మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేరళలోని తిరువనంతపురంలో 2023 ఏప్రిల్ 4 నుంచి 6 వరకు మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండో జీ20 సాధికార సమావేశం


'మహిళా సాధికారత: సమానత్వం, ఆర్థిక వ్యవస్థ రెండింటికీ ఒక విజయం' అనేది ఈ సమావేశం ఇతివృత్తం

ఏప్రిల్ 4న జరిగే సైడ్ ఈవెంట్స్ లో ముఖ్యమైన అంశాల పై ప్యానెల్ గోష్టులు

మహిళా సాధికారత ద్వారా ఆర్థిక ప్రగతి సాధన పై 25×25 బ్రిస్బేన్ లక్ష్యాల దిశగాఏప్రిల్ 5న ప్రారంభ ప్లీనరీ సెషన్

ఏప్రిల్ 5న జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకానున్న మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయమంత్రి డాక్టర్ ముంజ్పారా మహేంద్రభాయ్

'స్కూలు-టు-వర్క్' మార్పులు, కెరీర్ అభివృద్ధి అవకాశాలపై ప్యానెల్ డిస్కషన్లు ; కేర్ ఎకానమీకి మద్దతు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలపై  పెట్టుబడి పెట్టడం; మహిళా సాధికారత కోసం కార్పొరేట్సంస్కృతిని పెంపొందించడం వంటి అంశాలపై సైడ్ ఈవెంట్ లు

ఏప్రిల్ 6న ముగింపు ప్లీనరీ సమావేశం లో కీలక ఫలితాలను గుర్తించడం, ఏకాభిప్రాయఅంశాలపై జీ20 సాధికారత ప్రాధన్యాలలో కార్యాచరణ ఖరారు పై దృష్టి .

వివిధ సెషన్ లలో థీమాటిక్ డిస్కషన్ లు, సంప్రదింపులు G20 సాధికారత ప్రకటనలో ప్రతిబింబిస్తాయి;G20 నాయకులకు సిఫార్సులుగాఅందించబడతాయి.

Posted On: 03 APR 2023 9:28AM by PIB Hyderabad

మహిళా సాధికారత అనేది కేవలం సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది ఆర్థిక అనివార్యం కూడా. ప్రపంచ జీడీపీలో 80 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో 60 శాతం జీ20 సభ్యదేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జీ-20 భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వృద్ధిని, శ్రేయస్సును కాపాడటంలో వ్యూహాత్మక పాత్ర పోషిస్తుంది. మహిళా సాధికారత, లింగ సమానత్వాన్ని అందించడానికి కూడా ఇది భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

 

జీ20 అలయన్స్ ఫర్ ది ఎంపవర్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఆఫ్ ఉమెన్స్ ఎకనామిక్ రిప్రజెంటేషన్ (ఇ ఎం పి ఒ డబ్ల్యు ఇ ఆర్)

అనేది ప్రైవేట్ రంగంలో మహిళా నాయకత్వం , సాధికారతను వేగవంతం చేయడమే లక్ష్యంగా కలిగిన జి 20 వ్యాపార నాయకులు , ప్రభుత్వాల కూటమి. భారత్ ప్రెసిడెన్సీ కింద జీ20 ఎంపవర్ సమ్మిట్ 2023 మహిళల నేతృత్వంలోని భారత అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఫిబ్రవరి 11,12 తేదీల్లో ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జీ20 ఎంపవర్ ఆవిర్భావ సమావేశం జరిగింది. కేరళలోని తిరువనంతపురంలో 2023 ఏప్రిల్ 4 నుంచి 6 వరకు రెండో ఎంపవర్ సమావేశం జరగనుంది.

 

'మహిళా సాధికారత: ఈక్విటీ అండ్ ఎకానమీకి విన్-విన్' అనేది జీ20 ఎంపవర్ రెండవ సమావేశం ఇతివృత్తం.

జి 20 అధ్యక్ష హోదా తో భారత్ సమ్మిళిత, సమానమైన, ప్రతిష్టాత్మక, నిర్ణయాత్మక, కార్యాచరణ తో మహిళా ఆర్థిక సాధికారత దిశగా పరివర్తనాత్మక మార్పులను ముందుకు తీసుకు వెళ్లడంపై దృష్టి పెట్టింది. మునుపెన్నడూ లేని విధంగా నేడు ప్రపంచ దేశాలు మహిళా సాధికారతపై దృష్టి సారించాయి. భారతదేశ జి 20 అధ్యక్ష పదవి క్లిష్టమైన సమయంలో వచ్చింది. అయినా ఇది సరైన సమయం కూడా. తిరువనంతపురంలో జరిగే 2వ ఎంపవర్ సమావేశం లో మహిళా సాధికారతను వేగవంతం చేయడానికి గతం లో అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన దేశాల హయాంలో జీ20 ఎంపవర్ అలయన్స్ కింద చేసిన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేయనున్నారు.

 

ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పారా మహేంద్రభాయ్ హాజరై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సమావేశానికి జీ20 ఎంపవర్ 2023 చైర్ పర్సన్ డాక్టర్ సంగీతారెడ్డి హాజరై ప్రసంగించనున్నారు. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇందేవర్ పాండే, జి 20 సెక్రటేరియట్, భారత ప్రభుత్వ, కేరళ ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

 

25×25 బ్రిస్బేన్ లక్ష్యాల దిశగా మహిళా సాధికారత ద్వారా ఆర్థిక ప్రగతి సాధించడం అనే అంశంపై ప్రారంభ ప్లీనరీ సెషన్ తో జీ20 సాధికారత 2వ సమావేశం ప్రారంభం కానుంది.

