ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిముద్రాయోజన (పిఎంఎంవై) కిందప్రారంభంనుంచిరూ.22.95 లక్షలకోట్లవిలువగల 40.25 కోట్లరుణాల మంజూరు


అట్టడుగుస్థాయిలో భారీసంఖ్యలోఉపాధికల్పనకుముద్రాసహాయకారిఅయింది;

భారతఆర్ధిక వ్యవస్థకుఉత్తేజంకల్పించేశక్తిగా, గేమ్చేంజర్గానిలిచింది : ఆర్ధిక మంత్రిశ్రీమతినిర్మలాసీతారామన్

దేశంలోని మైక్రోసంస్థలకు ఎలాంటిఅవాంతరాలులేకుండా పిఎంఎంవైద్వారాహామీరహితరుణాలు తేలిగ్గాఅందుబాటులోకివచ్చాయి :

ఆర్ధిక శాఖసహాయమంత్రిడాక్టర్భగవత్ కరద్

Posted On: 08 APR 2023 7:45AM by PIB Hyderabad

కార్పొరేటేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పరిశ్రమల విభాగంలో ఆదాయం ఆర్జించే కార్యకలాపాలు సాగిస్తున్న చిన్న, సూక్ష్మ ఎంటర్  ప్రెన్యూర్లకు రూ.10 కోట్ల వరకు హామీ రహిత సూక్ష్మ రుణాలు అందించడం లక్ష్యంగా 8 ఏప్రిల్ 2015న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రధానమంత్రి ముద్రా యోజన (పిఎంఎంవై)  పథకం ప్రారంభించారు. పిఎంఎంవై కింద రుణాలను సభ్యరుణ వితరణ సంస్థలు –బ్యాంకులు, నాన్- బ్యాంకింగ్  ఫైనాన్షియల్  కంపెనీలు (ఎన్  బిఎఫ్  సి), మైక్రో ఫైనాన్స్  సంస్థలు (ఎంఎఫ్ఐ), ఇతర ఫైనాన్షియల్  ఇంటర్మీడియేటరీలు అందిస్తాయి.

పిఎంఎంవై విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్  వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్  మాట్లడుతూ ‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజనరీ నాయకత్వంలో ప్రారంభమైన ఈ స్కీమ్   దేశంలోని మైక్రో-సంస్థలకు ఎలాంటి అవరోధాలు లేకుండా హామీ రహిత రుణాలు అందించడమే కాకుండా ఎంతో మంది యువ ఎంటర్  ప్రెన్యూర్లు వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు సహాయంగా నిలిచింది’’ అన్నారు.

పిఎంఎంవై డేటాను ప్రస్తావిస్తూ ‘‘స్కీమ్  ప్రారంభమైన నాటి నుంచి 24.03.2023 నాటికి 40.82 కోట్ల రుణ ఖాతాలకు రూ.23.2 లక్షల కోట్ల రుణాలు అందించారు. మంజూరైన రుణాల్లో 68% రుణాలుమహిళా ఎంటర్ ప్రెన్యూర్లకు, 51%రుణాలుఎస్  సి/ఎస్  టి, ఒబిసి వర్గాలకు అందించారు. చిన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు తేలిగ్గా రుణాలు అందుబాటులో ఉన్నాయని ఇది నిరూపిస్తోంది. ఫలితంగా ఇన్నోవేషన్ కు ప్రోత్సాహం లభించడమే కాకుండా తలసరి ఆదాయం సైతం స్థిరంగా పెరిగింది’’ అన్నారు.

