోసం ఆర్ధిక సంస్థలు, ఇంధన సేవా కంపెనీలు, ఇంధన రంగంలోని ప్రొఫెషనల్స్ మధ్య సహకారం పెంపొందించడం.  అన్ని రంగాలలో ఇంధన సామర్ధ్యం పెంపును పర్యవేక్షించడంతో పాటు ఇంధన దత్తాంశాల నివేదనను జనజీవన స్రవంతిలో చేర్చడం.

బిఇఇ  గురించి
      ఇంధన పరిరక్షణ చట్టం, 2001లో పొందుపరచిన నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వం 1 మార్చి 2002న ఇంధన సామర్ధ్య బ్యూరోను ఏర్పాటు చేసింది. భారత ఆర్ధిక వ్యవస్థ ఇంధన తీవ్రత తగ్గించాలన్న ప్రాథమిక లక్ష్యంతో  స్వీయ నియంత్రణ మరియు మార్కెట్ సూత్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ విధానాలు, వ్యూహాల రూపకల్పనకు బిఇఇ తోడ్పడుతుంది.  ఇంధన పరిరక్షణ
చట్టం, 2001  ద్వారా తనకు సంక్రమించిన బాధ్యతలను నిర్వహిస్తూ ఇందుకు సంబంధించిన వినియోగదారులు, సంస్థలు మరియు ఇతర సంస్థలతో బిఇఇ సమన్వయంతో వ్యవహరిస్తుంది.   ఇంధన పరిరక్షణ చట్టం  నియంత్రణ మరియు ప్రోత్సాహక విధులను సమకూరుస్తుంది.  

***



(Release ID: 1915619) Visitor Counter : 195