అనంతరం ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయి. మెంటరింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా మహిళా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను ముందుకు తీసుకెళ్లడం, మార్కెట్ యాక్సెస్ , ఫైనాన్సింగ్; వ్యాపారాలను విస్తరించడంలో స్టెమ్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్నోవేషన్ పాత్ర; క్షేత్రస్థాయితో సహా అన్ని స్థాయిల్లో నాయకత్వాన్ని ఎనేబుల్ చేయడం; మహిళా సాధికారత కోసం మానసిక, నివారణ ఆరోగ్యంతో సహా సంపూర్ణ శ్రేయస్సు; నాణ్యమైన విద్య లభ్యత, డిజిటల్ ఫ్లూయెన్స్ ,జీవితకాల అభ్యసన కోసం పెట్టుబడులను పెంచడం; శాస్త్రీయ, సంప్రదాయేతర రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఈ చర్చల్లో ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు.

 

ఏప్రిల్ 4న జరిగే సైడ్ ఈవెంట్స్ లో 'స్కూల్ టు వర్క్' పరివర్తనలు, కెరీర్ డెవలప్ మెంట్ అవకాశాలు, కేర్ ఎకానమీకి మద్దతు ఇవ్వడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెట్టుబడి పెట్టడం; మహిళా సాధికారత కోసం కార్పొరేట్ సంస్కృతిని నావిగేట్ చేయడం వంటి చాలా ముఖ్యమైన అంశాలను ప్యానెల్ డిస్కషన్ల రూపంలో

చర్చిస్తారు.

 

టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, కాయిర్ సాగు, ఉత్పత్తి, మహిళల నేతృత్వంలోని ఎఫ్ పి ఒ లు , మహిళలు తయారు చేసిన స్వదేశీ బొమ్మలు, చేనేత, హస్తకళలు, ఆయుర్వేద, వెల్నెస్ ఉత్పత్తులను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తారు. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించే డిజిటల్ ఫీచర్లు ఈ ఎగ్జిబిషన్ లో ఉంటాయి.

 

సెషన్లతో పాటు, కేరళ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ విలేజ్ (కెఎసివి) సందర్శన కు కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రతినిధులకు భారతీయ కళలు ,హస్తకళలను పరిచయం చేస్తుంది . వారికి హస్తకళల నిపుణులతో సంభాషించే అవకాశాన్ని అందిస్తుంది.

 

సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే వారు భారతదేశ సాంప్రదాయ పద్ధతులు, చక్కటి వంటకాలను ఆస్వాదించేలా స్థానిక వంటకాలు , చిరుధాన్యాల ఆధారిత ఆహారాన్ని కూడా వడ్డిస్తారు.

 

ముగింపు ప్లీనరీ సమావేశం లో కీలక ఫలితాలను గుర్తించడం, ఏకాభిప్రాయ అంశాలపై జీ20 సాధికారత ప్రాధన్యాలలో కార్యాచరణ ఖరారు పై దృష్టి పెడతారు.

 

జి 20 ఎంపవర్ ముగింపు ప్లీనరీ ప్రారంభ సమావేశం మహిళల నేతృత్వంలోని అభివృద్ధిపై దాని సమిష్టి నమ్మకాన్ని పునరుద్ఘాటించింది. కూటమి తక్షణ, దృఢమైన, సాహసోపేతమైన , పరివర్తన చర్యల ద్వారా లింగ అంతరాన్ని (వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2022) పూడ్చడానికి 132 సంవత్సరాలు పడుతుందనే భావనను చెల్లుబాటు కానివ్వ రాదని ప్రతిజ్ఞ చేసింది.

 

వివిధ సమావేశాల్లో జరిగే థీమాటిక్ చర్చలు, సంభాషణలు జీ20 ఎంపవర్ ప్రకటనలో ప్రతిబింబిస్తాయి. జీ20 నేతలకు సిఫార్సులుగా వీటిని అందచేస్తారు. అన్ని అంతర్జాతీయ సమావేశాల్లో ప్రధాన ఈవెంట్లు,, సైడ్ ఈవెంట్ల ఫలితాల నుంచి వెలువడే ఏకాభిప్రాయ అంశాలు జీ20 ఎంపవర్ 2023 ప్రకటనలో భాగంగా ఉంటాయి.

 

మెరుగైన రేపటిని సాధించే ప్రయత్నాల్లో మహిళలను కేంద్రబిందువుగా ఉంచుతూనే, ఆర్థిక శ్రేయస్సు దిశగా తదుపరి దశ అభివృద్ధి ఎజెండాను నిర్దేశించడంలో జి 20 ఎంపవర్ కీలక పాత్ర పోషిస్తుందని భారతదేశం విశ్వసిస్తోంది.

 

"మీరు మీ భవిష్యత్తును సరిగ్గా పొందాలనుకుంటే, మీరు భవిష్యత్తుకు సిద్ధంగా ఉండాలనుకుంటే, మహిళలు చర్చకు కేంద్రంగా ఉన్నారని నిర్ధారించుకోండి . మీ నిర్ణయంలో మహిళలు కేంద్రబిందువుగా ఉన్నారని నిర్ధారించుకోండి". - శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, గౌరవ మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి, ఎంపవర్ ఇన్సెప్షన్ మీటింగ్, ఆగ్రా.

 

***



(Release ID: 1913341) Visitor Counter : 236