ఎంఎస్ఎంఇల ద్వారా ఏర్పడిన సాధించిన దేశీయ వృద్ధి గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘‘ఎంఎస్ఎంఇల్లో ఏర్పడిన వృద్ధి ‘మేక్  ఇన్  ఇండియా’ కార్యక్రమానికి ఎంతో వాటా అందించింది. దేశీయ ఎంఎస్ఎంఇల పటిష్ఠత వల్ల దేశీయ ఉత్పత్తి పెరిగి దేశీయ, ఎగుమతి మార్కెట్లు రెండింటికీ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. పిఎంఎంవై అట్టడుగు స్థాయిలో భారీ గా ఉద్యోగాలు అందుబాటులోకి రావడానికి కూడా దోహదపడడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ ఉత్తేజానికి ప్రధానంగా ఊతం అందించింది’’ అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి (ఎంఓఎస్) డాక్టర్  భగవత్  కిషన్  రావు కరద్  మాట్లాడుతూ ‘‘దేశంలో మైక్రో సంస్థలకు అంతరాయాలు లేకుండా హామీ రహిత రుణాలు అందించడం  పిఎంఎంవై స్కీమ్  ప్రధాన లక్ష్యం. ఇది ఇంతవరకు రుణాలు అందుబాటులో లేని,  అరకొరగా మాత్రమే అందుబాటులో ఉన్న సమాజాన్ని సంస్థాగత రుణాల పరిధిలోకి తెచ్చింది.  ముద్రాను ప్రోత్సహించే ప్రభుత్వ విధానం వల్ల కోట్లాది ఎంఎస్ఎంఇలు వ్యవస్థాత్మక ఆర్థిక రంగం పరిధిలోకి వచ్చాయి. వారు వడ్డీవ్యాపారులు భారీ వడ్డీలకు అందించే రుణాల బారిన పడకుండా సహాయపడింది’’ అన్నారు.

ప్రధానమంత్రి ముద్రా యోజన (పిఎంఎంవై) మూలస్తంభాలపై ఫైనాన్షియల్  ఇంక్లూజన్  సాధించి 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్కీమ్  ప్రధాన లక్షణాలు, విజయాల గురించి పరిశీలిద్దాం :

ఫైనాన్షియల్  ఇంక్లూజన్  కార్యక్రమం మూడు మూలస్తంభాలపై అమలు జరుగుతోంది.

  1. బ్యాంకింగ్ సదుపాయం లేని వారికి బ్యాంకింగ్
  2. సెక్యూరిటీ  లేని వారికి భద్రత
  3. నిధులు అందని వారికి నిధుల కల్పన

టెక్నాలజీని ఉపయోగించుకుని, బహుముఖీన భాగస్వాముల సహకార వైఖరితో పైన పేర్కొన్న మూడు లక్ష్యాలు సాధించడం జరుగుతోంది. ఇంతవరకు బ్యాంకింగ్  సేవలు అరకొరగా మాత్రమే అందుబాటులో ఉన్న వారికి బ్యాంకింగ్  సదుపాయం అందుబాటులోకి తెచ్చారు.

పిఎంఎంవై  మూడు మూలస్తంభాల్లో ఒకటైన –నిధులు అందుబాటులో లేని వారికి నిధుల కల్పన ఫైనాన్షియల్  ఇంక్లూజన్ లో ప్రతిబింబిస్తోంది. చిన్న ఎంటర్  ప్రెన్యూర్లకు రుణాలు అందుబాటులో ఉంచే లక్ష్యంతో అమలు జరుగుతోంది.

లక్షణాలు

  • వ్యాపార పరిణతి ఆధారంగా వివిధ దశల్లో నిధుల అవసరాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ రుణాలను మూడు విభాగాలుగా వర్గీకరించారు.  శిశు (రూ.50,000/- వరకు), కిశోర్  (రూ.50,000/- నుంచి రూ.5 లక్షల వరకు), తరుణ్ (రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు).
  • తయారీ, ట్రేడింగ్, సేవా రంగాలతో పాటు పౌల్ర్టీ, డెయిరీ, తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ విభాగాల్లో ఆదాయం ఆర్జించే కార్యకలాపాలు నిర్వహించే సంస్థలకు సంస్థలకు పిఎంఎంవై కింద రుణాలను కాలపరిమితి రుణాలుగాను, వర్కింగ్  క్యాపిటల్  రుణాలుగాను అందిస్తారు.
  • ఆర్  బిఐ మార్గదర్శకాల పరిధిలో ఈ రుణాలపై వడ్డీరేటును రుణం ఇచ్చే సంస్థలు నిర్ణయిస్తాయి. వర్కింగ్  క్యాపిటల్  సదుపాయానికి వస్తే రుణగ్రహీత ఎంత కాలం సొమ్ము ఉంచుకుంటే అంత కాలానికి మాత్రమే వడ్డీ వసూలు చేస్తారు. 

