గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గాంధీనగర్‌లో గనుల మంత్రిత్వ శాఖ ద్వారా జీ 20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ (ETWG) సమావేశం మరియూ సదస్సు


గనుల శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ "ఇంధన భద్రత మరియూ వైవిధ్య సరఫరా వ్యవస్థలు" సెషన్‌కు అధ్యక్షత వహించారు

Posted On: 02 APR 2023 1:08PM by PIB Hyderabad

భారత్‌లో భారత అధ్యక్షతన ఈ ఏడాది జి20 సమావేశాలుజరుగుతున్నాయి. కొనసాగుతున్న జీ 20 క్రింద శక్తి పరివర్తన వర్కింగ్ గ్రూప్ చర్చలలో పాల్గొనే మంత్రిత్వ శాఖలలో గనుల మంత్రిత్వ శాఖ ఒకటి. ఈ టీ డబ్ల్యూ జీ  యొక్క మొదటి సమావేశం ఫిబ్రవరి, 2023లో కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది. రెండవ ఈ టీ డబ్ల్యూ జీ  సమావేశం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 2 ఏప్రిల్ 2023 నుండి 4వ తేదీ వరకు నిర్వహించబడుతుంది.

 

రాబోయే 2వ ఈ టీ డబ్ల్యూ జీ  సమావేశంలో, గనుల కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ రేపు (03.04.2023) చైర్‌పర్సన్, సీ ఈ ఏ తో కలిసి “ఇంధన భద్రత మరియు వైవిధ్యమైన సరఫరా వ్యవస్థ” సమస్యపై జరిగే సెషన్‌కు అధ్యక్షత వహిస్తారు. ఈ సెషన్‌లో గనుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఈ అంశంపై ప్రజెంటేషన్ కూడా చేస్తారు.  1వ ఈటీడబ్ల్యూజీ సందర్భంగా జరిగిన చర్చలలో సభ్యులు ఈ సమస్యపై వ్యక్తం చేసిన అభిప్రాయాల పై  చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. 2వ ఈటీడబ్ల్యూజీ సందర్భంగా జరిగే చర్చలు ఈ అంశంపై భారత అధ్యక్షత జరిగే జీ 20 లో ఈ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత తీర్మానాలకు విస్తృత ఫ్రేమ్‌వర్క్‌ను అందిస్తాయి.

 

ఈ 2వ ఈటీడబ్ల్యూజీ సందర్భంగా, మైన్స్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి "అంతర్జాతీయ సహకారం ద్వారా క్లిష్టమైన ఖనిజాల సరఫరా వ్యవస్థ లో లోపాలను పరిష్కరించడం" అనే అంశంపై అధ్యయన నివేదికను కూడా విడుదల చేస్తారు. ఈ సమస్యపై మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక సమగ్ర అవగాహన జీ కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో గనుల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ అధ్యయనం ప్రారంభించబడింది.

 

మరింత చర్చకు మరియు సమస్యపై బహుళ పక్షాల నుండి సూచనలను పొందేందుకు ఒక సైడ్ ఈవెంట్ ఉంటుంది. సైడ్ ఈవెంట్ 03.04.2023న 14:00 నుండి 16:30 గంటలకు షెడ్యూల్ చేయబడింది. . ఈ సైడ్ ఈవెంట్‌ను గనుల మంత్రిత్వ శాఖ నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖతో కలిసి ఏ డీ బీ  మరియు సీ ఈ ఈ డబ్ల్యూ  నాలెడ్జ్ పార్టనర్స్ గా వారి సహాయంతో  నిర్వహిస్తోంది. సైడ్ ఈవెంట్ యొక్క అంశం ఏమిటంటే, “శక్తి పరివర్తనను ముందుకు తీసుకెళ్లడానికి పునరుత్పాదక మరియు క్లిష్టమైన ఖనిజాల సరఫరా వ్యవస్థల వికేంద్రీకరణ ను బహులీకరణను పెంచడం”.

 

ఈ సైడ్ ఈవెంట్‌లో రెండు ప్యానెల్ చర్చలు కూడా జరుగుతాయి. మొదటి ప్యానెల్ “పునరుత్పాదక ఇంధన సరఫరా వ్యవస్థల భద్రత లభ్యత” అనే అంశంపై చర్చిస్తుంది మరియు రెండవ ప్యానెల్ “ఉత్పత్తిని పెంచడం మరియు సర్క్యులారిటీ ద్వారా ఖనిజాల విలువ వ్యవస్థను బలోపేతం చేయడం” అనే అంశంపై చర్చిస్తుంది.

***


(Release ID: 1913101) Visitor Counter : 185