వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2023 దరఖాస్తులకు ఆహ్వానం : గడువు తేదీ 31.05.2023
प्रविष्टि तिथि:
07 APR 2023 12:52PM by PIB Hyderabad
వినూత్న ఉత్పత్తులను రూపొందించి, నిర్మాణాత్మక స్థాయిలో సామాజిక ప్రభావాన్ని ప్రదర్శిస్తున్న అత్యుత్తమ అంకుర సంస్థలను, అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించేవారినీ గుర్తించి, సత్కరించడానికి పరిశ్రమల అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖ (డి.పి.ఐ.ఐ.టి) 2020 సంవత్సరంలో జాతీయ అంకుర సంస్థల అవార్డులు (ఎన్.ఎస్.ఏ) ప్రదానం చేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు, మూడు సార్లు అంకుర సంస్థలతో పాటు భారతీయ అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం లో కీలక పాత్ర పోషించిన వారిని గుర్తించి సత్కరించడం జరిగింది. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2023 కోసం దరఖాస్తులు 2023 ఏప్రిల్, 1వ తేదీ నుండి ఆన్-లైన్ లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తులు సమర్పించడానికి గడువు తేదీ 2023 మే, 31.
విభిన్నమైన అంకుర సంస్థలను గుర్తించి, వాటిని సత్కరించే వారసత్వాన్ని కొనసాగించడానికి, డి.పి.ఐ.ఐ.టి. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ నాల్గవ ఎడిషన్ను ప్రారంభించింది. జాతీయ స్టార్టప్ అవార్డ్స్-2023 దేశవ్యాప్తంగా ఆవిష్కరణలను జరుపుకుంటుంది, 'విజన్ ఇండియా@2047' కి అనుగుణంగా, భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడంపై దృష్టి సారిస్తోంది, కీలకమైన ఇతివృత్తాలతో అమృత్ కాల్ స్ఫూర్తి తో ముందుకు సాగుతోంది.
ఈ ఎడిషన్ లో, 20 విభాగాలలో అంకురసంస్థలకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. వీటిని ప్రస్తుత భారతీయ, ప్రపంచ ఆర్థిక దృష్టి కేంద్రాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయించడం జరుగుతుంది. ఈ విభాగాలు అంతరిక్షం, రిటైల్, విఘాతం కలిగించే సాంకేతికతల్లోని ఆవిష్కరణల నుండి మరింత ప్రభావ-కేంద్రీకృత వర్గాల వరకు ఉంటాయి.
ప్రతి విభాగంలో విజేతగా నిలిచిన ఒక్కొక్క అంకుర సంస్థకు 10 లక్షల భారతీయ రూపాయల చొప్పున నగదు బహుమతిని డి.పి.ఐ.ఐ.టి. అందజేస్తుంది. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2023 విజేతలతో పాటు, ఫైనలిస్ట్‌లుగా నిలిచినా వారికి ఇన్వెస్టర్ & గవర్నమెంట్ కనెక్ట్, మెంటార్‌షిప్, ఇంటర్నేషనల్ మార్కెట్ యాక్సెస్, కార్పొరేట్, యునికార్న్ కనెక్ట్ తో సహా అనేక సదుపాయాలూ, ప్రయోజనాలు కల్పించడం జరుగుతుంది.
నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ (ఎన్.ఎస్.ఏ) మూడు ఎడిషన్లలో దేశవ్యాప్తంగా అంకుర సంస్థలతోపాటు, అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించే వారి నుండి అనూహ్య స్పందన లభించింది. గత మూడేళ్ళలో 6,400 కు పైగా అంకురసంస్థలు ఎన్.ఎస్.ఏ. లో ఉత్సాహంగా పాల్గొనగా, 450 కి పైగా సంస్థలు విజేతలుగా నిలిచాయి.
మరిన్ని వివరాల కోసం
Homepage
వెబ్ సైట్ ని సందర్శించండి
*****
(रिलीज़ आईडी: 1914761)
आगंतुक पटल : 244