సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను చివరి లబ్దిదారుడి వరకు తీసుకెళ్లాలని పీఆర్‌ఐ ప్రతినిధులను కోరిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ సంస్థ ప్రతినిధుల సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..అట్టడుగు ప్రజలతో నేరుగా టచ్‌లో ఉన్నందున పీఆర్‌ఐలు ప్రధాని మోదీ ప్రజాకేంద్రీకృత కార్యక్రమాలు మరియు కార్యక్రమాలకు సందేశకులుగా ఉంటారని అన్నారు.

అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యానికి మోదీ ప్రతీక. ఎందుకంటే ఆయన అట్టడుగు స్థాయి నుండి ఎదిగారు: డాక్టర్ జితేంద్ర సింగ్

సబ్కా ప్రయాస్‌ లక్ష్యంతో కేంద్రం గత 8 సంవత్సరాలలో అనేక పథకాలను 100% సంతృప్తతకు చేరువ చేయగలిగింది.

Posted On: 01 APR 2023 1:26PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎర్త్‌ సైన్సెన్స్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత);ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు పీఆర్‌ఐ ప్రతినిధులను ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాలను చివరి లబ్దిదారుడి వరకు తీసుకెళ్లాలని కోరారు.

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ సంస్థల ప్రతినిధుల సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..అట్టడుగు ప్రజలతో నేరుగా టచ్‌లో ఉన్నందున వారు ప్రధాని మోదీ చేపట్టిన ప్రజాకేంద్రీకృత కార్యక్రమాలు మరియు కార్యక్రమాలకు అత్యంత ముఖ్యమైన దూతలు కాగలరని అన్నారు. మోదీ హయాంలో పంచాయతీలు నిరంతరం సాధికారత పొందుతున్నాయని చెప్పారు.

 


ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన పిఆర్‌ఐలకు సమాజంలోని అట్టడుగు వర్గాలలో ఎవరు అత్యంత అవసరం ఉన్నారో తెలుసుకుని ఎలాంటి ఓటు బ్యాంకును పరిగణనలోకి తీసుకోకుండా ప్రయోజనాలు వారికి చేరేలా చూడాలని మంత్రి సూచించారు.  డాక్టర్ జితేంద్ర సింగ్ మోదీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ “దేశం 100 శాతం మంది లబ్ధిదారులను కవర్ చేయడానికి ఈ సంకల్పం చేసింది.పథకాలకు 100 శాతం కవరేజీ వస్తే బుజ్జగింపు రాజకీయాలకు తెరపడుతుంది." అని తెలిపారు.

అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యానికి మోదీ ప్రతీక అని, తాను అట్టడుగు స్థాయి నుంచి ఎదిగినందున వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి కల్పించారని డాక్టర్ జితేంద్ర సింగ్ ఉద్ఘాటించారు. పిఆర్‌ఐ ప్రతినిధుల విచక్షణతో కేంద్ర నిధులను సమర్ధవంతంగా వినియోగించుకోవడంతో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయాలని, అధికారాలను వికేంద్రీకరించాలని ఆయన స్పష్టం చేశారు.

70 ఏళ్ల తర్వాత తొలిసారిగా జమ్మూ కశ్మీర్ జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలు ఆయన జోక్యం వల్లనే జరిగాయని..పంచాయతీరాజ్ సంస్థలు, అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యంపై ప్రధానికి ఉన్న విశ్వాసం తద్వారా స్పష్టమవుతోందని మంత్రి పేర్కొన్నారు.

 


అభివృద్ధి కార్యక్రమాలను సమయానుకూలంగా పూర్తి చేయవలసిన అవసరాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు. ఎటువంటి నాణ్యతతో రాజీ పడకుండా ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి కొత్త సాంకేతికతలు మరియు ఆవిష్కరణలను అనుసరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

2014 మేలో మోదీ బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశ జనాభాలో దాదాపు సగం మందికి మరుగుదొడ్లు, గృహాలు, అందుబాటులో టీకాలు, విద్యుత్ కనెక్షన్లు, బ్యాంకు ఖాతాలు లేవని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ‘సబ్‌కా ప్రయాస్‌’తో గత 8 ఏళ్లలో కేంద్రం అనేక పథకాలను 100% సంతృప్తతకు చేరువ చేసిందని ఆయన అన్నారు. రాబోయే 25 సంవత్సరాల అమృత్‌కాల్‌లో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మార్చాలన్న  సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.

అట్టడుగు స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పీఆర్‌ఐ ప్రతినిధుల కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు.గ్రామీణ భారతంలో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా వినియోగించుకోవాలని తద్వారా అందరికి ఆ పథకాలు అందాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును వారు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని ఆయన పీఆర్‌ఐలకు సూచించారు. కేంద్ర పథకాలకు నిధుల కొరత ఉండదని మోదీ ప్రభుత్వం పలు సందర్భాల్లో పునరుద్ఘాటిస్తోందన్నారు.


 

*****


(Release ID: 1912849) Visitor Counter : 160