ప్రధాన మంత్రి కార్యాలయం
ఏప్రిల్ 3న సీబీఐ వజ్రోత్సవాలను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
సీబీఐలో అత్యుత్తమ పరిశోధక అధికారులకు స్వర్ణ పతకం.. రాష్ట్రపతి
విశిష్ట సేవ పోలీసు పతకాలను ప్రదానం చేయనున్న ప్రధానమంత్రి;
సీబీఐ వజ్రోత్సవ సంవత్సరం సందర్భంగా ప్రధానమంత్రి
చేతులమీదుగా స్మారక తపాలా బిళ్ల, నాణెం ఆవిష్కరణ;
Posted On:
02 APR 2023 9:48AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 3న మధ్యాహ్నం 12 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్రీయ నేరపరిశోధక సంస్థ (సీబీఐ) వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విశిష్ట సేవకుగాను రాష్ట్రపతి పోలీసు పతకం, అత్యుత్తమ పరిశోధనకుగాను స్వర్ణ పతకాలను సీబీఐ అధికారులకు ప్రదానం చేస్తారు. అలాగే షిల్లాంగ్, పుణె, నాగ్‌పూర్ నగరాల్లో నిర్మించిన సీబీఐ కార్యాలయ ప్రాంగణాలను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. వీటితోపాటు సీబీఐ వజ్రోత్సవ సంవత్సరంలో భాగంగా స్మారక తపాలా బిళ్లను, నాణేన్ని ఆయన ఆవిష్కరిస్తారు. అంతేకాకుండా సీబీఐ ట్విట్టర్ హ్యాండిల్‌ను కూడా ప్రారంభిస్తారు.
భారత ప్రభుత్వ దేశీయ వ్యవహారాల మంతిత్వశాఖ తీర్మానం మేరకు 1963 ఏప్రిల్ 1వ తేదీన కేంద్రీయ నేరపరిశోధక సంస్థ (సీబీఐ) ఏర్పాటైంది.
(Release ID: 1913158)
Visitor Counter : 214
Read this release in:
Marathi
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam