ప్రధాన మంత్రి కార్యాలయం

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై 5వ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన - ప్రధానమంత్రి


"విపత్తు పట్ల మన ప్రతిస్పందన ఒంటరిగా కాకుండా సమైక్యంగా కావాలి"

“మౌలిక సదుపాయాలు అంటే అవి కేవలం రాబడి గురించి మాత్రమే కాకుండా అందరికీ చేరుకోవడం, స్థితిస్థాపకత గురించి కూడా"

"మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులో ఉండాలి"

"ఒక విపత్తు నుంచి మరొక విపత్తు మధ్య కాలంలో స్థితిస్థాపకత నిర్మించబడింది"

"స్థానిక అంతర్ దృష్టి తో కూడిన ఆధునిక సాంకేతిక స్థితిస్థాపకతకు మూలం"

"విపత్తు నిరోధక కార్యక్రమాల విజయానికి ఆర్థిక వనరుల నిబద్ధత కీలకం"

Posted On: 04 APR 2023 10:39AM by PIB Hyderabad

విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలు - సి.డి.ఆర్.ఐ. పై 5వ అంతర్జాతీయ సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. 

ఒక దగ్గరి సంబంధం ఉన్న ఈ ప్రపంచంలో, విపత్తుల ప్రభావం కేవలం స్థానికంగా ఉండదనే ప్రపంచ భావన 

నుండి సి.డి.ఆర్.ఐ. ఉద్భవించిందని ప్రధాన మంత్రి అన్నారు.  అందువల్ల, "మన ప్రతిస్పందన ఒంటరిగా కాకుండా సమైక్యంగా ఉండాలి." అని ఆయన సూచించారు.   కేవలం కొన్ని సంవత్సరాల్లోనే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న 40 కి పైగా పెద్ద, చిన్న అనే తేడాలు లేకుండా సి.డి.ఆర్.ఐ. లో భాగమయ్యాయని, ఆయన పేర్కొన్నారు.  ప్రభుత్వాలతో పాటు, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు రంగ సంస్థలు, విషయ నిపుణులు కూడా ఇందులో పాలుపంచుకోవడం ప్రోత్సాహకరంగా ఉంది, అని కూడా ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

‘తట్టుకునే, సమ్మిళిత మౌలిక సదుపాయాలను అందించడం’ అనే ఈ ఏడాది ఇతివృత్తం నేపథ్యంలో, విపత్తు 

తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం చర్చకు సంబంధించిన కొన్ని ప్రాధాన్యతలను ప్రధానమంత్రి సందర్భంగా వివరించారు.  “మౌలిక సదుపాయాలు కేవలం రాబడికి సంబంధించినవి మాత్రమే కాకుండా వాటిని చేరుకోవడం, స్థితిస్థాపకత కూడా.  అదేవిధంగా, ఈ మౌలిక సదుపాయాలు ఎవరినీ వదిలిపెట్టకుండా, సంక్షోభ సమయంలో కూడా ప్రజలందరికీ సేవ చేయాలి." అని ప్రధానమంత్రి సూచించారు.   రవాణా మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమో సామాజిక, డిజిటల్ మౌలిక సదుపాయాలు కూడా అంతే 

ముఖ్యమైనవి కాబట్టి మౌలిక సదుపాయాలపై సమగ్ర దృక్పథం అవసరమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

సత్వర ఉపశమనంతో పాటు, సాధారణ స్థితిని త్వరగా పునరుద్ధరించడంపై కూడా దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.   "ఒక విపత్తు నుండి మరొక విపత్తు మధ్య కాలంలో స్థితిస్థాపకత నిర్మించబడింది.  గత విపత్తులను అధ్యయనం చేయడం, వాటి నుండి పాఠాలు నేర్చుకోవడమే సరైన మార్గం” అని ఆయన తెలియజేశారు. 

విపత్తులను తట్టుకోగల మౌలిక సదుపాయాలను నిర్మించడంలో స్థానిక పరిజ్ఞానాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలని శ్రీ మోదీ నొక్కి చెప్పారు.  స్థానిక దృక్పథంతో కూడిన ఆధునిక సాంకేతికత స్థితిస్థాపకత కు మూలం.  అదేవిధంగా, ఈ విషయాలు చక్కగా నమోదు చేసి, ఈ స్థానిక పరిజ్ఞానాన్ని ప్రపంచ అత్యుత్తమ అభ్యాసం గా మారవచ్చునని, ప్రధానమంత్రి సూచించారు. 

సి.డి.ఆర్.ఐ. కి చెందిన కొన్ని కార్యక్రమాల యొక్క సమగ్ర ఉద్దేశాన్ని ప్రధానమంత్రి వివరించారు.   "ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ రెసిలెంట్ ఐలాండ్ స్టేట్స్" చేపట్టిన కార్యక్రమాలు లేదా ఐ.ఆర్.ఐ.ఎస్. ద్వారా ప్రయోజనం పొందిన ద్వీపాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు.  గత ఏడాది ప్రకటించిన "ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రెసిలెన్స్ యాక్సిలరేటర్ ఫండ్‌" గురించి ఆయన వివరించారు.  50 మిలియన్ డాలర్లతో ఏర్పాటైన ఈ నిధి అభివృద్ధి చెందుతున్న దేశాలలో అపారమైన కుతూహలాన్ని రేకెత్తించింది.  "కార్యక్రమాల విజయానికి ఆర్థిక వనరుల నిబద్ధత చాలా కీలకం" అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

భారత దేశ జి-20 ప్రెసిడెన్సీ గురించి ప్రధానమంత్రి పేర్కొంటూ, సి.డి.ఆర్.ఐ. ని అనేక కార్యనిర్వాహక బృందాల్లో చేర్చినట్లు చెప్పారు.   'మీరు ఇక్కడ అన్వేషించే పరిష్కారాలు ప్రపంచ విధాన రూపకల్పనలో అత్యున్నత స్థాయిలో విధాన రూపకర్తల దృష్టిని ఆకర్షిస్తాయి' అని ఆయన చెప్పారు. 

టర్కియే, సిరియాలో సంభవించిన భూకంపాల వంటి ఇటీవలి విపత్తుల స్థాయి, తీవ్రత గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, సి.డి.ఆర్.ఐ. పనితీరును, దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. 

 

*****



(Release ID: 1914096) Visitor Counter : 192