17.03.2023 నాటికి ప్రధానమంత్రి ముద్రా యోజన (పిఎంఎంవై) సాధించిన విజయాలు

  • పథకం ప్రారంభించిన నాటి నుంచి రూ.22.95 లక్షల కోట్ల విలువ గల 40.25 కోట్ల రుణాలు మంజూరు చేశారు. మంజూరు చేసిన రుణాల్లో 21% కొత్త ఎంటర్  ప్రెన్యూర్లకు ఇచ్చినవే. 
  • మొత్తం రుణాల్లో సుమారుగా 69%రుణాలు మహిళా ఎంటర్ ప్రెన్యూర్లకు, 51%రుణాలు ఎస్ సి/ఎస్  టి/ఒబిసి వర్గాలకు అందచేశారు.

విభాగాల వారీగా రుణ విభజన

విభాగం

మంజూరు చేసిన రుణాలు (%)

మంజూరు చేసిన మొత్తం (%)

శిశు

83%

40%

కిశోర్

15%

36%

తరుణ్

2%

24%

మొత్తం

100%

100%

 

కోవిడ్  కారణంగా 2021-22 ఆర్థిక సంవత్సరం మినహాయించి స్కీమ్  ప్రారంభమైన నాటి నుంచి సాధించిన లక్ష్యాలు. సంవత్సరాలవారీగా మంజూరైన రుణాలు

సంవత్సరం

మంజూరు చేసిన రుణాలు (కోట్లలో)

మంజూరు చేసిన మొత్తం (రూ.లక్షల కోట్లలో)

2015-16

3.49

1.37

216-17

3.97

1.80

2017-18

4.81

2.54

2018-19

5.98

3.22

2019-20

6.22

3.37

2020-21

5.07

3.22

2021-22

5.37

3.39

2022-23 (17.03.2023 నాటికి) *

5.31

4.03

మొత్తం

40.25

22.95

*అంచనా

ఇతర ఉపయోగకర సమాచారం

పిఎంఎంవై కింద అందించిన శిశు రుణాలు సకాలంలో చెల్లించిన అర్హులైన రుణగ్రహీతలకు 2% వడ్డీ రాయితీ 12 నెలల పాటు పొడిగించారు.

  • ‘సమాజంలో అట్టడుగున ఉన్న రుణగ్రహీతల’ కోసం అసాధారణ పరిస్థితుల్లో ప్రత్యేక స్పందనగా 14.05.2020 నాడు ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆత్మ నిర్భర్  భారత్  అభియాన్  కింద రుణ వ్యయాలు తగ్గాయి.
  • 31.08.2021 వరకు ఈ స్కీమ్  అందుబాటులో ఉంటుంది.
  • ఎంఎల్ఐలను రుణ సబ్సిడీ కింద సిడ్బి రూ.636.89 కోట్లు రుణగ్రహీతల ఖాతాల్లోకి జమ చేసింది.

మైక్రో యూనిట్లకు రుణ గ్యారంటీ నిధి (సిజిఎఫ్ఎంయు)

  • పూర్తిగా ప్రభుత్వ యాజమాన్య కంపెనీ నేషనల్  క్రెడిట్  గ్యారంటీ  ట్రస్టీ కంపెనీ (ఎన్  సిజిటిసి) నిర్వహణలో ఈ దిగువ హామీల కోసం 2016 జనవరిలో మైక్రో యూనిట్ల రుణ గ్యారంటీ నిధిని ఏర్పాటు చేశారు.
  1. బ్యాంకులు, నాన్  బ్యాంకింగ్  ఆర్థిక సంస్థలు (ఎన్  బిఎఫ్  సి), మైక్రో ఫైనాన్స్  సంస్థలు (ఎంఎఫ్ఐ), ఇతర ఆర్థిక రంగ ఇంటర్మీడియేటరీలు ప్రధానమంత్రి ముద్రా యోజన (పిఎంఎంవై) కింద అర్హత గల మైక్రో యూనిట్లకు మంజూరు చేసిన రూ.10 లక్షల వరకు రుణాలు
  2. ప్రధానమంత్రి జన్  ధన్  యోజన (పిఎంజెడివై) ఖాతాల కింద ఓవర్  డ్రాఫ్ట్  గా మంజూరు చేసిన రూ.5,000 (2018 సెప్టెంబరులో రూ.10,000కి పెంపు) 
  3. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యన స్వయం సహాయక వర్గాలకు అందించిన రుణాలు (01.04.2020 నుంచి)

 

***


(Release ID: 1914752) Visitor Counter : 408