కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
అస్సాంలోని గౌహతిలో ‘జీ20 ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ గ్రూపు’ రెండో jసమావేశం
प्रविष्टि तिथि:
02 APR 2023 6:17PM by PIB Hyderabad
భారతదేశపు అధ్యక్షతన జరగనున్న ‘జీ20 ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ గ్రూపు’ (ఈడబ్ల్యుజీ) సమావేశం ఏప్రిల్ 03 నుండి 05 వరకు అస్సాం నగరంలోని గౌహతి నగరంలో జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి జీ20 నుంచి సభ్య దేశాల నుంచి 19 దేశాల వారు, 7 అతిథి దేశాలు మరియు 5 అంతర్జాతీయ సంస్థల నుండి 72 మంది ప్రతినిధులు సమావేశం కానున్నారు. అందరికీ బలమైన, స్థిరమైన, సమతుల్యమైన మరియు ఉద్యోగ-సంపన్నమైన వృద్ధి కోసం ప్రాధాన్యత కలిగిన కార్మికులు, ఉపాధి మరియు సామాజిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలపై సమీక్షించే ఆదేశం ఈడబ్ల్యుజీకి ఉంది. కార్మిక ఉపాధి కల్పన శాఖ (ఎంఓఎల్ఈ) భారతదేశపు అధ్యక్షతన జరగనున్న ‘జీ20 ఎంప్లాయ్‌మెంట్ వర్కింగ్ గ్రూపు’ (ఈడబ్ల్యుజీ) నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తోంది. జీ20 (ఈడబ్ల్యుజీ) యొక్క రెండో సమావేశం ఈడబ్ల్యుజీ 2023కి సంబంధించిన 3 కీలక ప్రాధాన్యతా రంగాల ఫలితాలపై ఏకాభిప్రాయాన్ని పెంపొందించే దిశగా కీలకమైన దశ. మూడు కీలక ప్రాధాన్యతా ప్రాంతాలు i). ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యత అంతరాన్ని పరిష్కరించడం ii). గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ ఎకానమీ, మరియు సామాజిక భద్రత iii). సామాజిక రక్షణకు స్థిరమైన ఫైనాన్సింగ్. సమావేశం మొదటి రోజు ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్, డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్, ఫైనాన్స్ ట్రాక్, జీ20 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రీసెర్చ్ సెంటర్, ఎల్20 మరియు బీ20 చైర్స్ వంటి విభిన్న ప్రాధాన్యతా రంగాలపై దృష్టి సారించే సెషన్‌లు ఉంటాయి. రెండో ఈడబ్ల్యుజీ సమయంలో మంత్రుత్వ కమ్యూనిక్ మరియు చర్చల సారాంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చే ఫలిత పత్రాలపై చర్చ జరుగుతుంది. జీ20 దేశాలలో దాని అంతిమ అమలు ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు దిశను నిర్వచించడంలో కమ్యూనిక్ కీలకం. జీ20 ఈడబ్ల్యుజీ యొక్క మూడు రోజుల సమావేశం అస్సాం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించే కార్యక్రమాలను కూడా కలిగి ఉంటుంది.
*****
(रिलीज़ आईडी: 1913254)
आगंतुक पटल : 229