సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సహకార రంగంలో పెట్టుబడుల పరిరక్షణకు కట్టుబడిన కేంద్ర ప్రభుత్వం

 
    ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ,  కేంద్ర హోమ్ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా  మార్గదర్శకత్వంలో  కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహకార రంగంతో  సాహచర్యం ఉన్న వారి ప్రయోజనాలను కాపాడేందుకు
కట్టుబడి ఉంది.

    సహకార మంత్రిత్వ శాఖ పిటీషన్ పై గౌరవనీయ సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది.  సహారా గ్రూపునకు చెందిన 4 సహకార సొసైటీలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు డబ్బు వాపస్ ఇవ్వాలని కోర్టు  బుధవారం ఆదేశించింది.  

    ఈ నిర్ణయంతో  సహారా గ్రూపునకు చెందిన 4 సహకార సొసైటీలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి వస్తుంది.  

    సుప్రీంకోర్టు ఆదేశం మేరకు రిటైర్డ్ జడ్జి  శ్రీ ఆర్.సుభాష్ రెడ్డి మదుపరులకు చెల్లింపుల ప్రక్రియను పర్యవేక్షిస్తారు.  ఇందుకు సంబంధించి వెంటనే చర్యలు తీసుకుంటారు.  

     సహకార మంత్రిత్వ శాఖ  చేస్తున్న ఈ ప్రయత్నాలు వల్ల  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం పేదలు  మరియు అణగ

Posted On: 29 MAR 2023 9:00PM by PIB Hyderabad

      ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ,  కేంద్ర హోమ్ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా  మార్గదర్శకత్వంలో  కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సహకార రంగం తో  సాహచర్యం ఉన్న వారి ప్రయోజనాలు కాపాడేందుకు
కట్టుబడి ఉంది. ఈ దిశలో  సహకార మంత్రిత్వ శాఖ వేసిన  పిటీషన్ పై గౌరవనీయ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది.  సహారా గ్రూపునకు చెందిన 4 సహకార సొసైటీలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు సహారా - సెబీ రిఫండ్  ఖాతా నుంచి  మదుపరుల సొమ్ము తిరిగి  ఇవ్వాలని కోర్టు  బుధవారం ఆదేశించింది.  

        సహారా గ్రూపునకు చెందిన నాలుగు సొసైటీలు   -- సహారా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్,  సహారాయణ్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్,  హమారా ఇండియా క్రెడిట్  కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్  మరియు స్టార్స్ మల్టీపర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ -- లను  మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002 ప్రకారం మర్చి 2010 నుంచి జనవరి, 2014 మధ్య రిజిస్టర్ చేశారు.  ఈ  కో ఆపరేటివ్ సొసైటీల డిపాజిటర్లకు డిపాజిట్లను తిరిగి చెల్లించడం లేదని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయి.   ఈ  ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని ప్రాధమిక పరిశీలన తరువాత ఈ సొసైటీలకు నోటీసులు ఇవ్వడం జరిగింది.  ఆ తరువాత కేంద్ర రిజిస్ట్రార్ సమక్షంలో విచారణ జరిగింది. ఇన్వెస్టర్లకు చెల్లించవలసిన సొమ్మును వాపస్ ఇవ్వాలని కేంద్ర రిజిస్ట్రార్ సొసైటీలను ఆదేశించారు.  కొత్త డిపాజిట్లు తీసుకోవడాన్ని నిలిపివేయడంతో పాటు పాతవాటిని పునరుద్ధరించ వద్దని కూడా వారిని ఆదేశించారు.  డిపాజిటర్ల నుంచి అందిన ఒక లక్షా 22 వేల  వ్యాజ్యాలను సహకార మంత్రిత్వ శాఖ డిజిటలైజ్ చేసింది.  వాటిని చెల్లింపుల కోసం కమిటీలకు పంపింది.  అయితే కమిటీలు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోలేదు.    ఈ సొసైటీలలో నగదు ఉంచిన డిపాజిటర్ల నుంచి తమ పెట్టుబడిని వాపస్ ఇవ్వాలని  ప్రతిరోజూ  అసంఖ్యాకంగా దరఖాస్తులు అందుతున్నాయి.  

    కేంద్ర హోమ్ మంత్రి మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఆదేశాల మేరకు సహకార మంత్రిత్వ శాఖ ఈ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి ఆర్ధిక వ్యవహారాల శాఖ,  రెవెన్యూ శాఖ, సెబీ, ఎస్ ఎఫ్ ఐ ఓ మరియు ఈడి మొదలైన సంస్థల అధికారులతో అనేక సమావేశాలు జరిపింది.  ఈ విషయమై స్థితిగతుల నివేదికను సమర్పించడంతో పాటు  పరిష్కారం కోసం మంత్రిత్వ శాఖ గౌరవనీయ సుప్రీం కోర్టులో పిటీషన్ వేసింది.


       సహారా - సెబీ రిఫండ్  ఖాతా నుంచి  రూ. 5,000 కోట్లను సహారా గ్రూప్ లోని నాలుగు సహకార సొసైటీల డిపాజిటర్ల సొమ్ము వాపస్ ఇవ్వడానికి ఉపయోగించాలని గౌరవనీయ సుప్రీంకోర్టును కోరడం జరిగింది.  సహకార మంత్రిత్వ శాఖ  చేస్తున్న ఈ ప్రయత్నాల ద్వారా  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం పేదలు  మరియు అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉందనే విషయం తేటతెల్లమవుతోంది.

      కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన పిటీషన్ మేరకు సహారా - సెబి రిఫండ్ ఖాతాలో నిల్వ ఉన్న సొమ్ము రూ. 5,000 కోట్లను  సహారా గ్రూపు సహకార సొసైటీల ఇన్వెస్టర్లకు వాపస్ ఇవ్వడం కోసం కేంద్ర రిజిస్ట్రార్ కు బదిలీ చేయాలని గౌరవనీయ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

        సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డ్ జడ్జి  శ్రీ ఆర్. సుభాష్ రెడ్డి పర్యవేక్షణలో చెల్లింపుల ప్రక్రియను  కేంద్ర రిజిస్ట్రార్ న్యాయవాది శ్రీ గౌరవ్ అగర్వాల్ సహాయంతో  తొమ్మిది నెలల్లో పూర్తిచేస్తారు.  సహారా గ్రూప్ సహకార సొసైటీలకు చెందిన  న్యాయమైన ఇన్వెస్టర్లకు వారి గుర్తింపునకు,  డిపాజిట్లకు సంబంధించిన  రుజువులు చూసి పారదర్శకమైన ప్రక్రియ ద్వారా వారి బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు చేస్తారు.  

       సహారా గ్రూప్ సహకార సొసైటీలకు చెందిన  న్యాయమైన ఇన్వెస్టర్లకు త్వరలో సహకార మంత్రిత్వ శాఖ పారదర్శకమైన క్రియావిధానం ద్వారా చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించాలని ఉత్తర్వు చేస్తూ  దీని పర్యవేక్షణ బాధ్యతను  రిటైర్డు జడ్జి శ్రీ ఆర్ సుభాష్ రెడ్డికి సుప్రీంకోర్టు అప్పగించింది.   తద్వారా కోట్లాది మంది మదుపరులకు మరియు వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని తెలిపింది.



 

****


(Release ID: 1912333) Visitor Counter : 206


Read this release in: English , Urdu , Hindi , Kannada