శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి శ్రీ మోడీ నేతృత్వంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బయోటెక్ స్టార్టప్‌లతో ప్రపంచ ప్రధాన జీవ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉద్భవిస్తోందన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
07 APR 2023 1:33PM by PIB Hyderabad
వేగంగా పెరుగుతున్న జీవసాంకేతిక విజ్ఞాన స్టార్టప్‌లతో ప్రపంచంలోనే అతిపెద్ద జీవ ఆర్థిక వ్యవస్థ (బయో ఎకానమీ)గా భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉద్భవిస్తోందని, కేంద్ర పిఎంఒ, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జి), శాస్త్ర & సాంకేతిక శాఖ మంత్రి, ఎర్త్ సైన్సెస్ మంత్రి, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
శుక్రవారం నాడు ఇక్కడ ఇండియా హాబిటాట్ సెంటర్‌లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ లెడ్ ఎంటర్‌ప్రైజెస్ (ఎబిఎల్ఇ) 20వ వార్షికోత్సవ వేడుకల ప్రారంభోపన్యాసం చేస్తూ, మిషన్ కోవిడ్ సురక్ష కింద రెండేళ్ళ కాలంలో భారత్ నాలుగు దేశీయ వాక్సీన్లను అభివృద్ధి చేయడమే కాక, కొవాక్సిన్ ఉత్పత్తిని పెంచి, మన దేశం మహమ్మారులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు భవిష్యత్ వాక్సిన్ల అభివృద్ధి సాఫీగా సాగేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించినట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ప్రపంచ ఆవిష్కరణ సూచీ 2022లో భారత్ 81వ స్థానం నుంచి 40వ స్థానానికి వెళ్లిందని మంత్రి తెలిపారు. మనం సమీప భవిష్యత్‌లో అగ్ర 25ను చేరేందుకు, భారత్ @100 నాటికి అగ్ర ఐదుకు చేరుకునేందుకు ఆకాంక్షించాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశపు నిత్యనూత నినాదాలు అయిన జైజవాన్, జైకిసాన్, జై విజ్ఞాన్‌లకు జై అనుసంధాన్‌ను కూడా జోడించడం ద్వారా ఆవిష్కరణలకు భారీ ఊపును ఇచ్చారని పేర్కొన్నారు.
భారత్‌కు మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ ఉండటమే కాక అత్యంత వేగంగా పెరుగుతున్న యూనీకార్న్‌లకు కేంద్రంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. నూతన భావనలకు, సాంకేతికలకు మూలమైనందుకు స్టార్టప్‌లు ఎంతో ముఖ్యమైనవని ఆయన అన్నారు. భారత్ స్టార్టప్‌లు, పరిశోధన & అభివృద్ధి ఫలితాలు ప్రపంచ ప్రమాణాలను నిశ్చితం చేయడమే కాక ప్రపంచానికి సమానంగా ఉందని అన్నారు. నేడు భారత్‌లో స్టార్టప్‌లు లేదా ఇతరత్రంగా మహిళలు సహా యువ ప్రతిభ ఆవిష్కరణ నేతృత్వంలోని ఆర్థిక వ్యవస్థ కోసం విజయ గాథను లిఖిస్తున్నాయి.
ఇంతకు ముందు రాజకీయ వ్యవస్థలో, వారి విధాన చొరవలలో ఆవిష్కరణలకు తోడ్పడే వాతావరణం లేదని, కానీ ప్రస్తుతం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని రాకీయ వ్యవస్థ ఇటువంటి వాతావరణాన్ని అందిస్తున్నందన భారత్ ముందుకు ఉరకలు వేస్తోందని మంత్రి అన్నారు.
భారతీయ పరిశ్రమ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, సాంకేతిక ఉద్యమాన్ని విప్లవాత్మకం చేసి, ముందుకు తీసుకురాగల సామర్ధ్యాన్ని కలిగి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. దేశంలోని యువ ఆవిష్కర్తలను ఆకర్షించేందుకు సమగ్ర పరిశోధన, స్టార్టప్‌లు, విద్యావేత్తలు, పరిశ్రమ ఇప్పుడు కేవలం ఒక ఎంపిక కాదని, ఒక అత్యవసరమని ఆయన అన్నారు.
సాంకేతికతలను అభివృద్ధి చేయడం, ఉత్పత్తులు, ప్రపంచ సమాజానికి సహాయపడే పరిష్కారాలను అందించేందుకు ఎబిఎల్ఇ తన 20వ వ్యవస్థాపక సంవత్సరంలో గణనీయమైన సహకారాన్ని ఇవ్వగలదని మంత్రి అన్నారు.
తన 20వ వార్షికోత్సవం సందర్భంగా ఎనేబ్లర్స్ ఆఫ్ ఇండియన్ బయోటెక్ అన్న ప్రచురణను తీసుకువచ్చినందుకు ఎబిఎల్ఇను ఆయన ప్రశంసించారు.

భారత్ @100 - భారతదేశ శతాబ్ది ఉత్సవం నాటికి 1 ట్రిలియన్ డాలర్ల బయో ఎకానమీని, 2030 నాటికి 300 బిలియన్ డాలర్ల బయో ఎకానమీని సాధించాలన్న భారత్ లక్ష్యానికి తోడ్పడవలసిందిగా పరిశ్రమలకు డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపిచ్చారు.
***
(Release ID: 1914754)