ఆయుష్

ఏప్రిల్ 7న దిబ్రూగఢ్‌లో యోగా మహోత్సవ్‌ను నిర్వహించనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ: సర్బానంద సోనోవాల్


ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి కేశబ్ మహంతతో కలిసి దిబ్రూగఢ్ యూనివర్సిటీ ప్రాంగణంలో వేదిక స్థలాన్ని సందర్శించారు.

మార్క్యూ యోగా మహోత్సవ్ ఈ 75 రోజులు అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు దిబ్రూఘర్ ఉత్సవం (IDY2023) జరుపుకుంటుంది

సోనోవాల్ డిబ్రూగఢ్ యూనివర్సిటీ విద్యార్థులతో సంభాషించారు. 'యోగా మహోత్సవ్'లో చురుకుగా పాల్గొనాలని వారికి పిలుపునిచ్చారు.

Posted On: 01 APR 2023 7:10PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ శాఖ 2023 ఏప్రిల్ 7న దిబ్రూగఢ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 75 రోజుల ‘యోగ మహోత్సవ్’ను నిర్వహిస్తోంది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు ఆయుష్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ రోజు డిబ్రూగఢ్ విశ్వవిద్యాలయంలోని వేదిక ను సందర్శించి ఈవెంట్‌కు సంబంధించిన సన్నాహాలను పరిశీలించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేశబ్ మహంతతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, డిబ్రూఘర్ జిల్లా యంత్రాంగంతో కలిసి ఈరోజు ఇక్కడ పర్యటించారు.

 

ఈ సందర్భంగా ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, “మన అందమైన దిబ్రూఘర్ ఏప్రిల్ 7, 2023న దేశంలోనే అతిపెద్ద యోగా ఈవెంట్‌లలో ఒకదానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున ఇది చాలా గర్వించదగిన క్షణమని అన్నారు. అదే రోజున ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. మానవాళికి మెరుగైన, ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవించడానికి ఒక మార్గాన్ని సృష్టించడం ఈ ఉత్సవం సందర్భం. యోగా అది చేయగలదు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ యొక్క స్థిరమైన కృషి కారణంగా, మెరుగైన ఆరోగ్యం మానసిక ప్రశాంతత సాధించే దిశగా యోగా ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారింది. మన దేశ వారసత్వానికి అనుగుణంగా, నాణ్యమైన మానవ జీవితాలకు యోగ ఓ అమృతవరం లా మారుతున్న ఈ యోగా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారతదేశం ప్రతి ప్రయత్నానికి చిత్తశుద్ధి తో కట్టుబడి ఉంది. మంచి రేపటి కోసం యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది. యోగా మహోత్సవ్ ఆరోగ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలలో సమాజంలోని వివిధ వర్గాల వారిని కలుపుకొని పోవడాన్ని ప్రోత్సహించడం మరియు వైవిధ్యాన్ని ఉత్సవం గా జరుపుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని మరియు భారతదేశం యొక్క గొప్ప వారసత్వం యొక్క అద్భుత ఫలాలను వారి జీవితాలలో ఆస్వాదించాలని నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను.

 

 

కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి మరియు డిబ్రూఘర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జితేన్ హజారికాతో పాటు విశ్వవిద్యాలయ విద్యార్థులతో కూడా సంభాషించారు. మన జీవితాలను మెరుగుపరచడంలో ఆయుష్ యొక్క ప్రాముఖ్యత నుండి దేశ నిర్మాణంలో వారి పాత్రను మరింతగా పెంచడంలో విద్యార్థుల ప్రయోజనం కోసం సృష్టించబడిన అవకాశాల వరకు వివిధ అంశాలను మంత్రి ప్రస్తావించారు. యోగా మహోత్సవ్‌ను విజయవంతం చేయడంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ పిలుపునిచ్చారు.

విద్యార్థులతో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ విద్యార్థులే మన భవిష్యత్తుకు వెన్నెముక. మన దేశ  పురోగతి యొక్క దిశ, వేగం మరియు సమయం అంతర్గతంగా విద్యార్థులతో ముడిపడి ఉంది. ఈరోజు, దేశ నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా మరియు నిబద్ధతతో కూడిన ఉత్సాహభరితమైన మరియు చైతన్యవంతులైన విద్యార్థి బృందాన్ని కలిగి ఉండటం మన అదృష్టం. భారతదేశం అమృత్‌కాల్‌లోకి ప్రవేశిస్తున్నప్పుడు భారతదేశాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చాలనే ప్రధాని మోదీ జీ యొక్క దార్శనికతను సాకారం చేసుకోవడానికి , దేశ నిర్మాణ లక్ష్యం పట్ల అంకితభావం, నిబద్ధత మరియు లక్ష్య శుద్ధి గల విద్యార్థులను చూడడం నాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది.  డిబ్రూఘర్ విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ మేధతో ఆయా రంగాలలో దేశం గర్వించేలా మెరుగైన రేపటి కోసం పరిష్కారాలను రూపొందించడంలో సహాయపడే కృషి ని కొనసాగిస్తారని నేను విశ్వసిస్తున్నాను.

***



(Release ID: 1913082) Visitor Counter : 180