రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జనరల్ నావల్ ఆపరేషన్స్ (డిజిఎన్‌ఓ) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్

Posted On: 01 APR 2023 2:07PM by PIB Hyderabad

డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్‌గా వైస్ అడ్మిరల్ అతుల్ ఆనంద్, ఏవీఎస్ఎమ్, వీఎస్ఎమ్, శనివార (01 ఏప్రిల్ 2023న) బాధ్యతలు స్వీకరించారు. అతుల్ ఆనంద్ తొలత 01 జనవరి 1988న ఇండియన్ నేవీ యొక్క ఎగ్జిక్యూటివ్ శాఖలో నియమించబడ్డారు. అతను నేషనల్ డిఫెన్స్ అకాడమీ (71వ కోర్సు, డెల్టా స్క్వాడ్రన్) డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్, మిర్పూర్ (బంగ్లాదేశ్) మరియు నేషనల్ డిఫెన్స్ కాలేజ్, న్యూ ఢిల్లీలో పూర్వ విద్యార్థి.అతను అమెరికలో హవాయిలో నిర్వహించిన ‘ఆసియా పసిఫిక్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్‌’లో  నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ శిక్షణ కార్యక్రమానికీ హాజరయ్యాడు. అతుల్ ఆనంద్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్‌లో ఎంఫిల్ మరియు ఎంఎస్సీ, డిఫెన్స్ స్టడీస్‌లో మాస్టర్స్ మరియు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశారు. ఆయన అందించిన సేవలకు గాను అతి విశిష్ట సేవా పతకం మరియు విశిష్ట సేవా పతకం లభించాయి. టార్పెడో రికవరీ నౌక ఐఎన్ టీఆర్వీ ఏ72, క్షిపణి పడవ ఐఎన్ఎస్ చతక్, కార్వెట్ ఐఎన్ఎస్ ఖుక్రీ మరియు డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ముంబై యొక్క కమాండ్‌తో సహా తన నౌకాదళ వృత్తిలో అనేక కీలక పదవులలో గతంలో అతుల్ ఆనంద్ నియమితులై సేవలందించారు. దీనికి తోడు అతుల్ ఆనంద్ జాయింట్ డైరెక్టర్ సిబ్బంది అవసరాలు, వెల్లింగ్‌టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్‌లో డైరెక్టింగ్ స్టాఫ్, డైరెక్టర్ నావల్ ఆపరేషన్స్ మరియు డైరెక్టర్ నావల్ ఇంటెలిజెన్స్ (ఓపీఎస్)  విభాగాలలో కూడా సేవలందించారు. రక్షణ మంత్రిత్వ శాఖ (నేవీ) యొక్క ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రిన్సిపల్ డైరెక్టర్ నేవల్ ఆపరేషన్స్ మరియు ప్రిన్సిపల్ డైరెక్టర్ స్ట్రాటజీ, కాన్సెప్ట్స్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌గా కూడా పనిచేశారు. ఫ్లాగ్ ఆఫీసర్‌గా అతుల్ ఆనంద్ అతను అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ (ఫారిన్ కోఆపరేషన్ అండ్ ఇంటెలిజెన్స్), ఖడక్వాస్లాలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిప్యూటీ కమాండెంట్ మరియు చీఫ్ ఇన్‌స్ట్రక్టర్‌గా, మహారాష్ట్ర నావల్ ఏరియా కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ మరియు కర్ణాటక నావల్ ఏరియా కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. వైస్ అడ్మిరల్  అతుల్ ఆనంద్  గూల్రుఖ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం రష్మీ ముంబైలో న్న డిజిటల్ మార్కెటింగ్ వ్యవస్థాపకుడిగా పని చేస్తున్నారు. అబ్బాయి రోహన్ ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. 

***



(Release ID: 1912869) Visitor Counter : 152