ఆర్థిక మంత్రిత్వ శాఖ

2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు (తాత్కాలికం) కేంద్ర బడ్జెట్ అంచనాల కంటే 2.41 లక్షల కోట్ల రూపాయలు అంటే 16.97 శాతం అధికంగా వసూలయ్యాయి


2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్ను వసూళ్లు (తాత్కాలికం) సవరించిన అంచనాల కంటే 0.69 శాతం అధికంగా వసూలయ్యాయి


2022-23 ఆర్థిక సంవత్సరానికి స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (తాత్కాలికం) 19.68 లక్షల కోట్ల రూపాయలు అంటే 20.33 శాతం వృద్ధిని నమోదు చేశాయి


2022-23 ఆర్థిక సంవత్సరానికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు (తాత్కాలికం) 16.61 లక్షల కోట్ల రూపాయలు అంటే 17.63 శాతం వృద్ధిని నమోదు చేశాయి


2022-23 ఆర్థిక సంవత్సరంలో 3,07,352 కోట్ల రూపాయల మేర పన్ను తిరిగి చెల్లించడం జరిగింది

Posted On: 03 APR 2023 7:02PM by PIB Hyderabad

2022- 23 ఆర్థిక సంవత్సరం తాత్కాలిక గణాంకాల ప్రకారం ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు 16.61 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.  ఇది మునుపటి ఆర్థిక సంవత్సరం 2021-22 కంటే 14.12 లక్షల కోట్ల రూపాయలు అంటే 17.63 శాతం పెరుగుదలను సూచిస్తోంది.

2022- 23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ లో ప్రత్యక్ష పన్నుల ఆదాయానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలను 14.20 లక్షల కోట్ల రూపాయలుగా నిర్ణయించగా, వీటిని 16.50 లక్షల కోట్ల రూపాయలుగా సవరించడం జరిగింది.   తాత్కాలిక ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు (తిరిగి చెల్లించిన పన్నుల అనంతరం) బడ్జెట్ అంచనాల కంటే 16.97 శాతం అలాగే సవరించిన అంచనాల కంటే 0.69 శాతం అధికంగా నమోదయ్యాయి.

2022-23 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు (తాత్కాలికం) (తిరిగి చెల్లించవలసిన పన్నుల సర్దుబాటు చేయడానికి ముందు) 19.68 లక్షల కోట్ల రూపాయలుగా నమోదయ్యింది.  అంటే ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 16.36 లక్షల కోట్ల రూపాయల స్థూల సేకరణ కంటే 20.33 శాతం అధికం.

2022- 23 ఆర్థిక సంవత్సరంలో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు (తాత్కాలికం) 10,04,118 కోట్ల రూపాయలుగా నమోదయ్యింది. కాగా, ఇది అంతకు ముందు సంవత్సరం స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు కంటే 8,58,849 కోట్ల రూపాయలు అంటే 16.91 శాతం అధికం.

2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు (ఎస్.టి.టి. తో సహా) (తాత్కాలికం) 9,60,764 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. అంటే ఇది గత ఆర్థిక  సంవత్సరం స్థూల వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు (ఎస్.టి.టి. తో సహా) 7,73,389 కోట్ల రూపాయల కంటే 24.23 శాతం అధికం.

గతఆర్థిక  సంవత్సరం 2021-22 లో జారీ చేసిన 2,23,658 కోట్ల రూపాయల మేర తిరిగి చెల్లించిన పన్నుల కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 లో 37.42 శాతం అధికంగా, 3,07,352 కోట్ల రూపాయల మేర పన్నులు తిరిగి చెల్లించడం జరిగింది.

 

 

*****

 



(Release ID: 1913572) Visitor Counter : 348