ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఫిబ్రవరిలో మొబైల్ నంబర్‌లతో 10.97 మిలియన్ల ఆధార్‌లను సీడ్ చేసిన యూఐడీఏఐ; జనవరి కంటే ఈ సంఖ్య 93% అధికం
ఆధార్ ప్రామాణీకరణ లావాదేవీలు ఫిబ్రవరిలో 13% పెరిగి 226 కోట్లకు చేరుకున్నాయి
प्रविष्टि तिथि:
31 MAR 2023 3:36PM by PIB Hyderabad
2023 ఫిబ్రవరి నెలలో నివాసితుల నుండి వచ్చిన అభ్యర్థనలను అనుసరించి 10.97 మిలియన్లకు పైగా మొబైల్ నంబర్‌లు ఆధార్‌లో సీడ్ చేయబడ్డాయి. ఇది గత నెలతో పోలిస్తే 93 శాతం ఎక్కువ.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకారం నివాసితుల దరఖాస్తును అనుసరించి 5.67 మిలియన్ల మొబైల్ నంబర్లు సీడ్ చేయబడ్డాయి. ఫిబ్రవరిలో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.
సంక్షేమ సేవలు మరియు స్వచ్ఛంద సేవలను పొందుతున్నప్పుడు మెరుగైన మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం వారి ఆధార్‌ను మొబైల్ నంబర్‌తో లింక్ చేయమని నివాసితులను యూఐడిఏఐ ప్రోత్సహిస్తోంది.
ఈ పెరుగుదల యూఐడీఏఐ నిరంతర ప్రోత్సాహం సులభతరం మరియు వివిధ సేవలను పొందడం కోసం వారి మొబైల్ నంబర్‌ను అప్‌డేట్‌గా ఉంచడానికి నివాసితుల సుముఖతను సూచిస్తుంది. దాదాపు 1700 కేంద్ర మరియు రాష్ట్ర సాంఘిక సంక్షేమ డైరెక్ట్ బెనిఫిట్ టాన్స్‌ఫర్ (డిబిటి) మరియు సుపరిపాలన పథకాలు ఆధార్ వినియోగం కోసం నోటిఫై చేయబడ్డాయి.
భారతదేశంలోని అన్ని రంగాల్లో ఆధార్ స్వీకరణ మరియు వినియోగం పెరుగుతోంది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే 226.29 కోట్ల ఆధార్ ప్రామాణీకరణ లావాదేవీలు జరిగాయి. జనవరిలో 199.62 కోట్ల లావాదేవీలతో 13 శాతం కంటే ఎక్కువ వృద్ధి చెందింది.
2023 ఫిబ్రవరి చివరి నాటికి 9,255.57 కోట్ల ఆధార్ ప్రామాణీకరణ లావాదేవీలు అమలు చేయబడ్డాయి. చాలా వరకు ప్రామాణీకరణ లావాదేవీల సంఖ్య వేలిముద్రను ఉపయోగించడం ద్వారా నిర్వహించబడ్డాయి.దాని తర్వాత ఓటీపీ ఆధారిత లావాదేవీలు ఉన్నాయి.
అదేవిధంగా ఆధార్ ఇ-కెవైసీ సేవ బ్యాంకింగ్ మరియు నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవలకు పారదర్శకమైన మరియు మెరుగైన కస్టమర్ అనుభవాన్ని అందించడం ద్వారా మరియు సులభంగా వ్యాపారం చేయడంలో సహాయం చేయడం ద్వారా ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తోంది. ఫిబ్రవరి నెలలో 26.79 కోట్లకు పైగా ఇ-కెవైసి లావాదేవీలు జరిగాయి.
ఇ-కెవైసీని స్వీకరించడం వలన ఆర్థిక సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మరియు ఇతర సంస్థల కస్టమర్ సముపార్జన ఖర్చు తగ్గింది. మొత్తంగా ఫిబ్రవరి చివరి నాటికి ఇప్పటివరకు ఆధార్ ఇ-కెవైసి లావాదేవీలు 1,439.04 కోట్లకు చేరుకున్నాయి.
లాస్ట్ మైల్ బ్యాంకింగ్‌తో పాటు డైరెక్ట్ ఫండ్ ట్రాన్స్‌ఫర్, గుర్తింపు ధృవీకరణకు ఇ-కేవైసీ లేదా ధృవీకరణ వంటి ఆంశాల్లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియా విజన్‌కి మద్దతు ఇవ్వడంలో అలాగే నివాసితులకు జీవన సౌలభ్యం అందించడంలో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది.
గత దశాబ్దంలో ఆధార్ సంఖ్య భారతదేశంలో నివాసితుల గుర్తింపు రుజువుగా ఉద్భవించింది. ఇది అనేక ప్రభుత్వ పథకాలు మరియు సేవలను పొందేందుకు ఉపయోగించబడుతోంది. 10 సంవత్సరాల క్రితం వారి ఆధార్ తీసుకున్న నివాసితులు మరియు ఆ తర్వాత ఎప్పుడూ అప్‌డేట్ చేయని వారు తమ ఆధార్‌లో తమ పత్రాలను అప్‌డేట్ చేసుకోమని సూచించబడింది.
***
(रिलीज़ आईडी: 1912757)
आगंतुक पटल : 231