సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
భారతదేశంలో మొదటిసారిగా ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రధానమంత్రి మోదీ దృష్టిసారించారు: డాక్టర్ జితేంద్ర సింగ్
యువత తమ శక్తి మరియు సామర్థ్యాన్ని అమృత్ కాల్ కోసం ఉపయోగించాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
కోవిడ్‌పై పోరాడటానికి భారతదేశం రెండు డిఎన్‌ఏ వ్యాక్సిన్‌లు & ఒక నాసల్ వ్యాక్సిన్‌ని తయారు చేసింది. దీనిని 130 దేశాలకు అందించింది: డా.జితేంద్ర సింగ్
భారతీయ పరిశోధన, భారతీయ డేటా మరియు భారతీయ సమస్యలకు భారతీయ పరిష్కారం అవసరం: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
08 APR 2023 2:17PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్&టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..గత డెబ్బై ఏళ్లుగా దేశంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోని "ప్రివెంటివ్ హెల్త్ కేర్"పై తొలిసారిగా దృష్టిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో కేవలం రెండేళ్ల వ్యవధిలో భారత్ రెండు డీఎన్‌ఏ వ్యాక్సిన్‌లు, ఒక నాసికా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలిగిందని చెప్పారు.
అమృత్‌కాల్‌కు రూపశిల్పులుగా యువత పాత్ర మరియు బాధ్యత ఉందని మంత్రి ఉద్ఘాటించారు. యువత శక్తి మరియు సామర్థ్యాన్ని దేశ నిర్మాణంలో ఉపయోగించాల్నారు. జిఎంసి జమ్మూలో ముఖ్య అతిథిగా థైరోకాన్‌లో పాల్గొన్న ప్రతినిధులను ఉద్దేశించి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయం చెప్పారు.
జమ్ము డాక్టర్స్ ఫౌండేషన్ ఎండోక్రినాలజీ విభాగం, జమ్మూ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో కలిసి థైరోకాన్ సిఎంఈ నిర్వహించడంపై జమ్మూ ప్రిన్సిపల్ జీఎంసీ డాక్టర్ శశి సుదన్ శర్మ కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. "థైరోకాన్‌లో నవీకరణలు" థైరాయిడ్ రుగ్మతలతో బాధపడుతున్న రోగుల క్లినికల్ నిర్వహణలో పురోగతిని ప్రతిబింబిస్తాయి. భారతదేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్‌లో థైరాయిడ్ రుగ్మతలు సాధారణ ఆరోగ్య సమస్య అని ఆయన పేర్కొన్నారు. 2019లో జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ క్లినికల్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, జమ్మూ మరియు కాశ్మీర్‌లో థైరాయిడ్ రుగ్మతల ప్రాబల్యం దాదాపు 12.3% ఉంది. హైపోథైరాయిడిజం అత్యంత సాధారణ రకం అని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలియజేశారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా రెండు సమస్యలను ఫ్లాగ్ చేశారు. అందులో మొదటిది పెరుగుతున్న రోగనిర్ధారణ సామర్థ్యాల కారణంగా క్లినికల్ మెడిసిన్ బోధన నుండి మారడం. ఇప్పుడు పరీక్ష నివేదికలను పొందిన తర్వాత క్లినికల్ వివరాలు ఊహించబడ్డాయి. రెండవ అంశం భారతీయ పరిశోధన, భారతీయ డేటా మరియు భారతీయ సమస్యలకు భారతీయ పరిష్కారం అవసరం అని తెలిపారు. భారతీయ డేటాను ఉపయోగించి పశ్చిమ దేశాలను కూడా ప్రస్తావించారు. భారతదేశ వైద్య ఆరోగ్య సమస్యలకు స్వదేశీ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి విభిన్నమైన భారతీయ డేటాను ఉపయోగించడం ఈ కాలపు అవసరమన్నారు.
వైద్య సోదరుల మధ్య ఏకీకరణ ప్రాముఖ్యతను డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు. ప్రభుత్వ వైద్య కళాశాల జమ్మూ ప్రాంత మొత్తం ఆరోగ్య స్థితిని మెరుగుపరచడంలో ఎల్లప్పుడూ ముందుంది అని చెప్పారు. ఈ ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌లు అత్యాధునిక థైరాయిడ్ వ్యాధుల పరిశోధన మరియు చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేయాలన్నారు. అందుకు వనరులకు కొరత లేదని కొత్త భారతదేశం ఆరోగ్య సంరక్షణలో అవకాశాల యుగం అని చెప్పారు. గంజాయి ఆధారిత నొప్పి నివారణ మందులు మరియు ఎండీఆర్-టీబీ వంటి ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టుల కోసం ఐఐఎం జమ్మూ జీఎంసీ జమ్మూతో సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన కృషి ఫలితంగా ఎయిమ్స్ జమ్మూ సాంకేతిక అభివృద్ధి కోసం ఐఐటీ జమ్మూ మరియు మార్కెటింగ్ కోసం ఐఐఎం జమ్మూతో ఎంఓయూ కుదుర్చుకుంది.
ఈ కార్యక్రమంలో గౌరవ అతిథి లెఫ్టినెంట్ జనరల్ (డా.) నరేంద్ర కొత్వాల్, డైరెక్టర్ & కమాండెంట్ ఏఎఫ్‌ఎంసీ, పూణే; డా. శశి సుధన్ శర్మ ప్రిన్సిపాల్ & డీన్ జీఎంసీ, జమ్మూ; ఆర్గనైజింగ్ చైర్మన్ డా. రత్తన్ పి కుడ్యార్ రిటైర్డ్, హెచ్‌ఓడి మెడిసిన్& డైరెక్టర్ ప్రిన్సిపల్ ఏఎస్‌సిఓఎంఎస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.సుమన్ కొత్వాల్ అసిస్టెంట్.ప్రొఫెసర్ ఎండోక్రినాలజీ జీఎంసీ, జమ్మూ పాల్గొన్నారు.
<><><><><>
(Release ID: 1914876)
Visitor Counter : 180