గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
నగరాల వ్యాప్తంగా మహిళలు నాయకత్వం వహించగా చెత్త రహిత నగరాల కోసం ప్రతిజ్ఞ చేసిన 1.7 మిలియన్ మంది
3000కుపైగా నగరాలు, పట్టణాలలో చెత్తరహిత భారత్ కోసం స్వచ్ఛ మషాల్ మార్చ్ ర్యాలీలకు నాయకత్వం వహించిన మహిళలు
నా నగరాన్ని/ పట్టణాన్ని చెత్తరహితంగా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను
Posted On:
31 MAR 2023 3:57PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా చెత్తరహిత నగరాల కోసం, పారిశుద్ధ్య డ్రైవ్‌లను, సున్నా వ్యర్ధాల కార్యక్రమాల కోసం వివిధ నగరాలకు చెందిన పౌరులు తమను తాము సమీకరించుకుని తొట్ట తొలి స్వచ్ఛ మషాల్ మార్చ్‌ను నిర్వహించడం ఒక అద్భుత దృశ్యం. కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి తమిళనాడులోని తిరువూరు వరకు మహిళా పరివర్తనకారులు పట్టణ పారిశుద్ధ్యం పట్ల తమ చిత్తశుద్ధిని ప్రదర్శించారు.
ప్రతి మషాల్ మార్చ్ కూడా స్వచ్ఛతకు సంబంధించి ప్రవర్తనలో మార్పు కోసం పిలుపిచ్చింది. చెత్తకు వ్యతిరేకంగా దేశంలోని 3000కు పైగా పట్టణాలలో, నగరాలలో పోరాటాన్ని ఉధృతం చేసి భారత్ చెత్తరహితంగా చేసేందుకు 29, 30, 31 మార్చి,2023న జరిగిన స్వచ్ఛ మషాల్ మార్చ్ ర్యాలలో లక్షలాదిమంది స్వచ్ఛతా మహిళా పోరాట కార్యకర్తలు పాల్గొనడం కనిపించింది. పట్టణ, నగర పరిదృశ్యాన్ని పరివర్తనకు లోనుచేసేందుకు దేశంలోని నలుమూలల నుంచి చేసిన ప్రయాణం స్ఫూర్తిదాయకం. చెత్త రహిత నగరాల లక్ష్యం దిశగా వార్డు స్థాయి వరకు పౌరులను సమీకరించడాన్ని ప్రోత్సహించడం స్వచ్ఛ మషాల్ మార్చ్ లక్ష్యం.
తొలి మషాల్ మార్చ్ సున్నా వ్యర్దాల దినోత్సవం సందర్భంగా ప్రారంభమైంది. పౌరులు (ముఖ్యంగా మహిళా స్వచ్ఛతా నాయకులు అనగా స్వచ్ఛతా దూతలు) చెత్త రహిత నగరాల నిర్మాణం పట్ల తమ చిత్తశుద్దిని పునరుద్ఘాటించేందుకు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ఈ ర్యాలీలలో పాల్గొని, స్వచ్ఛత స్ఫూర్తిని వేడుక చేసుకోవడం కనిపించింది.
రాత్రి, పగలు కూడా సాగిన ఈ ర్యాలీలలో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రీమియర్ స్వచ్ఛతా ఛాంపియన్ నగరాలైన భోపాల్, ఉజ్జయినిలలో స్వచ్ఛ మషాల్ మార్చ్ ర్యాలీలకు మహిళలు నాయకత్వం వహించగా, పెద్ద సంఖ్యలో పౌరులు పాల్గొనడం కనిపించింది.
పశ్చిమ బెంగాల్‌కు చెందిన మధ్యమ్‌గ్రామం, ఘటాల్ నగరాలకు చెందిన మహిళలు 30 మార్చి, 2023న శుభప్రదమైన రామ నవమి స్వచ్ఛ మషాల్ మార్చ్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు.
స్వచ్ఛ మషాల్ మార్చ్ అన్నది ప్రజలలో ఎంత ప్రబలంగా ఉత్సాహాన్ని ఉత్తేజాన్నీ రేకెత్తించిందంటే, వారు భారీ సంఖ్యలో భుజంతో భుజాన్ని కలిపి నడవడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పట్టి చూపారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లోని మధురలో జరిగిన ఒక నిర్ధిష్ట మార్చ్‌లో కీర్తనలు పాడడం ద్వారా ఐక్యతాభావాన్ని ప్రేరేపించడం ఒక సుందర దృశ్యంగా చెప్పుకోవచ్చు.
దేశంలోని దక్షిణాది ప్రాంతంలో తెలంగాణలోని నగరాలు, పట్టణాలలో పెద్ద సంఖ్యలో మషాల్ మార్చ్‌ను నిర్వహించడం పట్ల ప్రజలు చాలా ఆసక్తి చూపి, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలు వరంగల్, ఇల్లెందు, కొత్తూరు సహా పలు పట్టణాలు, నగరాలలో నిర్వహించారు.
అదనంగా, స్వచ్ఛ మషాల్ మార్చ్ ర్యాలీలలో పాల్గొన్నవారంతా కూడా పారిశుద్ధ్యపు మూల విలువలను అనుసరించి, బోధించి, స్వీకరించి, ఆచరించి, సందేశాన్ని వ్యాప్తి చేస్తామని స్వచ్ఛత ప్రతజ్ఞ చేశారు.
***
(Release ID: 1912759)
Visitor Counter : 146