ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏప్రిల్ 10 &11వ తేదీల‌లో త్రిపుర‌లో ప‌ర్య‌టించ‌నున్న కేంద్ర డిఒఎన్ఇఆర్‌, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిష‌న్ రెడ్డి

Posted On: 09 APR 2023 5:03PM by PIB Hyderabad

కేంద్ర డిఒఎన్ఇఆర్‌, ప‌ర్యాటం & సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిష‌న్ రెడ్డి ఏప్రిల్ 10 &11, 2023న త్రిపుర‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ముఖ్య‌మంత్రి శ్రీ మ‌నిక్ షా, డిఒఎన్ఇ ఆర్ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌, ఎన్ఇసి, రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి చెందిన ఇత‌ర సీనియ‌ర్ అధికారుల‌తో క‌లిసి ఇప్ప‌టివ‌ర‌కూ సాధించిన అభివృద్ధిని మంత్రి స‌మీక్షించ‌నున్నారు. 
అనంత‌రం శ్రీ రెడ్డి అగ‌ర్తాలా- అఖౌరా రైలు ప్రాజెక్టు ప్రాంత త‌నిఖీని నిర్వ‌హించ‌నున్నారు. త‌న రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మాంత్రి  నార్త్ ఈస్ట్ సెక్యూరిటీ ఎడ్యుకేష‌న్ & గ్లోబ‌ల్ ఎంప్లాయ‌బిలిటీ (ఈశాన్య ప్రాంత భ‌ద్ర‌త శిక్ష‌ణ‌/  విద్య & ప్ర‌పంచ‌స్థాయిలో ఉపాధి) అన్న స‌ద‌స్సులో ముఖ్య అతిథిగా పాల్గొన‌నున్నారు. ఆయ‌న ఏషియ‌న్ క‌న్ఫ్లూయెన్స్ థింక్‌ట్యాంక్ నిర్వ‌హించే నార్త్ ఈస్ట్ ఇండియా, బాంగ్లాదేశ్ అండ్ బే ఆఫ్ బెంగాల్ ఇన్ ఇండో- ప‌సిఫిక్ బిల్డింగ్ ఆన్ పార్ట్న‌ర్‌షిప్: ద‌ఇ వే ఫార్వార్డ్ ( ఇండో-ప‌సిఫిక్ ప్రాంత భాగ‌స్వామ్యంలో నిర్మాణ‌మ‌వుతున్న ఈశాన్య భార‌త్‌, బాంగ్లాదేశ్‌, బంగాళాఖాతంః భ‌విష్య‌త్ మార్గం) అన్న సంవాదంలో పాల్గొని త‌న అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేయ‌నున్నారు. 

***
 


(Release ID: 1915117) Visitor Counter : 155