ఆయుష్
ఎఐఐఏ ను సందర్శించి సంపూర్ణ సమగ్ర వైద్య విధానం వివరాలు అధ్యయనం చేసిన సి-20 వర్కింగ్ గ్రూప్
ఆయుర్వేద వైద్య విధానంలో పరిశోధన, విద్య అంశాలపై కలిసి పనిచేయడానికి ఎఐఐఏ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న అమృత విశ్వ విద్యాపీఠం
Posted On:
09 APR 2023 4:52PM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఎఐఐఏ)ని సంపూర్ణ సమగ్ర వైద్య వ్యవస్థపై ఏర్పాటైన సి-20 వర్కింగ్ గ్రూప్ 2023 ఏప్రిల్ 8న సందర్శించింది. దాదాపు 400 మంది ప్రతినిధులు సంస్థను సందర్శించి సంపూర్ణ సమగ్ర వైద్య విధానం వివరాలు అధ్యయనం చేశారు.
జీ-20 వేదికలో భాగంగా ఏర్పాటైన 8 అధికార గ్రూపులతో సి-20 ఒకటి. దీనిలో 19 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, అమెరికా దేశాలు సి-20 సభ్య దేశాలుగా వ్యవహరిస్తున్నాయి.జీ-20 లో సభ్యులుగా ఉన్న ప్రపంచ దేశాల నాయకులకు ప్రజల ఆకాంక్షలు తెలియజేయాలన్న లక్ష్యంతో ఒక పౌర సమాజ వేదికను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో జీ-20 అధికార గ్రూపులలో ఒకటిగా సి-20 ని భారతదేశం ఏర్పాటు చేసింది.
ఎఐఐఏ ని సందర్శించిన ప్రతినిధి బృందంలో ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ-జనరల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిసోర్స్ మేనేజ్‌మెంట్, సస్టైనబిలిటీ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ యునైటెడ్ నేషన్స్ ఎంటిటీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ది ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్) డాక్టర్ అనితా భాటియా, మాతా అమృతానందమయి మఠం ఉపాధ్యక్షుడు, అమృత విశ్వ విద్యాపీఠం (అమృత విశ్వవిద్యాలయం)అధ్యక్షుడు స్వామి అమృత స్వరూపానంద పూరి, ఆయుష్ మంత్రిత్వ శాఖ సలహాదారు (ఏ.) డాక్టర్ మనోజ్ నేసరి, , అర్జెంటీనా మాజీ ఆరోగ్య మంత్రి, సెంటర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ హెల్త్ పాలసీ డైరెక్టర్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లినికల్ ఎఫెక్టివ్‌నెస్ అండ్ హెల్త్ పాలసీ (IECS) వ్యవస్థాపకుడు, డైరెక్టర్ జనరల్ డాక్టర్ అడాల్ఫో రూబిన్‌స్టెయిన్ తదితరులు ఉన్నారు. ప్రతినిధి బృందం సభ్యులకు సంస్థ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం సంపూర్ణ, సమగ్ర వైద్య విధానం ఎలా అమలు చేయాలి అన్న అంశాన్ని ప్రతినిధులకు వివరించారు.
ఆయుర్వేద వైద్య విధానంలో పరిశోధన, విద్య అంశాలపై కలిసి పనిచేయడానికి ఎఐఐఏ తో కుదిరిన అవగాహన ఒప్పందంపై అమృత విశ్వ విద్యాపీఠం సంతకం చేసింది. అమృత విశ్వ విద్యాపీఠం వివిధ అంశాలపై విద్య, పరిశోధన కార్యక్రమాలు చేపడుతూ అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయాన్ని ఇకపై అమృత గా వ్యవహరిస్తారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఎఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా నేసరి ,అమృత విశ్వ విద్యాపీఠం కొచ్చి క్యాంపస్‌లో మెడికల్ సైన్సెస్ కి చెందిన ప్రేమ్ కుమార్ వాసుదేవన్ నాయర్ ఒప్పందంపై సంతకం చేశారు. యూరోపియన్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద, బెర్న్‌స్టెయిన్, జర్మనీ,వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ, ఆస్ట్రేలియా, గ్రాజ్ మెడికల్ యూనివర్సిటీ, ఆస్ట్రియా, కాలేజ్ ఆఫ్ మెడికల్, యూకే లండన్, స్కూల్ ఆఫ్ హైజీన్ ట్రాపికల్ మెడిసిన్, యూకే, ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ రియో డి జనీరో, బ్రెజిల్ తో ఇప్పటికే ఎఐఐఏ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ (డా) తనూజ నేశ్రీ మాట్లాడుతూ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎఐఐఏ పనిచేస్తున్నదని వివరించారు. సంస్థని సి-20 ప్రతినిధులు సందర్శించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయుర్వేదంలో ఏకీకరణ , సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ విధానాలను సంస్థ అమలు చేస్తుందన్నారు.. అందరికీ ఆరోగ్యం , సంపూర్ణ శ్రేయస్సు అందించడానికి ప్రధాన వైద్య విధానంలో ఆయుష్ ఆరోగ్య సంరక్షణ భాగంగా ఉండాలన్నారు.
' ఆయుర్వేద శాస్త్రం ప్రపంచానికి భారతదేశం అందించిన బహుమతి. ఆయుర్వేద శాస్త్రం భారతదేశ జ్ఞానం, అభ్యాసం, సంప్రదాయం మరియు సంస్కృతి. సి-20 ద్వారా, ఆధునిక వైద్యంతో ఆయుర్వేదాన్ని ఏకీకృతం చేయడం ద్వారా సంపూర్ణ వైద్య విధానం రూపకల్పనకు కృషి జరుగుతోంది. వినూత్న విధానం అయిన ఆయుర్వేదం వాళ్ళ ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలుగుతుంది ” అని ఐక్యరాజ్య సమితి అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, ఉమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీమతి అనితా భాటియా అన్నారు.
AIIA మిల్లెట్ క్యాలెండర్‌ను శ్రీమతి అనితా భాటియా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామీజీ శ్రీ అమృత స్వరూపానంద పూరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతినిధులకు పాట్యా ఆహారం అందించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
***
(Release ID: 1915109)
Visitor Counter : 237