గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశ ఇంధన రంగంలో వస్తున్న మార్పులకు కీలకం కానున్న విభిన్న వృత్తాకార పునరుత్పాదక శక్తి, క్లిష్టమైన ఖనిజ సరఫరా వ్యవస్థ

Posted On: 01 APR 2023 1:42PM by PIB Hyderabad

ఇంధన వినియోగం లో మార్పులు తీసుకురావడానికి విభిన్న వృత్తాకార పునరుత్పాదక శక్తి,  క్లిష్టమైన ఖనిజ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం అనే అంశంపై ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జీ-20 అధ్యక్ష హోదాలో  గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 2023 ఏప్రిల్  3న జరిగే  2వ  ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో భాగంగా ఆసియా అభివృద్ధి  బ్యాంకు (ఏడీబీ)  కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (CEEW) సహకారంతో నూతన పునరుత్పాదక ఇంధన శాఖ, గనుల శాఖ, ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది.  ఇంధనరంగంలో మార్పులు తీసుకు రావడానికి  పునరుత్పాదక శక్తి, క్లిష్టమైన ఖనిజ సరఫరా వ్యవస్థలను, విలువ ఆధారిత రవాణా వ్యవస్థ అభివృద్ధి అంశాలపై  సమావేశం    చర్చిస్తుంది.

నూతన  పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ భూపిందర్ సింగ్ భల్లా గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ప్రారంభ ప్రసంగం చేస్తారు. సమావేశంలో  పరిశ్రమ,విద్యారంగం, విధాన రూపకల్పన   రంగాల్లో ప్రపంచంలోని ప్రముఖ నిపుణులు సమావేశంలో పాల్గొంటారు. 

ప్రారంభ సమావేశం తర్వాత కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్  సీఈఓ డాక్టర్ అరుణభా ఘోష్ సంస్థ రూపొందించిన  'శక్తి పరివర్తన కోసం స్థితిస్థాపకమైన పునరుత్పాదక శక్తి సరఫరా గొలుసులను అభివృద్ధి చేయడం' మరియు 'క్లిష్టమైన ఖనిజాల సరఫరా వ్యవస్థలో సమస్యలు  పరిష్కరించడం' అనే అంశాలపై సిద్ధం చేసిన నివేదికలను విడుదల చేస్తారు.   ఈ కార్యక్రమంలో పునరుత్పాదక ఇంధన సరఫరావ్యవస్థను పటిష్టం చేయడం,  ఉత్పత్తిని ఎక్కువ, లభ్యత మెరుగుపరచడం ద్వారా ఖనిజ విలువ వ్యవస్థను  బలోపేతం చేయడం అనే రెండు అంశాలపై  రెండు ప్యానెల్ చర్చలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ అధ్యక్షుడు,విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ  అలోక్ కుమార్, ఆసియా అభివృద్ధి బ్యాంకు ,దక్షిణాసియా ప్రాంతీయ విభాగం డైరెక్టర్ జనరల్    కెనిచి యోకోయామా, గుజరాత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమతా వెర్మ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) ఎనర్జీ ఎఫిషియన్సీ డివిజన్ హెడ్ డాక్టర్ బ్రెయిన్ మదర్ వే,ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్  డైరెక్టర్ జనరల్   డాక్టర్ అజయ్ మాథుర్,  అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ  డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గౌరీ సింగ్, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్   రాజర్షి గుప్తా, ఇంధన రంగంపై ఏర్పాటైన సీఐఐ జాతీయ కమిటీ సహ అధ్యక్షుడు శ్రీ  రాజీవ్ రంజన్ మిశ్రా, ప్రైవేట్ సెక్టార్ ఆపరేషన్స్, ఏడీబీ దక్షిణాసియా హెడ్ శ్రీ మయాంక్ చౌదరి,   రీసెర్చ్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్, ఎకనామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆసియన్ ఈస్ట్ ఆసియా (ERIA)  డైరెక్టర్ డాక్టర్ వి.  అన్బుమొళి,  ఎనర్జీ ట్రాన్సిషన్, ఏడీబీ  డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ తారకన్ పాల్గొంటారు. 

 కర్బన ఉద్గారాలు, వాతావరణ పరంగా ఎక్కువ అవుతున్న ప్రమాదాలు, భౌగోళిక రాజకీయ ప్రతికూలత పరిస్థితులతో ప్రపంచ ఆర్థిక అభివృద్ధి ముడిపడి ఉంటుంది. ప్రపంచం శూన్య ఉద్గారాల విడుదల స్థాయికి

చేరుకోవడానికి  2021  2050 మధ్య సౌర మరియు పవన విద్యుత్ సామర్థ్యాలు వరుసగా 17, 10 రెట్లు పెరగాల్సి ఉంటుంది.  విద్యుత్ వినియోగంలో ఆశించిన మార్పులు రావడానికి వార్షిక బ్యాటరీ విస్తరణలు వరుసగా 50 రెట్లు మరియు 28 రెట్లు పెరగాలి. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి  సౌర, గాలి, బ్యాటరీలు, హైడ్రోజన్ వంటి  పునరుత్పాదక ఇంధన వనరులు ప్రపంచ దేశాలకు అందుబాటులో వచ్చినప్పుడు మాత్రమే శూన్య ఉద్గారాల విడుదల స్థాయికి చేరుకోవడానికి అవకాశం కలుగుతుంది. లు ప్రాప్యతను పొందగలిగితే మాత్రమే పునరుత్పాదకతలకు ప్రమాద నిరోధక పరివర్తన సాధ్యమవుతుంది. పునరుత్పాదక శక్తి వ్యవస్థాపిత సామర్థ్యంలో భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. 2070 నాటికి శూన్య ఉద్గారాల విడుదల స్థాయి  లక్ష్యాన్ని చేరుకోవడానికి వేగంగా చర్యలు అమలు చేస్తోంది. 

 క్లీన్ ఎనర్జీ సాంకేతిక పరిజ్ఞానంలో   ఉపయోగించే అనేక ఖనిజాలు చాలా అరుదుగా లభిస్తాయి.  కొన్ని భౌగోళిక ప్రాంతాలలో మాత్రమే ఖనిజాలు కేంద్రీకృతమై ఉంటాయి.  పునర్వినియోగం,నిరంతరం రీ సైకిల్ చేయగల సామర్థ్యం ఖనిజ-ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉంటుంది.  తగిన సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం వల్ల  విశ్వసనీయమైన పదార్ధాలు  సరఫరా చేయడానికి వీలవుతుంది. వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, విలువ ఆధారిత  ఖనిజ సరఫరా చేయడానికి ఈ చర్య  సహాయపడుతుంది. దాని అధ్యక్ష హోదాలో జీ-20 దేశాలకు  భారతదేశం ప్రతిపాదించిన  మిషన్ లైఫ్ (పర్యావరణహిత జీవనశైలి)  సూత్రాలు పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి, వినియోగంలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయి. 

ఈ కార్యక్రమంలో ముగింపు ప్రసంగాన్నినూతన  పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  శ్రీ దినేష్ డి జగ్దాలే ,గనుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  డాక్టర్ వీణా కుమారి ఇస్తారు.

***


(Release ID: 1912872)