వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

11 ఏప్రిల్ 2023న ‘ఇండియా-ఫ్రాన్స్ బిజినెస్ సమ్మిట్’ నిర్వహణ


- భారతదేశం-ఫ్రాన్స్ మేటి స్నేహపు 25 సంవత్సరాల జ్ఞాపకార్థం ఈ సదస్సు ఏర్పాటు

Posted On: 09 APR 2023 1:43PM by PIB Hyderabad

భారతదేశం-ఫ్రాన్స్ స్నేహపు 25 సంవత్సరాల జ్ఞాపకార్థం 11 ఏప్రిల్ 2023న ‘ఇండియా-ఫ్రాన్స్ బిజినెస్ సమ్మిట్’ నిర్వహించనున్నారు.  కేంద్ర వాణిజ్యం & పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌తో పాటు ఫ్రాన్స్ దేశం తరఫున ఆ దేశ విదేశీ వాణిజ్యం శాఖ, పెట్టుబడుల ఆకర్షణ శాఖ ఫ్రెంచ్ జాతీయుల ప్రతినిధి విభాగం మంత్రి శ్రీ ఒలివర్ బెచ్ట్ ఈ కార్యక్రమంలో సహ-అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.  హరిత భవిష్యత్తును నిర్మించడం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, రక్షణ సహకారం మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతాలలో సహకారంతో సహా వివిధ అంశాలపై సదస్సు దృష్టి సారిస్తుంది. మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌ వివిధ రంగాలకు చెందిన ఫ్రెంచ్ వ్యాపార ప్రముఖులతో కూడా సమావేశం కానున్నారు మరియు CEO ల రౌండ్ టేబుల్‌కు హాజరవుతారు. మంత్రి 2023 ఏప్రిల్ 11 నుండి 13 వరకు ఫ్రాన్స్, ఇటలీ దేశాలలో అధికారిక పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో మంత్రితో పాటు భారతీయ అగ్రశ్రేణి సీఈఓల బృందం కూడా పాల్గొననున్నది. ఫ్రాన్స్ మంత్రి శ్రీ ఒలివర్ బెచ్ట్‌తో పాటు మంత్రి భారతదేశ సాంస్కృతిక వారసత్వం మరియు మృదు శక్తిని ప్రదర్శించే కార్యక్రమంలో పాల్గొంటారు. ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి 600+ మంది ప్రముఖులు, ఫ్రాన్స్‌లోని భారతీయ వ్యాపార ప్రవాసులు మరియు ఫ్రెంచ్ వ్యాపార సంఘం సభ్యులు పాల్గొంటారని భావిస్తున్నారు. మంత్రి పారిస్‌లోని భారతీయ కమ్యూనిటీ సభ్యులతో కూడా సమావేశం కానున్నారు. పర్యటనలో భాగంగా మంత్రి ఆ తరువాత ఇటలీలోని రోమ్‌ నగరానికివెళతారు, అక్కడ ఫ్రాన్స్ ఉప ప్రధాన మంత్రి ఆంటోనియో తజానీ మరియు విదేశాంగ వ్యవహారాల మంత్రి & అంతర్జాతీయ సహకార మంత్రి, ప్రభుత్వం మరియు పరిశ్రమల ప్రముఖుల నెట్‌వర్కింగ్ బృందంతో విందులో పాల్గొన్నారు. మంత్రి  ద్వైపాక్షిక సమావేశాల కోసం టాప్ ఇటాలియన్ కంపెనీల సీఈఓలను కలవనున్నారు, ఆ తర్వాత సీఈఓల సంభాషణ బిజినెస్ సెషన్‌లో 35 మంది సీఈఓలు పాల్గొనే అవకాశం ఉంది. ఆ తర్వాత మంత్రి  మేడిన్ ఇటలీ మరియు ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి అడాల్ఫో ఉర్సో  భారతీయ CEOలతో కూడా సంభాషిస్తారు. ఈ పర్యటన ఐరోపా ప్రాంతంలో భారతదేశం యొక్క కీలక వ్యాపార భాగస్వాములతో ద్వైపాక్షిక సంబంధాలకు మరింత ఊపునిస్తుందని భావిస్తున్నారు.

***



(Release ID: 1915383) Visitor Counter : 125